(Place or click your pointer on the photos below to learn more)
(దిగువ ఉన్న ఫోటోలపై మీ పాయింటర్ ఉంచి లేదా క్లిక్ చేసి సమాచారం తెలుసుకోండి)
మాసం:(చంద్రమాసం) -
నారాయణ,పుష్య
తిథి:(చంద్ర
రోజు)-ఏకాదశి
పక్షం:కృష్ణపక్ష
ఎకాదశి వ్రతం నామ సర్వకామఫల ప్రదం | కర్తవ్యం సర్వదా విమైర్ విష్ణుప్రీణన కారణం 1” సఫల ఏకాదశి మార్గశిర కృష్ణపక్షంలో వస్తుంది. ఈ ఏకాదశి మాహాత్మ్యము శ్రీ ్రికృష్ణధర్మరాజుల సంవాదరూపంలో (బహ్మాండపురాణమునందు వర్ణించబడింది. “కృష్ణా! మార్గశిర కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని ఏ విధంగా పాటించాలి. దయచేసి దీనిని నాకు వివరముగా చెప్పవలసినది” అని ధర్మరాజు అడిగాడు. ఈ ప్రశ్నకు దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు : “భరతవంశ(శేస్టుడా! సర్బములలో శేషుడు ఉత్తముడైనట్లు, పక్షులలో గరుడుడు (శేషస్టుడు అయినట్లు, యజ్ఞములలో అశ్వమేధయజ్ఞము (శేష్టమైనట్లు, నదులలో గంగానది ఉత్తమమైనట్లు, నరులలో బ్రాహ్మణుడు (శేష్టమైనట్లు, వ్రతములలో కెల్ల ఏకాదశి వ్రతము సర్వోత్కృష్టమైనది. రాజోత్తమా! ఏకాదశి 'వ్రతపాలనము చేసేవాడు నాకు ఎంతో ప్రియమైనవాడు, ఐదువేల సంవత్సరముల తపస్సు వలన కలిగే పుణ్యరాశి కేవలము ఏకాదశి వ్రతపాలన వలన సిద్ధిస్తుంది.” మహిష్మతుడనే సుప్రసిద్ధుడైన రాజు చంపవతిపురాన్ని పాలించేవాడు. ఆ రాజుకు నలుగురు పుత్రులు. వారిలో జ్యేష్టుడైన లుంపకుడు పరమపాపి. బ్రాహ్మణులను, వైష్ణవులను, దేవతలను సదా నిందించే స్వభావము కలిగిన లుంపకుడు జూదము, వ్యభిచారము పట్ల ఆసక్తుడై యుండేవాడు. అందువలన రాజు అతనిని దేశబహిష్కరణ జేసాడు. అపుడు లుంపకుడు అడవిలో నివసిస్తూ రాత్రివేళలలో తన తండ్రి రాజ్యంలోని ప్రజల ధనమును కొల్లగొట్టేవాడు. ఆ విధంగా అతడు ధనమును కొల్లగొట్టినప్పటికిని రాజు తనయుడని భావించి జనులు అతనిని విడిచిపెట్టేవారు. లుంపకుడు పచ్చిమాంసము తింటూ జీవనాన్ని గడపసాగాడు. అతడు ఉన్నట్టి అడవిలో ఒక అశ్వత్థ వృక్షం ఉన్నది. అది దేవతల వలె పూజనీయమైనది. లుంపకుడు ఆ చెట్టు క్రింద కొంతకాలము జీవించాడు. అతడు ఆ విధంగా జీవించే సమయంలో కాకతాళీయంగా మార్గశిర కృష్ణపక్ష ఏకాదశి వచ్చింది. అలసట, దుర్చలత కారణంగా అతడు ఏకాదశికి ముందురోజు స్పృహ తప్పినవాడై ఏకాదశిరోజు మధ్యాహ్నవేళకు తిరిగి స్పృహను పొందాడు. ఆకలిపీడితుడై అతడు ఎంతగా బలహీనుడయ్యాడంటే ఆ రోజు అతడు జంతువులను చంపే అవకాశమే కలుగలేదు. అందువలన అతడు కొన్ని పండ్లను ఏరుకొని విష్ణువుకు సమర్పించాడు. ఇంతలో సూర్యాస్తమయము అయింది. అనుకోకుండా ఆ రాత్రి అతడు జాగరణ చేసాడు. ఉసవాసము, జాగరణ ఫలంగా అతడు సఫల ఏకాదశి వ్రతపాలనము చేసినట్లు అయింది. సాధకుడు చేసే ఈ 'వ్రతపాలనను మధుసూదనుడు చక్కగా స్వీకరిస్తాడు. ఈ ఏకాదశి వ్రతపాలన ఫలంగా లుంపకునికి ఐశ్వర్యయుతమైన రాజ్యం సంటప్రాప్తించింది. మర్నాడు ప్రొద్దున ఒక దివ్యమైన అశ్వము అతని ముందు నిలబడింది; ఆ సమయంలో ఒక అశరీరవాణి “రాకుమారా! మధుసూదనుని కృప వలన, సఫల ఏకాదశి ప్రభావము వలన నీకిపుడు రాజ్యం లభింపనున్నది. నీవు దానిని ఎటువంటి కష్టాలు లేకుండ పాలించగలుగుతావు. కాబట్టి నీవు నీ తండ్రి చెంతకు వెళ్ళి అనంతముగా రాజ్యాన్ని అనుభవించు” అని పలికింది. ఆ ఆదేశం ప్రకారం లుంపకుడు తండ్రి చెంతకు వెళ్ళి రాజ్యభారాన్ని స్వీకరించాడు. తదనంతరము అతడు ఉత్తమమైన భార్యను పొంది పుత్రవంతుడయ్యాడు. ఈ ప్రకారము అతడు ఆనందంగా రాజ్యపాలనము చేసాడు. సఫల ఏకాదశి పాలనము ద్వారా మనిషి ప్రస్తుత జన్మలో యశస్సును బడసి, తదుపరి జన్మలో మ్పుక్తిని పొందుతాడు. ఈ ఏకాదశి వ్రతపాలనము చేసేవారు ధన్యులు. ఈ ఏకాదశి పాలనము వలన అశ్వమేధ యజ్ఞఫలము లభిస్తుంది.
మాసం:(చంద్రమాసం) -
నారాయణ,పుష్య
తిథి:(చంద్ర
రోజు) - ఏకాదశి
పక్షం:శుక్లపక్ష
పుష్యమాసంలోని శుక్షపక్షంలో వచ్చే పుత్రద ఏకాదశి మహిమ శ్రీకృష్ణధర్మరాజ సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది. ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో “రాజా! పుష్యమాసంలోని శుక్తపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పుత్రద ఏకాదశి. ఆ ఏకాదశిని పాటించడము దా రా మనిషి యొక్క సర్వపాపాలు నశిస్తాయి. ఆ ఏకాదశి వ్రతపాలనము ద్వారా జనులు పండితులై యశస్సును పొందుతారు. ఈ మంగళకరమైన ఏకాదశి మహిమను ఇపుడు విను” అని అన్నాడు. భద్రావతి పురంలో సుకేతుమానుడనే రాజు రాజ్యపాలన చేస్తుండేవాడు. అతని రాణి పేరు శెబ్య. పుత్రుడు కలుగకపోవడము వలన రాజు, రాణి ఇద్దరు కూడ దుఃఖంతో జీవితాన్ని గడిపారు. తమ కాలంలో అధికభాగాన్ని వారు ధర్మకార్యాలలోనే గడిషేవారు. కాని వారు శోకతప్పులు కావడం వలన పితృతర్చణ కార్యంలో వారు వదలిన తర్చణాలు వేడిగా గోచరించాయి. సుకేతుమానుని తరువాత తమకు తర్పణాలు వదిలేవారే లేరని తలచి ఆ పితృదేవతలు కూడ చింతాగ్రస్తులయ్యారు. తన పితృదేవతల దుఃఖాన్ని చూసి రాజు మరింత విచారగ్రస్తుడయ్యాడు. మిత్రులు, హితులు, అమాత్యుల సాంగత్యము అతనికి ఏమాత్రం రుచించలేదు. విచారంలోను, నిరాశలోను మునిగిన ఆ రాజు పుత్రరహీతమైన మానవజన్మ వ్యర్థమని భావించాడు. పుత్రుడు లేకపోతే దేవబుణము, పితృబుణము, జీవబుణము తీర్చుకొనుట అసాధ్యము. పుణ్యరాశులు లేనిదే, విష్ణుభక్తి లేనిదే ఎవ్వడును పుత్రులను, ధనాన్ని, జ్ఞానాన్ని పాందలేడు. ఈ రీతిగా నిర్ణయించినవాడై రాజు రహస్యంగా గుబ్దింపై అడవికి వెళ్ళాడు. పశుపక్షిభరితమైన అరణ్యంలో ప్రవేశించిన సుకేతుమానుడు విశ్రాంతి తీసికొనే ప్రదేశం కొరకు వదుకసాగాడు. అపుడు ఆ దట్టమైన అరణ్యంలో రాజుకు అశ్వత్ధము, పెప్పలము, చింత, ఖర్జూర, శాల, శలపర్హ, తమాల, అర్జునాది వృక్షాలు కనిపెంచాయి. పెద్దపులులు, సింహాలు, అడవి ఏనుగులు, జింకలు, అడవి పందులు, కోతులు, పాములు, చిరుతలు, కుందేళ్ళ వంటివి అక్కడ గోచరించాయి. దానితో విశ్రాంతికి బదులు అతడు అడవి అంతట తిరగ నారంభించాడు. నక్కల ఊళలు, గుడ్డగూబల కూతలు విని రాజు భయకంపితుడై అచ్చెరువొందాడు. ఈ విధంగా అన్ని దిక్కులలో తిరుగుతూ ఆ రాజు అతితొందరలోనే అలసిపోయాడు. మధ్యాహ్నవేళకు అతడు తీవమైన దప్పికకు గురయ్యాడు. పూజల ద్వారా యజ్ఞాల ద్వారా దేవతలను ప్రసన్నులను చేసినప్పటికిని, ప్రజలను కన్నబిడ్డల వలె పోషించినప్పటికిని, భోజనదక్షిణలతో బాహ్మణులను సంతృప్తిపరచినప్పటికిని తాను ఈ రోజు ఇట్లు కష్టముల పాలైనట్లు రాజు భావించాడు. ఈ రీతిగా ఆలోచిస్తూ అతడు అటుఇటు తిరగసాగాడు. అకస్మాత్తుగా అతనికి కలువలతో నిండిన మానససరోవరంలాగా ఉన ట్టి ఒక సరోవరం కనిపించింది. హంసలు, చక్రవాకాలు, చకోరాలు ఆ సరోవరజలంలో విహరిస్తున్నాయి. కొందరు మునులు ఆ సరోవర తటంలో వేదమంత్రాలను ఉచ్చరించడము చూసిన ఆ రాజు గుజ్దం మీద నుండి దిగి వారిలో ప్రతియొక్కగరికి నమస్కరించాడు. రాజు యొక్క నడవడికి ప్రసన్ను లైన ఆ మునులు అతనితో “రాజా! మేము మీ పట్ల ప్రసన్నులమైనాము. ఏదైనా వరము కోరుకో” అని అన్నారు.
