2006 వ సంవత్సరం లో రాధా గోపీనాథ్ రాతి అర్చా విగ్రహాలను జైపూర్ నుండి ఇస్కాన్ రాజమండ్రి కి తీసుకురావడం జరిగింది. ప్రతిష్టకు వారం రోజులు ముందు గోదావరి ప్రవాహం ఉదృతమవుతూ ఉంది. ఎన్ని పూజలు చేసినా శాంతిపలేదు. కాని రాధాగోపీనాథ్ పాద పద్మములను స్పర్శించిన తక్షణం గోదావరి మయ్యా శాంతించి ప్రవాహం ఉదృతి తగ్గింది. ఈ విధముగా రాధా గోపీనాథ్ తన లీలను ప్రదర్శించారు. 2006 ఆగష్టు 9 వ తారీకున జయపతాక స్వామి గురుమహారాజ్ మరియు భక్తుల ఆద్వర్యంలో విగ్రహ ప్రతిష్ట జరిగింది.