అపుడు రాజు వారిని గురించి ప్రశ్నించాడు; వారందరు ఎందులకు ఈ సరోవరతటంలో ఉన్నారని అడిగాడు. ఆ ప్రశ్నకు బదులుగా మునులు అతనితో “రాజా! మేము విశ్వేదేవులము. స్నానం చేయడానికి ఇక్కడకు మేము వచ్చాము. ఈ రోజు పవిత్రమైన పుత్రద ఏకాద!ి. పుత్రవాంఛితుడైన వ్యక్తి ఈ వ్రతాన్ని పాటిస్తే నిశ్చయంగా అతనికి పుతోదయం కలుగుతుంది” అని అన్నారు. పుత్రప్రాప్తి కై తానింతవరకు ఎంతో ప్రయత్నించానని, కాని నేటివరకు ఏదీ కూడ ఫలము కాలేదని రాజు అన్నాడు. తన పట్ల మునులందరు ప్రసన్ను లైనారు కనుక తనకొక 'త్రుని ప్రసాదించమని రాజు వారిని అర్థించాడు. అపుడు వారు అతనితో “రాజా! ఈ రోజు (త్రద ఏకాదశి. ఈ వ్రతాన్ని శ్రద్ధతో పాటించు. భగవత్కరుణతోను, మా ఆశీరా సదంతోను నీకు (త్రుడు ఉదయిస్తాడు” అని దీవించారు. ఇని ఈ ఆ ఈ మునుల ఆదేశానుసారము రాజు పరమమంగళకరమైన పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. మర్నాడు ఉపవాసమును పూర్తి చేస, పారణ కావించి మునులకు పదేపదే వందనము చేసి తన పురానికి వెళ్ళిపోయాడు. కాలక్రమంలో శైబ్య గర్భవతి అయింది. మునుల ఆశీర్వాదము వలన, పుత్రద ఏకాదశి వ్రతపాలన ప్రభావము వలన రాజుకు తేజోమయుడైన పుత్రుడు ఉదయించాడు... తరువాత రాజు ఆనందముతో రాజ్యపాలన చేసాడు; అతని పితృదేవతలు కూడ సంతృప్తి చెందారు. “ధర్మరాజా! ఈ ప్యుతద ఏకాదశి వ్రతపాలనము ద్వారా మనిషి పుత్రుని బడసి స్వర్గాదిలోకాలను కూడ పొందుతాడు” అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఈ ఏకాదశి మహిమను వినినవాడు, క్రీర్తించినవాడు నిక్కముగా అశ మేధ యజ్ఞఫలాన్ని పాందుతాడు.
మాసం:(చంద్రమాసం) -
మాధవ,మాఘ
తిథి:(చంద్ర రోజు) - ఏకాదశి
పక్షం:కృష్ణపక్ష
ఈ షట్తిల ఏకాదశి పుష్యమాసం కృష్ణపక్షంలో వస్తుంది. దీని మహిమ భవిష్యపురాణంలో వర్ణించబడింది. ఒకసారి దాల్బ్యబుషి పులస్త్యునితో “ఓ బ్రాహ్మణోత్తమా! ఈ మర్త్యలోకంలో జనులు బాహ్మణహత్య, ఇంద్రియభోగం వంటి నానారకాలైన పాపాలలో నెలకొని ఉన్నారు. పాపఫలంగా వారికి కలిగే నారకీయ పరిస్థితుల నుండి వారు ఏ విధంగా బయటపడగలరో నాకు వివరించండి” అని అడిగాడు. అపుడు పులస్త్యుడు దానికి సమాధానంగా “మహాభాగా! పుష్యమాసం క ఎప్షపక్షంలో వచే ్స్ ఏకాదశిరోజు మనిషి నిర్మల చిత్తంతో భగవంతుని అర్చించాలి” అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ విధంగా అర్చించే సమయంలో అతడు ఈ విధంగా ప్రార్థించాలి : “జనార్దనా! పరమ కరుణామయుడవైన శ్రీకృష్ణా! నీవు పాపులను ఉద్ధరించేవాడివి. అవిద్యాసాగరంలో మునిగిపోయే వారి పట్ల కరుణను చూపించు. ఓ పరబహ్మమా! దేవదేవా! జగదీశ్వరా! లక్ష్మీసహితునిగా నీవు నా అర్బనను స్వీకరించు” “తరువాత. గొడుగు, వస్త్రము, పాదరక్షలు, నీటి ముంతను దానమిచ్చి బ్రాహ్మణులను పూజించాలి. శక్త్యనుసారము నల్లగోవులను, నువ్వులను (తిలలను) ఉత్తమ (బాహ్మణులకు దానమివ్వాలి. తిలలను దానమివ్య్వడము ద్వారా మనిషి అనేకానేక సంవత్సరాలు స్వర్గవాసాన్ని పాందుతాడు.” “ఈ ఏకాదశి రోజు మనిషి తిలలు కలిపిన నీళ్ళతో స్నానం చేయాలి, నువ్వుల పలుచని ముద్దను శరీరానికి రాసుకోవాలి, నువ్వులతో యజ్ఞం చేయాలి. పితృదేవతలకు తిలోదకాలు ఇవ్వాలి, నువ్వులను తినాలి, నువ్వులను దానం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా అన్ని పాపాలు తొలగిపోతాయి. అందుకే ఈ ఏకాదశికి షట్రిల ఏకాదశి అనే పేరు వచ్చింది.” షట్టిల ఏకాదశి మహిమను, దానిని పాటించడము వలన కలిగే లాభాన్ని వినగోరినపుడు శ్రీకృష్ణుడు ఒక కథను నారదమునికి చెప్పాడు. అది ఈ విధంగా ఉన ది. అతిపురాతన కాలంలో ఒక బ్రాహ్మణవనిత ఉండేది. కఠోరమైన బ్రహ్మచర్యవ్రతంతో ఆమె దేవదేవుని సేవలో నెలకొన్నది. భగవత్సేవలో నిరంతరము అనేక రకమైన వ్రతాలను చేస్తూ ఆమె బక్కచిక్కిపోయింది. నిరుపేద బ్రాహ్మణులకు, అవివాహిత కన్యలకు దానమిచ్చినప్పటికిని అన్నదానం ద్వారా (బాహ్మణులను, దేవతలను ఆమె సంతృప్తిపరచలేదు.
“అనేకమైన కఠోరమగు తపస్సులను చేయడం వలన దేహము చిక్కిపోయినప్పటికిని ఈ బాహ్మణవనిత నిజంగా పవిత్రాత్మురాల్వే ఆకరిగొన్న జనులకు ఈమె అన్నదానం చేయలేదు అని నేను భావించాను. ఓ బ్రాహ్మణోత్తమా! ఆమెను పరీక్షించాలని తలచి నేను మర్త్యలోకంలోకి భిక్షుకుని వేషంలో వెళ్ళాను. భిక్షాపాత్రతో భిక్షను అడుగుతూ నెమ్మదిగా నేను ఆ బాహ్మణవనిత ఇంటికి చేరాను. అపుడు బ్రాహ్మణవనిత నాతో “ఓ బ్రాహ్మణా! నీవెక్కడ నుండి వచ్చావు?” అని అడిగింది. నేను ఆమె మాటలను విననట్లుగా నటిస్తూ మళ్ళీ భిక్షమడిగాను. దానితో ఆమెకు కోపం వచ్చి పిడి3డు మట్టిని తీసి నా భిక్షా పాత్రలో వేసింది. తరువాత నేను నా ధామానికి వచ్చేసాను. ఆ బాహ్మణవనిత కూడ తన త్వతప ఫలితంగా నా లోకానికి చేరుకుంది. అక్కడ భవ్యమైన భవంతిని పొందినప్పటికిని నాకు మట్టిని దానం చేసిన కారణంగా ఆమె ఇంట్లో అన్నము గాని, ధనము గాని లేకుండా పోయాయి. ఓ బ్రాహ్మణా! ఆ భవంతిలో ఆమెకు ఏమీ కనిపించలేదు. సంపత్తులు లేని కారణంగా ఆమె కలవరపడింది. అపుడు ఆమె కోపంగా నా దగ్గరకు వచ్చి “జనార్దనా! నేను ఎన్నో వ్రతాలు, తపస్సులు చేసాను. విష్ణువును ఆరాధించాను. అయితే నాకు అన్ని సంపత్తులు ఎందుకు లోపించాయి?” అని ప్రశ్నించింది. అపుడు నేను ఆమెతో “బ్రాహ్మణీ! నీవు మర్త్యలోకం నుండి ఇక్కడకు వచ్చావు. ఇపుడు ఇంటికి వెళ్ళు. కొందరు వనితలు నిన్ను చూడడానికి నీ ఇంటికి వస్తారు. షట్ర్తిల ఏకాదశి మాహాత్మ్యాన్ని వారి నుండి విను. వారు దానిని గురించి పూర్తిగా చెప్పేంతవరకు తలుపులు తీయకు” అని అన్నాను. నా మాట విని ఆమె వెళ్ళిపోయింది. ఒక రోజు బ్రాహ్మణి తన ఇంట్లో కూర్చొని యున్న సమయంలో దేవతా వనితలు వచ్చి “ఓ సుందరీ! మేము మీ దర్శనానికై వచ్చాము. దయచేసి తలుపుతీయి” అని అన్నారు. అపుడు ఆమె వారితో “మీరు నన్ను చూడాలనుకుంటే షట్తిల ఏకాదశి మహిమను నాకు చెప్పండి. అప్పటిదాకా నేను తలుపులు తీయను అని అన్నది. అపుడు దేవతావనితలు షట్రిల ఏకాదశి మహిమలను ఘనంగా వర్లించారు. ఆ వర్లనను వినిన తరువాత బబాహ్మణి సంతృప్త చెంది తలుపులు తీసింది. ఆమెను చూసిన తరువాత దేవతాస్త్రీలు సంతృప్తి చెందారు. “ఆ దేవతావనితల ఆదేశం మేరకు బ్రాహ్మణి షట్లిల ఏకాదశి 'వ్రతపాలనం చేసింది. దానితో ఆమె అతి సౌందర్యవతి, తేజస్వి, ధనధాన్యకనక సంపత్తులు కలిగినది అయింది. అయినా లోభంతో ఎవ్వరూ ఈ ఏకాదశిని పాటించకూడదు. ఈ ఏకాదశి 'వ్రతపాలన చేత మనిషి దుర్భాగ్యము, బీదరికము నశిస్తాయి. ఈ _ ఏకాదశిరోజు నువ్వులను దానం చేసినవాడు సమస్త పాపవిముక్తుడౌతాడు.”,
మాసం:(చంద్రమాసం) -
మాధవ,మాఘ
తిథి:(చంద్ర
రోజు)-ఏకాదశి
పక్షం:శుక్లపక్ష
మాఘమాసం శుక్తపక్షంలో వచ్చే జయ ఏకాదశి లేదా భైమీ ఏకాదశి మహిమ శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాదరూపంగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని సంబోధిస్తూ “ఓ ఆదిదేవా! జగదీశ్వరా! కృష్ణా! ఘ్వేద అండజాది నాలుగు రకాలైన జీవులకు నీవు మూలకారణుడివి. సమస్తానికీ నీవే సృష్టికర్తవు, పోషకుడవు, లయకారకుడవు. మాఘతశుక్షపక్షంలో వచ్చే ఏకాదశి మహిమను నాకు చెప్పవలసినదిగా కోరుతున్నాను. ఆ ఏకాదశిని పాటించే విధానాన్ని, పరమ మంగళమయమైన ఆ రోజు ఏ దైవాన్ని అర్చించాలో కూడా చెప్పవలసింది” అని అడిగాడు. ధర్మరాజు మాటలకు ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు “రాజోత్తమా! ధర్మరాజా! మాఘతశుక్షపక్షంలో వచ్చే ఏకాదశి జయ ఏకాదశి యని సుప్రసిద్ధమైంది. ఈ ఏకాదశి 'వ్రతపాలన ద్వారా సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశిని పాటించేవాడు ఏనాడును దెయ్యముగా మారడు. రాజా! మ్యుక్తిని ప్రసాదించడములో, పాపనాశనములో ఈ ఏకాదశికి మించినది లేదు. రాజసింహమా! పూర్వము నేను పద్మపురాణంలో వర్ణించినట్టి ఈ ఏకాదశి వర్ణనను ఇపుడు విను” అని తన ఉపదేశాన్ని కొనసాగించాడు. “దేవతలందరు దేవేంద్రుని రాజ్యంలో సుఖంగా జీవిస్తున్నారు. అక్కడ నందనవనము పారిజాతపుష్ప సారభంతో నిండి ఉండేది; అప్పరసలు అక్కడ స్వేచ్చగా విహరించేవారు. ఇంద్రుడు కూడ ఆ అప్పరసలతో కలిసి నందనవనంలో విహరించేవాడు. ఒకసారి ఇంద్రుడు నందనవనంలో ఐదుకోట్ల అప్పరసలతో నృత్యోవత్సాన్ని ఏర్పాటు చేసాడు. ఆ సభలో పుష్పదంతుడనే గంధర్వుడు ఉన్నాడు. చిత్రసేనుడనే ఇంకొక గంధర్వుడు తన భార్య మాలినితోను, కుమార్తెతోను అక్కడకు వచ్చాడు. చిత్రసేనునికి పుష్పవనుడనే పుత్రుడు ఉన్నాడు. అతని పుత్రుడు మలయవానుడు. పుష్పవతి అనే గంధర్ని మలయవానుని సౌందర్యానికి ఆకర్షితురాలైంది. మన్మథబాణ _ పీడితయైన పుష్పవతి మలయవానుని ఆకర్షించడానికి, లోబరచుకోవడానికి నానాభంగిమలతో, చూపులతో యత్నించింది. రాజా! ఆమె సౌందర్యాన్ని ఏమని వర్ణించగలము? ఆమె సుందరమైన బాహువులు మన్మథ బాణములవల ఉన్నాయి, ఆమె ముఖము పూర్ణచందుని పోలి ఉన్నది. విశాలమైన నయనాలు, కుండలశోభిత కర్ణములు, శంఖనాందర్యాన్ని తలదన్నే కంఠము, సన్నని నడుము, విశాలమైన పెరుదులు, సమున్నతమైన స్తనద్వయము, కదలీ వృక్షముల వంటి ఊరువులు, ఎబ్జకలువ సౌందర్యాన్ని తలదన్నే 'ప్రకాశమాన పాదములు ఆమె సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. వస్తాాభరణ అలంకరణతో ఆమె సౌందర్యము మరింత మనోహరంగా అయింది. అంతటి నౌందర్యవతియైన పుష్పృవతిని చూడగానే మలయవానుడు ఆకర్షితుడయ్యాడు.”
“ఇంద్రుని ప్రీత్యర్థము మలయవానుడు, పుష్పవతి ఇతర అప్పరసలతో కలిసి న త్యోత్సవములో నృత్యం చేయడం మొదలుపెట్టారు. కాని పరస్పరాకర్షణ వలన మలయవానుడు, పుష్పవతి చక్కగా నృత్యం చేయలేకపోయారు. తతృలితంగా నృత్య కార్యక్రమం సజావుగా సాగలేదు. మన్మథబాణ పీడితులై వారిద్దరు ఓరచూపులతో ఒకరినొకరు చూసుకోసాగారు. నృత్యగాన కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకలను గమనించిన ఇంద్రుడు వారి మానసికస్థితిని అర్థం చేసికొన్నాడు. కార్యక్రమంలో నిరంతరము కలిగిన అంతరాయానికి అవమానితుడైన ఇంద్రుడు వారిని తీవ్రంగా శపించాడు; మూర్ధులు, పాపులు అయిన మీరిద్దరు నా ఆజ్ఞను ఉల్లంఘించిన కారణంగా ఆడ, మగ దెయ్యాలుగా మారి భూలోకంలో మీ కర్మఫలాన్ని అనుభవించండి.” “ఆ రీతిన శపంచబడిన మలయవానుడు, పుష్పవతి దెయ్యాలుగా మారి హిమాలయ పర్వత గుహలో ఘోరమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు. దెయ్యాలుగా మారిన వారికి త్మీవమైన దుఃఖము, శోకము కలిగాయి. శాపకారణంగా వారికి ఘ్రాణ స్పర్శ సుఖము, నిద కొరవడినాయి. హిమాలయ ప్రాంతంలోని దట్టమైన అరణ్యాలలో తిరుగుతూ ఒకసారి వారు ఒకచోట కూర్చొని చింతించసాగారు. అపుడు మగదెయ్యము ఆడదెయ్యంతో “ఇంతటి ఘోరమైన దెయ్యరూపాలు రావడానికి మనమెంతటి ఘోరమైన పాపాలు చేసామో కదా” అని అన్నది. తీవమైన దుఃఖముతో ఆ దెయ్యాల జంట పశ్చాత్తాప సాగరంలో మునిగిపోయాయి. దెయ్యాల రూపాలలో ఉన్న మలయవానుడు, పుష్పవతి ఆ రోజంతా పశ్చాత్తాపపడుతూ ఎటువంటి ఆహారం తీసికోలేదు. అనుకోకుండా ఆ రోజు జయ ఏకాదశి అయింది. ఆకలిదప్పులతో పీడింపబడి నప్పటికిని వారు ఏ జీవినీ ఆ రోజు చంపలేదు. కందమూలములు, జలమైనా వారు తీసికోలేదు. రాజా! ఆ రీతిగా ఆ దెయ్యం జంట ఒక అశ్వత్థవృక్షం క్రింద కూర్చొని ఉండగా సూర్యాస్తమయం అయింది. వణికించే చలిలో, తీవమైన ఆలోచనలతో వారు రాత్రంతా నిద్ర లేకుండానే గడిపివేసారు. మానసిక కలత వలన వారి హ ఎదయాలలో ఇంద్రియభోగభావనే కలుగలేదు.” “రాజసింహమా! ఆ విధంగా అనుకోకుండానే వారు జయ ఏకాదశి వ్రతాన్ని చేయడం జరిగింది. 'వ్రతపాలన ప్రభావంగా మర్నాడే వారు దెయ్యాల రూపం నుండి ముక్తిని పాందారు. పుష్పవతి, మలయవానుడు ఇద్దరూ తిరిగి తమ రూపాలను పొంది విమానాలలో స్వర్గలోకానికి వెళ్ళి దేవరాజైన ఇంద్రునికి అభివాదము చేసారు. అది చూసి ఆశ్చర్యపడిన ఇంద్రుడు వారితో “ఎంత అద్భుతం! ఏ పుణ్యప్రభావం వలన మీకు దెయ్యాల రూపం పోయింది? ఏ దైవం మీకు నా శాపం నుండి ముక్తిని ప్రసాదించాడు? అని అన్నాడు. దానికి సమాధానంగా మలయవానుడు ఇంద్రునితో “దేవదేవుని నిర్హేతుక కరుణ వలన, ఆతనికి పరమప్రాయమైన జయ ఏకాదశి వ్రతపాలన వలన మేము శాపవిముక్తులమయ్యాము. ప్రభూ! కేవలము భక్తిప్రభావం వలననే మేము దెయ్యాల రూపం నుండి ముక్తులమయ్యామని పూర్ణవిశ్వాసంతో చెబుతున్నాను అని అన్నాడు.” “ఈ మాటలను వినిన దేవేంద్రుడు మలయవానునితో “ఏకాదశి వ్రతపాలన ద్వారా విష్ణుపూజను చేసిన కారణంగానే మీరు పవిత్రులయ్యారు. కాబట్టి మీరు నాకు కూడ పూజనీయులు. విష్ణువును పూజించేవారు నిశ్చయంగా పూజనీయులు, నాకు ఆదరణీయులు అని అన్నాడు. తరువాత పుష్పవతి, మలయవానుడు స సర్గంలో సుఖంగా జీవించారు” “ధర్మరాజా! ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతియొక్కరు పాటించాలి. జయ ఏకాదశి 'వ్రతపాలనము బ్రహ్మహత్యా పాతకాన్నైనా పరిహరిస్తుంది. దానము, యజ్ఞము, తీర్థాటనము వలన కలిగే పుణ్యము ఈ 'వ్రతపాలనచే అప్రయత్నముగానే లభిస్తుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తిశద్ధలతో చేసేవాడు వైకుంఠములో శాశ్వత వాసాన్ని పొందుతాడు.” ఈ ఏకాదశి మహిమను చదవడము, వినడము ద్వారా మనిషి అగ్నిష్టోమ యాగఫలాన్ని పొందుతాడు.
మాసం:(చంద్రమాసం) -
గోవింద,ఫాల్గుణ
తిథి:(చంద్ర
రోజు)-ద్వాదశి
పక్షం:కృష్ణపక్ష
విజయ ఏకాదశి మాహాత్మ్యం స్కందపురాణంలో వర్షించబడింది. మాఘమాసంలోని క ష్షపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని గురించి తన యెడ కరుణతో వివరించమని ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుడు అడిగాడు. దానికి ప్రత్యుత్తరముగా శ్రీకృష్ణుడు అతనితో “ధర్మరాజా! విజయ ఏకాదశి అని తెలియబడే ఈ ఏకాదశిని గురించి నీకు ఆనందంగా వివరిస్తాను. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడము ద్వారా అన్ని పాపాలు ఒకేసారి నశించిపోతాయి" అని చెప్పే తన వివరణను ఇంకను కొనసాగించాడు. ఒకసారి నారదుడు బ్రహ్మదేవుని సమీపించి “ఓ దేవతా శేష్టుడా! మాఘమాసంలోని క ఎప్షపక్షంలో వచ్చే విజయ ఏకాదశిని పాటించేవాడు సాధించే ఫలాన్ని నాకు వివరించవలసినది” అని విన్వమంగా అడిగాడు. అది వినిన బ్రహ్మదేవుడు నారదునితో “పుత్రా! ఈ పురాతన వృత్తాంతము అత్యంత పవిత్రమైనది, సకల పాపాలను నశింపజేసేది. కేరుకు తగినట్లుగా ఇది నిజానికి గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఈ విజయ ఏకాదశి మనిషికి నిస్సందేహముగా విజయాన్ని చేకూరుస్తుంది. తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి శ్రీరామచంద్రుడు తన భార్య సీతతోను, సోదరుడు లక్ష శ్రణునితోను పదునాలుగేండ్లు వనవాసానికి వెళ్ళినపుడు గోదావరి తీరంలోని పంచవటి అనే రమ్యమైన అరణ్య ప్రాంతంలో కొంతకాలం వసించాడు. వారు ఆ వనంలో ఉన్నప్పుడే దానవరాజగు రావణుడు సీతాదేవిని అపహరించాడు. సీతావియోగంతో శ్రీరాముడు దుఃఖవిహ్యలుడయ్యాడు. సీతాన్వేషణలో శ్రీరాముడు అడవిలో తిరుగుతూ మరణింపనున్న పక్షిరాజు జటాయువును కలిసాడు. సీతను గురించి సమస్తము శ్రీరామునికి తెలియజేసిన జటాయువు ఈ జగత్తును వీడి వైకుంఠానికి వెళ్ళాడు. తరువాత శ్రీరాముడు స్నుగీవునితో చెలిమిచేసాడు. అపుడు రామచంద్రుని కార్యార్థమై పెద్ద వానరసేన సమకూర్చబడింది. ఇంతలో కపేరాజగు హనుమంతుడు లంకలోని అశోకవనానికి వెళ్ళి సీతను చూసి, రాముని అంగులీయకాన్ని ఆమెకు సమర్పించే మహత్కార్యాన్ని పూర్తి చేసాడు. తదనంతరము హనుమంతుడు రామచంద్రుని దగ్గరకు తిరిగివచ్చి సమస్తాన్నీ ఆతనికి వివరించాడు. హనుమంతుని మాటలను వినిన తరువాత శ్రీరాముడు తన మిత్రుడు సుగ్రీవునితో సంప్రదించి లంకమై దండెత్తడానికి నిశ్చయించాడు. అపుడు. శ్రీరాముడు పెద్దవానరసేనతో సముద్రతీరానికి అరుదెంచి లక్ష్మణుని ఉద్దేశించి “సామిత్రీ! తిమింగలాలు, మొసళ్ళు వంటి భయంకరమైన జలచరాలతో నిండినట్టి ఈ అగాధమైన సముద్రాన్ని మనం ఎలా దాటగలము?ొ అని అన్నాడు. రాముని మాటలకు ప్రత్యుత్తరముగా లక్ష్మణుడు “ఓ ఆదిపురుషా! నీవు దేవదేవుడవు. ఈ ద్వీపంలోని బకదల్భ్యుడనే ముని ఉన్నాడు. ఆయన ఆశ్రమం ఇక్కడకు నాలుగు మైళ్ళ దూరంలో ఉంది.
ఓ రఘునందనా! ఆ మునికి 'బబ్రహ్మదర్శనం కలిగింది. ఈ సముద్రాన్ని దాటే ఉపాయాన్ని మనము ఆ మునినే అడుగుదాము” అని అన్నాడు. లక్ష్మణునిచే ఈ విధంగా సలహా పొందిన శ్రీరాముడు బకదల్ఫు్యుని ఆశ్రమానికి వెళ్ళి ఆ మునికి వందనము చేసాడు. వచ్చిన వ్యక్తి శ్రీరామచంద్రుడని, రావణసంహారము వంటి ప్రత్యేక కార్యార్థమే ఇపుడు అవతరించాడని సర్వజ్ఞుడైన ఆ ముని వెంటనే తెలిసికొన్నాడు. వెంటనే ఆ ముని శ్రీరాముడు వచ్చిన కార్యం గురించి ప్రశ్నించాడు. అపుడు శ్రీరాముడు ఆ మునితో “ఓ బ్రాహ్మణోత్తమా! దానవులతో పోరాడి లంకను జయించడానికి నేను వానరసేనతో ఈ సాగరతీరానికి మీ కృపావశంగా వచ్చాను. ఓ మునివర్యా! ఈ దుస్తరమైన సాగరాన్ని నేను సులభంగా దాటగలిగే ఉపాయాన్ని చెప్పండి. ఈ విషయాన్ని తెలిసికోవడానికే నేను మీ పాదపద్మాల చెంతకు వచ్చాను అని అన్నాడు. దానికి ప్రత్యుత్తరముగా ముని శ్రీరామునితో “శ్రీరామా! యుద్ధాన్ని జయించి నీవు ఈ జగత్తులో అసాధారణ యశస్సును, సంపదను పొందగలిగే ఒక మహత్తర వ్రతాన్ని నీకు చెబుతాను. కాని ఈ వ్రతాన్ని నీవు అనన్యచిత్తంతో పాటించాలి. రామచంద్రా! మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఏకాదశి వ్రతపాలనచే నీవు నీ వానరసేనతో పాటు ఈ సముద్రాన్ని దాటగలవు. ఇక ఇపుడు ఈ వ్రతవిధానాన్ని సావధానంగా విను. ఏకాదశికి ముందురోజు బంగారు, వెండి, రాగి లేదా మట్టి కుండలో నీరు నింపి దానిని మామిడాకులతో అలంకరించాలి. తరువాత దానిని సప్తధాన్యాలతో అలంకరించిన. వేదికమై ఉంచి దానిమై నారాయణుని స్వర్హమూర్తిని నిలపాలి. ఏకాదశిరోజు నీవు తెల్లవారురూమునే స్నానం చేసి తులసీదళాలను, గంధాన్ని, పూలను, పూమాలలను, ధూపదీపాలను, నైవేద్యాన్ని సమర్పించి నారాయణుని పూజించాలి. ఆ రాత్రి జాగరణ కూడ చేయాలి. మర్నాడు ఆ పాత్రను నదీతీరం, కొలను లేదా సరస్సు ఒడ్డున ఉంచి సూర్యోదయం తరువాత దానిని యథావిధిగా పూజించాలి. ఆ తరువాత నారాయణుని మూర్తితో పాటు ఆ పాత్రను (బహ్మచర్యవ్రతాన్ని పాటిస్తున్న బ్రాహ్మణునికి దానం చేయాలి. ఈ విధంగా చేస్తై నీవు నిశ్చయంగా నీ శత్రువులను ఓడిన్తావు” అని అన్నాడు. ముని ఆదేశానుసారము శ్రీరామచంద్రుడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆదర్శనీయంగా పాటించి తతృ్భలితంగా విజయాన్ని సాధించాడు. ఈ ఏకాదశి వ్రతాన్ని యథావిధిగా పాటించేవ్యక్తి నిక్కముగా ఇహపరాలలో విజయాన్ని సాధిస్తాడు. ఈ ప్రకారంగా నారదునితో పలుకుతున్న బ్రహ్మదేవుడు అతనితో “పుత్రా! కనుక ప్రతి మానవుడు ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా పాటించాలి. ఈ విజయ ఏకాదశి మహిమ మనిషి యొక్క సమస్త పాపాలను నశింపజేస్తుంది” అని పలికాడు.
ఈ ఏకాదశి మాహాత్మ్యాన్ని చదివేవాడు, వినేవాడు వాజపేయయజ్ఞఫలాని, మ పొందుతాడు. సంవత్సర కాలంలో ఎనిమిది మహాద్వాదశిలు వస్తాయి. ఈ విషయం బ్రహ్మ వైవర్తపురాణంలో శ్రీసూతశౌనక సంవాద రూపంలో వర్ణించబడింది. శ్రీసూతగోసా మి శౌనకునితో ఇలా అన్నాడు : “ఓ బ్రాహ్మణుడా! ఉన్మీలనీ, వ్యంజులి, త్రిస్పృశ, పక్షవర్థిని జయ, విజయ, జయంతి, పాపనాశిని అనే ఎనిమిది మహాద్వాదశిలు ఉన్నాయి. వీటిలో మొదటి నాలుగు తిథి ననుసరించి వస్తాయి. తరువాతి నాలుగు నక్షత్రాన్ని బట్టి వస్తాయి. ఇవన్నీ కూడ అనంతమైన పాపరాశులను నశింపజేస్తాయి. అమావాస్య లేదా పౌర్ణమి పొడిగితే వాటికి ముందు వచ్చే ద్వాదశి పక్షవర్ధినీ మహాద్వాదశి అని పేిలువపడుతుంది. అపుడు ఏకాదశి రోజుకు బదులు ఈ మహాద్వాదశిరోజు ఉపవాసం చేయాలి. ఈ ఎనిమిది మహాద్వాదశీలు వచ్చినపుడు విశుద్ధభక్తులు వాటి ముందు వచ్చే ఏకాదశీలను విడిచియెన సరే మహాద్వాదశి గౌరవాన్ని నిలబెడతారు. మహాద్వాదశిని పాటించడము ద్వారా ఏకాదశి సహజంగానే పాటించబడి శ్రీహరి అతిప్రసన్నుడౌతాడు.”
మాసం:(చంద్రమాసం) -
గోవింద,ఫాల్గుణ
తిథి:(చంద్ర
రోజు)-ఏకాదశి
పక్షం:శుక్లపక్ష
ఫాల్గుణమాస శుక్షపక్షంలో వచే అమలకీ ఏకాదశి మహిమ మాంధాత వశిష్టుల సంవాదరూపంలో బ్రహ్మాండ పురాణంలో వర్షించబడింది. న్య ఒకసారి మాంధాత వశిష్టముని దరిచేరి “ఓ మహాభాగా! మీరు నా పట్ల ప్రసన్ను లై ఉన్నచో, దయగొని ఉన్నచో సకల శుభాలను పొందగలిగే ఒక వ్రతాన్ని నాకు తెలపండి” అని అడిగాడు. దానికి 'ప్రత్యుత్తరంగా వశిష్టుడు ఇలా అన్నాడు : “రాజా! ఎల్లరికీ శుభాన్ని కలుగజేసే ఒక మహావతము యొక్క మహిమను, చరితమును నీకు వివరిస్తాను. ఆ వ్రతం క్పేర్రు అమలకీ ఏకాదశి వ్రతము. ఈ వ్రతాన్ని పాటించడము వలన కలిగే ప్రభావము నిక్కముగా సకల పాపాలను నశింపజేసి ముక్తిని ఒసగడమే కాకుండ వేయి గోవులను దానం చేసిన ఫలం కూడ సెద్ధింపజేస్తుంది.” “పూర్వము వైదిషమనే పురము ఉండేది. దానిలో మిక్కిలి సంపన్ను లైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు వసించేవారు. ఆ అందమైన నగరంలో నాస్తికుడు గాని, పాపిగాని ఉండేవాడు కాడు. నగరమంతా ఎప్పుడూ వేదమంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. అట్టి సుప్రసిద్ధ నగరంలో చైత్రరథుడనే రాజు ఉండేవాడు. అతడు చంద్రవంశజుడైన పశబిందుకుని కులంలో జన్మించాడు. చైత్రరథుడు బలవంతుడు, వీరుడు, ఐశ్వర్యవంతుడు, శాస్త్రకోవిదుడై ఉండేవాడు. అతని రాజ్యపాలనలో రాజ్యమంతట సుఖసంపదలు వెల్లివిరిసి ఉండేవి. పురప్రజలందరు విష్ణుభక్తికి అంకితులై యుండి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తుండేవారు. హరిభక్తి కారణంగా వారందరు ఆ రాజ్యంలో సుఖంగా జీవించేవారు. రాజ్యంలో బీదవాడు గాని, పిసినారి గాని ఒక్కడైనా ఉండేవాడు కాడు. ఈ ప్రకారము ఆనందంగా అనేక సంవత్సరాలు గడచిపోయిన తరువాత ఫాల్గుణమాస శుక్షపక్షంలో ఒకసారి ద్వాదశితో కూడిన అమలకీ ఏకాదశి వచ్చింది. ఇటువంటి ఏకాదశి మహత్తర లాభాన్ని చేకూరుస్తుందని తెలిసిన రాజు, అతని ప్రజలు దానిని యథావిధిగా నిర్వహించాలని సంకల్పించారు. ఏకాదశిరోజు ప్రాద్దున్నే రాజు, అతని ప్రజలు నదిలో స్నానం చేసి, ఒడ్డునే ఉన్నట్టి విష్ణు ఆలయాన్ని సందర్శించారు. గుడి ప్రాంగణంలోనే ఒక అమలకీ వృక్షం ఉంది. రాజు ఆ చెట్టు మొదట్లో నీళ్ళు నింపిన కుండను, గొడుగును, వస్త్రమును, పాదుకలను, పంచరత్నాలను పూజార్థము ఉంచాడు. తరువాత అతడు జలమును, పాదుకలను, ఛత్రమును, సువర్ణమును, వజములను, ముత్యాలను, వైడుర్యమును, సుగంధ ధూపమును సమర్పించి శ్రీపరశురాముని, అమలకీ వృక్షాన్ని పూజించాడు. పిదప అతడు ప్రజలతో, బుషులతో గూడి పరశురాముని కీర్తించాడు.”
“ఓ పరశురామా! ఓ రేణుక నందనా! ఓ ఆమలకీ వృక్షభాయలో నిలిచినవాడా! ఓ కామమోక్ష పదాతా! ఇ ద; లు. ప్ర ! ఇవే నీకు మా వందనములు” తరువాత అతడు ఆమలకీ వృక్షాన్ని స్తుతించాడు : “ఓ ఆమలకీ! ఓ విశ్వపోషకా! (బహ్మతనయా! ఓ సమస్త పాపవినాశకా! నీకు మా వందనములు. దయచేసి మా అర్పణలను స్వీకరింపుము.” ఈ విధంగా భగవంతుని, ఆమలకీని పూజించిన తరువాత రాజు, అతని ప్రజలు విష్ణు ఆలయములోనే రాత్రంతా జాగరణ చేసారు. భక్తితో పాటలు పాడారు. ఆ సమయంలో విధివశాత్తుగా ఒక వేటగాడు అక్కడకు వచ్చాడు. నానారకాలైన జంతువులను చంపి అతడు జీవికను సంపాదించేవాడు. నెయ్యిదీపంతో, ధూపంతో శోభితమైన మందిరంలోనికి ప్రవేశించిన ఆ వేటగాడు చాలామంది జనులు మేల్కొని ఉన్నవారై భగవంతుని కీర్తించడము కనిపించింది. వాడు కూడ వాళ్ళతో పాటే కూర్చొని జరుగుతున్నదేమిటా యని ఆలోచించసాగాడు. అదృష్టవశాత్తు అతనికి కుండమై ఉంచిన దామోదరుని దర్శనం కలిగింది. వాడు విష్ణుభగవానుని దివ్యకథలను కూడ విన్నాడు. వాడు ఆకలితో ఉన్నప్పటికిని రాత్రంతా మేల్కొని ఉన్నవాడై ఏకాదశి మహిమలను విన్నాడు. మర్నాడు ప్రొద్దున్నే రాజు తన ప్రజలతో పాటు తన పురానికి వెళ్ళిపోయాడు. వేటగాడు కూడ ఇంటికి వెళ్ళిన తరువాత భోజనం చేసాడు. తరువాత కొన్ని సంవత్సరాలకు వేటగాడు దేహాన్ని చాలించాడు. ఏకాదశిరోజు రాత్రి జాగరణ చేసిన ఫలితంగా వాడు మరుజన్మలో అసంఖ్యాక రథగజతురగ పదాతిదళంతో కూడిన రాజుగా జన్మించాడు. జయంతి పురాన్ని పాలించే విదూరథునికి అతడు వసురథునిగా జన్మించాడు. అతడు వెయ్యి (గ్రామాలకు రాజుగా ఏలుబడి చేసాడు. అతడు సూర్యునితో సమానంగా తేజోమయుడు, చంద్రునితో సమానంగా ప్రకాశమానుడు, విష్ణువుతో సమానంగా శక్తిమంతుడు, భూదేవితో సమానంగా ఓర్పు కలవాడుగా ఉండేవాడు. సత్యసంధుడైన అతడు ధర్మపరుడై విష్ణుభక్తునిగా అయ్యాడు. ఒకరోజు వసురథుడు అడవిలో వేటకు పోయి దారి తప్పాడు. తీవ్రంగా అలసిపోయిన అతడు క్తుదార్తుడయ్యాడు. ఏ దారి తోచక అతడు ఒక చెట్టు క్రింద నడుం వాల్చి చేయినే తలగడగా పెట్టుకొని నిదురించాడు. అదే సమయంలో ఆ అడవిలో వసించే కొందరు మ్లేచ్చులు వచ్చి అతనిని నానారకాలుగా హింసించడం మొదలుపెట్టారు. అతనిని తమ శత్రువుగా భావించి వారు చంపడానికి సెద్ధపడ్డారు. ఆ రాజు పూర్వము తమ తండ్రులను, తల్లులను, పుత్రులను, ప్యాతులను, మామలను నిర్దాక్షిణ్యంగా చంపి తాము దిక్కు తోచక తిరిగేటట్లు చేసాడని వారు భావించారు. ఈ విధంగా తలచి వారు ఆయుధాల నెత్తి రాజును కొట్టారు. కాని ఆశ్చర్యకరంగా వారి ఆయుధాలు ఏవీ కూడ రాజు యొక్క శరీరాన్ని తాకలేదు. అతని శరీరముమై చిన్న గాయమైనా కాలేదు. ఆ విధంగా తమ ఆయుధాలు వ్యర్థమయ్యేసరికి మ్లేచ్చులందరు ఖిన్నులై ప్రాణభీతి పొందారు. అడుగు ముందుకు వేసే శక్తి కూడ వారికి లేకపోయింది.
ఆ సమయంలో ఒక అసాధారణ అందకత్తె గంధాభరణభూషతమయె రాజు యొక్క దేహం నుండి బయటకు వచ్చింది. చక్కని పూమాలతో అలంక ఎతమయె యున్న ఆమె కన్నులు కోపంతో ఎబ్దిబడి ఉన్నాయి. 'భుకుటి ముడిచిన ఆమె చేతిలో చక్రాన్ని ధరించి 'కోధముతో మ్లేచ్చులను చంపడానికి ముందుకు ఉరికి క్షణంలో వారిని నిహతులను చేసింది. ఈ సంఘటన పూర్తి కాగానే రాజుకు మెలకువ వచ్చింది. ఘోరమైన సంఘటనను చూసి రాజు నిద్ర నుండి మేల్కొని భీతుడై 'మాన్పడిపోయాడు. తరువాత శత్రువులందరు చచ్చిపడి ఉండటాన్ని చూసి విస్మాతుడై “ఆహా! ఈ నా శత్రువులను చంపి నన్ను రక్షించిన ఆ (శేయోభిలాషి మిత్రుడెవ్వడు? ఈ గొప్ప కార్యానికి నేను ఆతనికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నాడు. “కేశవుడు తప్ప శరణాగత జీవులను రక్షించే సామర్థ్యము వేరెవరికి ఉంటుంది? ఆతడొక్కడే శరణాగతులకు భక్తులకు పోషకుడు” అనే మాట ఆకాశంలో వినవచ్చింది. ఆకాశవాణి వాక్కులు వినగానే రాజు అమితాశ్చర్య చకితుడయ్యాడు. భక్తిభావంతో అతని హృదయం ద్రవించింది. తరువాత అతడు రాజ్యానికి తిరిగివచ్చి ఎటువంటి అవాంతరము లేకుండ ఇంద్రునిలాగా రాజ్యపాలన చేసాడు. వశిష్టముని పలుకుతూ “రాజా! ఈ పవిత్రమైన ఆమలకీ ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు నిస్పంశయంగా విష్ణుపదాన్ని పొందగలుగుతాడు” అని తెలియజేసాడు.
మాసం:(చంద్రమాసం) -
విష్ణు, చైత్ర
తిథి:(చంద్ర
రోజు)-ఏకాదశి
పక్షం:కృష్ణపక్ష
పాపమోచనీ ఏకాదశి మహిమ శ్రీకృష్ణయుధిష్టర సంవాద రూపంగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది. ఒకసారి ధర్మరాజు కృష్ణునితో పలుకుతూ “కృష్ణా! ఆమలకీ ఏకాదశి మహిమను నీవు ఇదివరకే వివరించావు. అయితే. ఇపుడు ఫాల్గుణమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి వివరించవలసినది. ఆ ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని, దాని ఫలితాన్ని నాకు చెప్పవలసినదిగా కోరుతున్నాను” అని అన్నాడు. అపుడు శ్రీకృష్ణుడు దానికి ప్రత్యుత్తరముగా పలుకుతూ “రాజోత్తమా! ఆ ఏకాదశి కేరు పాపమోచనీ. దాని మహిమను ఇపుడు విను. అతిపురాతన కాలంలో ఈ ఏకాదశి మహిమను లోమశముని మాంధాతకు వివరించాడు. ఈ ఏకాదశి ఫాల్గుణమాసం క ప్షపక్షంలో వస్తుంది. ఇది సకల పాపాలను హరిస్తుంది. జీవుని పిశాచ జీవనాని స నశింపజేస్తుంది, అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది” అని అన్నాడు. లోమశముని చెపి ఎన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవతల కోశాధిపతియైన కుబేరునికి ఒక రమ్య మైన పుష్పువనం ఉండేది. దాని పేరు మవైత్రరథము. నిత్య వసంతఫలితంగా అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. గంధర్వులు, కిన్నరులు వంటివారు అక్కడ క్రీడించేవారు. ఇంద్రాది దేవతలు కూడ అక్కడకు వచ్చి విహరించేవారు. అదేవనంలో మేధావి అనే శివభక్తుడు తపస్సు చేస్తుండేవాడు. ఒకసారి అప్పురసలు ఆయన నిష్టను భంగపరచడానికి యత్నించారు. వారిలో మంజుఘోష అనే అప్పురస ముని మనస్సును హరించడానికి ఒక పన్నాగం పన్నింది. ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని తియ్యని గొంతుతో వీణను మీటుతూ గీతాలాపన చేయసాగింది. శరీరానికి చందనాన్ని అలదుకొని, మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తియ్యగా పాడుతున్న మంజుఘోషను చూసి శివవైరియెన మన్మథుడు కూడ మునిని జయించడానికి యత్నించాడు. పూర్వమొకసారి శివుడు మన్మథుని కాల్చి భస్మం చేసేసాడు. పూర్వ శత్రుత్వాన్ని గుర్తు చేసికొనినవాడై మన్మథుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శివభక్తుడైన ముని మనస్సులో ప్రవేశించాడు. తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి చ్యవనబుషి ఆశ్రమంలో వసిస్తున్న మేధావి బుషి అపుడు రెండవ మన్మథునిగా గోచరించాడు. అపుడు మంజుఘోష అతని చెంతకు చేరింది. అది చూసి మేధావి కూడ కామపీడితుడై తన దైవాన్ని మరిచాడు. ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనితా సాంగత్యంలో మునిగి రేయింబవళ్ళనే మరచిపోయాడు. ఆ కామకలాపాలలోనే అనేక సంవత్సరాలు దొర్లిపోయాయి. ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించిన మంజుఘోష తిరిగి తన వెళ్ళిపోవాలని నిశ్చయించుకొంది.
అదే విషయాన్ని ఆమె మేధావితో లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. అపుడు మేధావి ఆమెతో “రమణీ! నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ప్రొద్దున్నే వెళ్ళిపో” అని అన్నాడు. మునికి భయపడిన మంజుమఘూష సరేనని చెపే ఎ మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ రకంగా ఆ అప్పరస యాభైఏడు సంవత్సరాల తొమ్మిది నెలల మూడురోజులు మునితో గడిపినప్పటికిని అదంతా "కేవలము ఒక రేయిలో సగభాగము వలెనే తోచసాగింది. తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. కాని ఈసారి ముని ఆమెతో “రమణీ! నా మాటలు విను. ఇది కేవలం 'ప్రాతఃసమయం. నేను ప్రాతఃకాల విధులు పూర్తి చేసేంతవరకు ఇక్కడే ఉండు” అని అన్నాడు. అపుడు అప్పరస నవ్వి “మహర్షీ! మీ ప్రాతఃకాలవిధులు పూర్తి కావడానికి ఇంకెంత పడుతుంది? ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా? ఇప్పటికే నా సాంగత్యంలో మీరు అనేక సంవత్సరాలు గడిపివేసారు. ఇప్పటికైనా సమయం విలువ తెలిసికోండిొ” అని అన్నది. ఆ మాటలు వినగానే బుషికి జ్ఞానోదయం కలిగింది. అపుడు ఆ బుషి “సుందరీ! యాభైఏడేళ్ళ విలువైన కాలాన్ని నేను వృథా చేసాను. నీవేనా సమస్తాన్నీ, తపస్సును నాశనం చేసావు” అని అంటూనే ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. దేహం కోపంతో కంపించింది. అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ “నీవు మంత్రకత్తె, పిశాచిలాగా ప్రవర్తించావు. కాబట్టి పిశాచిలాగా మారిపో. పాపెష్టదానా! సిగ్గు సిగ” అని అన్నాడు. మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుమఘోూష అతనితో “ఓ బ్రాహ్మణోత్తమా! దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో. నేను నీకు అనేక సంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలిని. నా మీద దయ చూపించు” అని అన ది. ఆమె మాటలను వినిన మేధావి అపుడు ఆమెతో “సౌమ్యురాలా! నేనేం చేసేది? నీవు నా తపోసంపదను కొల్లగొట్టావు. అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నీకొకటి నేను చెబుతాను. ఫాల్గుణమాసం క ఫప్షపక్షంలో వచే ్స్ ఏకాదశి మేరు పాపమోచనీ ఏకాదశి. అది సకల పాపహరము. నీవు ఆ ఏకాదశివతాన్ని పాటిస్తే నీ పిశాచజీవనం పోతుంది” అని పలికాడు. తరువాత మేధావి తన తండ్రి చ్యవనబుషి ఆశ్రమానికి వెళ్ళాడు. పతితుడైన తన పుత్రుని చూసి చ్యవనబుషి అతిదుఃఖితుడై “అయ్యో! నీవెంత పనిచేసావు! సాధారణమైన వనితకు ఆకర్షితుడవై తపోసంపదను నష్టపరచడం నీకు తగనే తగదు” అని అన్నాడు. అపుడు మేధావి పలుకుతూ “తండ్రీ! దురదృష్టవశాత్తు నేను అప్పరస సాంగత్యంలో మహాపాపానికి ఒడిగట్టాను. కాబట్టి నాకు పాపపరిహారాన్ని తెలియజేయండి” అని అర్థించాడు. తనయుని దీనాలాపన వినిన చ్యవనబుషి అపుడు మార్గోపదేశం చేస్తూ “పుత్రా! పాపమోచని ఏకాదశి 'వ్రతపాలన వలన సమస్త పాపాలు నశిస్తాయి. కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు” అని అన్నాడు. తండ్రి మాటలను వినిన మేధావి పరమోత్సాహముతో ఆ ఏకాదశి 'వ్రతపాలనకు సిద్ధపడ్డాడు. తరువాత ఆ ఏకాదశి వ్రతవిధానం వలన మేధావి పాపాలన్నీ నశించిపోయాయి, అతడు కూడ పరమ పుణ్యభాగుడయ్యాడు. మంజుఘోష కూడ పాపమోచనీ ఏకాదశి పాలన ద్వారా పెశాచరూపం నుండి బయటపడి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది. మాంధాతకు ఈ కథను వివరించిన లోమశముని చివరిగా పలుకుతూ “రాజా! ఈ పాపమోచనీ ఏకాదశి 'వ్రతపాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రత మాహాత్మ్యాన్ని చదవడం వలన, వినడం వలన సహస గోదాన ఫలం లభిస్తుంది. ఈ 'వ్రతపాలన ద్వారా బ్రహ్మహత్యా పాతకము, భూణహత్యాపాతకం, మదిరాపాన పాతకము, గురుపత్ని సంగమపాతకము వంటి సకల పాపాలు సమూలంగా నశిస్తాయి” అని అన్నాడు. సారాంశమేమనగా ఈ ఏకాదశి పరమమంగళకరమైనది, సకల పాపహరమైనది కాబట్టి ప్రతియొక్కరు శ్రద్ధతో ఈ ఏకాదశి 'వ్రతపాలన చేయాలి.
మాసం:(చంద్రమాసం)-
విష్ణు, చైత్ర
తిథి:(చంద్ర
రోజు)-ద్వాదశి
పక్షం:శుక్లపక్ష
కామదా ఏకాదశి మాహాత్మ్యము శ్రీకృష్ణధర్మరాజుల సంవాదరూపంలో వరాహపురాణములో వర్ణించబడింది. ఒకసారి ధర్మరాజు యదుకుల శిరోమణిమైన శ్రీకృష్ణుని సమీపించి ఆతనితో “ఓ వాసుదేవా! వైత్రమాసములోని శుక్షపక్షములో వచ్చే ఏకాదశిని గురించి నాకు వివరించవలసినది. అలాగే ఆ ఏకాదశిని పాటించే విధానాన్ని, దాని వలన కలిగే లాభాలను నాకు తెలుపవలసినది” అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానమిస్తూ “ధర్మనందనా! పురాణలిభితమైన ఆ ఏకాదశిని గురించిన వర్షనను సావధానంగా విను. 'శ్రీరామచందుని ప్రపితామహుడైన దిలీపుడు వైత్రమాసము శుక్షపక్షములో వచ్చే ఆ ఏకాదశిని గురించి తన గురువైన వశిష్టుని అడుగగా ఆయన దానిని గురించి ఈ విధంగా తెలిపాడు” అని పలుక నారంభించాడు. వశిష్టుడు దిలీపునితో “రాజా! నేను తప్పకుండా నీ కోరికను తీరుస్తాను. ఆ ఏకాదశి పేరు కామదా ఏకాదశి. పరమపవిత్రమైన ఆ ఏకాదశి సకల పాపాలను భస్మీపటలము కావించి, వ్రతపాలనము చేసే వ్యక్తికి పుత్రోదయాన్ని కలిగిస్తుంది. ఇక దాని మహిమలను వినూ” అని పలికి దానికి సంబంధించిన వివరాలను స తెలుప నారంభించాడు. పూర్వము రత్నపురమనే నగరము ఉండేది. అత్యంత వైభవోపేతమైన ఆ నగరాన్ని పుండరీకుడనే గంధర్వరాజు పాలిస్తుండేవాడు. గంధర్వకిన్నర అప్పరసలు ఆ నగరంలో నివసించేవారు. ఆ నగరంలో లలిత అనే సౌందర్యవతియైన అప్పరస లలితుడనే సుందరుడైన పతితో కలిసి నివసిస్తుండేది. అతడు గంధర్వుడు. పరస్పర గ్రేమతో విహ్వలురై ఉండే ఆ జంట తమ భవ్య మైన భవంతిలో నిత్య కేళిలో ఉండేవారు. క్షణకాల వియోగాన్ని కూడ వారు భరించలేకపోయేవారు. ఒకసారి పుండరీకుని సభలో నృత్యగాన కార్యక్రమము ఏర్పాటు చేయబడింది. దానిలో పలు గంధర్వులతో పాటు లలితుడు కూడ గానం చేసాడు. కాని దానిలో లలిత పాల్గొనలేదు. ఆమె లేకపోవడము వలన లలితుడు పాడే పాటలో కొన్ని తప్పులు దొర్లాయి. దాని లయ తప్పింది. శోతలలో కర్కోటకుడనే నాగజాతికి చెందినవాడు ఇది గమనించి లలితుని వ్యవహారానికి అసలైన కారణాన్ని రాజుకు తెలియజేసాడు. అది వినిన రాజు మిక్కిలి కుపితుడై “ఓరీ పాపే! కామంతో నీవు నృత్యగాన కార్యక్రమంలో రాసాభాసం చేసావు. నీవు నరభక్షకుడివి కమ్మని శపిస్తున్నాను” అని అన్నాడు. పుండరీకుని శాపంతో లలితుడు వెంటనే ఘోరరూపుడైన నరభక్షకునిగా అయ్యాడు. అతనిని చూసిన లలిత తీవ్రమైన బాధకు గురి అయింది.
ఏమి చేయాలి, ఎటు పోవాలి అని రేయింబవళ్ళు ఆమె తవ దుఃఖముతో తపిస్తూ భర్తతోనే కలిసి కాలం గడపసాగింది. ఒకసారి ఆమె భర్తతో పాటు అడవిలో సంచరిస్తున్న సమయంలో వింధ్యాచల శిఖరముమైన శృంగిముని ఆశ్రమము కనిపించింది. లలిత వెంటనే ఆశ్రమంలో ప్రవేశించి శృంగికి నమస్కరించింది. అప్పుడు ఆయన ఆమె వివరాలను కనుక్కొాగా లలిత తన వృత్తాంతాన్ని వివరించి చెప్పే తన భర్తకు శాపవిమోచనమయ్యే మార్గాన్ని తెలుపమని ప్రార్థించింది. దానికి ప్రత్యుత్తరముగా ఆయన రాబోయే ఏకాదశి కామదా ఏకాదశి యని, దానిని పాటించే వ్యక్తికి సమస్త కోరికలు తీరుతాయని, ఆ ఏకాదశి ఫలాన్ని ఆమె తన భర్తకు ధారపొస్తై అతడు శాపవిముక్తుడవుతాడని తెలిపాడు. ముని చెప్పిన విధంగానే లలిత భక్తిశద్ధలతో కామదా ఏకాదశి వ్రతపాలనము చేసింది. ద్వాదశిరోజు ఆమె బ్రాహ్మణులు, వాసుదేవుని సమక్షంలో కూర్చొని తన (వ్రతఫలాన్ని భర్తకు ధారపోసింది. దాని ప్రభావం వలన లలితునికి శాపవిముక్తి కలిగి వెంటనే పూర్వగంధర్వరూపాన్ని పొందాడు. అప్పటి నుండి లలిత, లలితుడు ఇద్దరు కలిసి సుఖంగా జీవించసాగారు. ఈ వృత్తాంతాన్ని వివరిస్తున్న శ్రీకృష్ణుడు ధర్మరాజుతో “జి రాజ్యశేష్టుడా! ఈ అద్భుతమైన కామదా ఏకాదశి వర్షనను వినినవాడు నిశ్చయంగా దీనిని తన శక్ష్యనుసారము పాటించాలి. ఈ (వతపాలనము బహృహత్వాపాతకానెనా, ఎంతటి ఘోరమెన శాపాన్సైనా పరిహరిసుంది” అని అనాడు.
మాసం:(చంద్రమాసం) -
మధుసుందన,వైశాఖ
తిథి:(చంద్ర
రోజు)-ఏకాదశి
పక్షం:కృష్ణపక్ష
ఎకాదశి వతం నామ సర్య్వకామఫల ప్రదం | కర్తవ్యం సర్వదా విమైైర్ విష్ణు ప్రీణనకారణం |!” చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే వరూథినీ ఏకాదశి మహిమ శ్రీకృష్ణధర్మరాజ సంవాదముగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది. ఒకసారి ధర్మరాజు శఈక ప్షభగవానునితో పలుకుతూ “వాసుదేవా! నీకు నమస్సులు. చైత్రమాసం క ఫప్షపక్షంలో వచే ్స్ ఏకాదశిని గురించి, దాని నామప్రభావ మహేమలను గురించి నాకు వివరించవలసినది” అని అన్నాడు. దానికి ప్రత్యుత్తరమిస్తూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు : “రాజా! ఆ ఏకాదశి పేరు వరూథినీ ఏకాదశి. అది ఇహపరాలలో మనిషికి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ ఏకాదశి 'వ్రతపాలనము ద్వారా మనిషి నిరంతర సుఖాన్ని పొందుతాడు : తన పాపం నశించగా అతడు అత్యంత నాభాగ్యవంతుడాతాడు. ఆ వ్రతపాలనచే అభాగ్యురాలైన సతి భాగ్యవంతురాలౌతుంది, పురుషుడు ఇహపరాలలో సుఖసమృద్ధులు పాందుతాడు, వారు జన్మమృత్యువుల వలయం నుండి బయటపడతారు, సమస్త పాపం నశించగా వారు భగవద్భక్తిని పొందుతారు. మాంధాత ఆ ఏకాదశి 'వ్రతపాలన ద్వారానే ముక్తుడయ్యాడు. ధుంధుమారుని వంటి ఎందరో రాజులు ఆ 'వ్రతపాలన ద్వారా మోక్షాన్ని పొందారు. వరూథినీ ఏకాదశి 'వ్రతపాలన మాత్రముననే మనిషి పదివేల సంవత్సరాల తపోఫలాన్ని పొందగలుగుతాడు. కురుక్షే 'త్రములో సూర్యగ్రహణ సమయమున నలభై కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం "కేవలము ఆ వరూధినీ ఏకాదశి 'వ్రతపాలనము ద్వారా మనిషి సాధించగలుగుతాడు.” “ఓ రాజోత్తమా! అశ దానము కన్నను గజదానము (శేష్టమైనది. భూదానము గజదానము కన్నను (శేష్టమైనది; తిలాదానము భూదానము కన్నను (శేష్టము. సువర్దదానము తిలాదానము కన్నను, అన్నదానము సువర్షదానము కన్నను (శేష్టములైనవి. నిజానికి అన్నదానము కంటే (శేష్టమైన దానము ఇంకొకటి లేనేలేదు. ఓ రాజ్యశేష్టుడా! అన్నదానముచే మనిషి పితృదేవతలను, దేవతలను, _సకలజీవులను సంతృప్తిపరుపగలుగుతాడు. కన్యాదానము అన్నదానముతో సమానమని పండితులు చెబుతారు. అన్నదానము గోదానముతో సమానమని సాక్షాత్తుగా భగవంతుడే పోల్చి చెప్పాడు. అంతేగాక దానములు అన్నింటిలోను ఇతరులకు జ్ఞానదానము చేయుట అత్యున్నతమైన దానము”
“వరూథినీ ఏకాదశి 'వ్రతపాలనముచే మనిషి సమస్త దాన ఫలితాన్ని పొందగలుగుతాడు. కుమార్తెను అమ్మి జీవికను సంపాదించే వ్యక్తి నిక్కముగా ఘోరపాపాన్ని మూటగట్టుకొనినవాడై విలయానంతరము వరకు నరకములో (మగ్గుతాడు. కనుక ఎవ్వడును కుమార్తెను తాకట్టు పెట్టరాదు. ఓ రాజరాజా! లోభముచే ఎవడేని కుమార్తెను అమ్ముకుంటే మరుసటి జన్మలో పెల్లి అవుతాడు. కాని ఎవడైతే శక్యృనుసారము కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యు డైన వరునికి దానమిస్తాడో అతని పుణ్యపరిపాకాన్ని యమరాజు యొక్క ప్రధాన కార్యదర్శి యెన చిత్రగుప్పు డైనా గణించలేడు. ఆ ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు కంచుపాత్రలో భుజించరాదు, మాంసభక్షణము చేయరాదు, ఎబ్జిపప ఎను, శనగపప్పును, పాలకూరను, తేనె, ఇతరులు వండిన దానిని, ఒకమారు కంటే ఎక్కువ గాని తినరాదు; ఏకాదశికి ముందురోజు నుండే మైథనక్రియలో పాల్గొనరాదు. జూదము, నిద్ర, తాంబూల సేవనము, పళ్ళను తోముకొనుట, ఇతరులను నిందించుట, పాపితో మాట్లాడుట, కోధి యగుట, ఏకాదశి రోజు అబద్ధము చెప్పుట వంటివి ఎంతమాత్రము చేయరాదు. ఏకాదశి మర్నాడు కూడ మనిషి కంచుపాత్రలో భుజించరాదు; మాంసభక్షణము, ఎబజ్జ్బపప్పు వంటివి తినరాదు; తేనెను త్రాగరాదు. అసత్య భాషణము, వ్యాయామము, కష్టించి పనిచేయడము, రెండు పూటల భోజనము, మైథున సంభోగము, గుండు గీసికొనుట లేదా గడ్డము చేసికొనుట, శరీరానికి త్రైలమర్దనము, ఇతరులు వండినదానిని తినడము చేయరాదు. ఏకాదశి వ్రతభంగానికి దారితీసే ఈ నిషేధాలను జాగరూకతతో పాటించాలి. వీటితోపాటు ఇతర నిషేధాలను ఈ మూడు రోజులే కాకుండ ఎప్పటికీ పాటించాలి. ఈ నియమనిబంధనల ననుసరించి వరూధినీ ఏకాదశి వ్రతాన్ని పాటించే వ్యక్తి సమస్త పాపదూరుడై పరమగతిని పొందుతాడు. ఆ ఏకాదశి రోజున మేల్కొని ఉండి జనార్దనుని (శ్రీకృష్ణుని కేవించేవాడు సమస్త పాపదూరుడై జీవిత చరమలక్షా గన్ని సాధిస్తాడు. ఆ ఏకాదశి మహిమను వినేవాడు, చదివేవాడు వేయిగోవుల దానఫలితాని నిక్కముగా పొందుతాడు; పాపముక్తుడై అతడు విష్ణుపదాన్ని చేరుకుంటాడు”
మాసం:(చంద్రమాసం) -
మధుసుందన,వైశాఖ
తిథి:(చంద్ర
రోజు)-ఏకాదశి
పక్షం:శుక్లపక్ష
వైశాఖమాసంలోని _(ఏప్రిల్/మే) శుక్షపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మాహాత్మ్యము సూర్యపురాణంలో వివరించబడింది. “ఓ జనార్దనా! వైశాఖమాసం శుక్షపక్షంలో వచ్చే ఏకాదశి మరేమిటి, దానిని ఆచరించే పద్దతి ఏమిటి, దానిని ఆచరించడము వలన కలిగే ఫలితమేమిటి” అని ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు అతనితో “ధర్మనందనా! వసిష్టుడు శ్రీరామునికి తెలిపిన ఒక కథను నేను మీకు వివరిస్తాను. సావధానంగా విను” అని పలికాడు. ఒకసారి శ్రీరాముడు జనకసుతయైన సీతాదేవి వియోగముతో మిక్కిలి వేదనకు గురియె సమస్త పాపదుఃఖ వినాశకరమైన ఒక వ్రతాన్ని గురించి తనకు వివరించమని వసిష్టుని అడిగాడు. అపుడు వసిష్టుడు శ్రీరామునితో “రామచంద్రా! నీ ప్రశ్న సకల మానవాళికి లాభదాయకమైనది. కేవలము నీ మంగళకర నామోచ్చారణము చేతనే మానవులు పవిత్రులై సమస్త శుభాన్ని పొందగలుగుతారు. అయినా సాధారణ మానవుల లాభము కొరకు నేను ఒక మహావ్రతాన్ని వివరిస్తాను. శ్రీరామా! వైశాఖ శుక్షపక్ష ఏకాదశి మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. అది ఎంతో మంగళకరమైనది. ఆ ఏకాదశిని పాటించడము ద్వారా మనిషే యొక్క సమస్త పాపాలు, దుఃఖాలు, మాయ పటాపంచలౌతాయి. దానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను ఇపుడు వినూ” అని అన్నాడు. పవిత్ర సరస్వతీ నదీతీరంలో భద్రవతి అనే సుందరమైన నగరము ఉండేది. దానిని ద్యుతిమానుడనే రాజు పాలించేవాడు. అతడు చంద్రవంశానికి చెందినవాడు; సహిషస్లుత కలిగిన అతడు సత్యసంధుడై ఉండేవాడు. అదే నగరంలో ధనపాలుడనే విష్ణుభక్తుడు కూడ జీవించేవాడు. వైశ్యవర్ణానికి చెందిన ధనపాలుడు ఎన్నో సత్రాలను, విద్యాలయాలను, విష్ణుమందిరాలను, వైద్యశాలలను, విశాలమైన రహదారులను నిర్మింపజేసాడు, మంచినీటి బావులను తవ్వించాడు, ఉద్యానవనాలను ఏర్పాటు చేసాడు, ఆహారవసతి కల్పించాడు. ఈ విధంగా తనకున్నట్టి ధనాన్ని సద్వినియోగపరచి అతడు తన పేరును నిలబెట్టుకున్నాడు.
ఎల్లరికి (శ్రేయోభిలాషయైనట్టి ఈ విష్ణుభక్తునికి శమనుడు, ద్యుతిమానుడు, మేధావి, సుకృతి, ధృష్టబుద్ధి అనే ఐదుగురు పుత్రులు ఉన్నారు. వారిలో ధృష్టబుద్ధి పరమపాపి. కుమతి, చెడుప్రవర్తన కలిగినవాడు అయిన ధృష్టబుద్ధి వేశ్యాసాంగత్యమును కలిగినవాడై జూదము, మద్యపానము పట్ల మక్కువ చూడేవాడు. ఇతర ప్రాణులను చంపడములో, హింసించడములో అతనికి ఆనందము కలిగేది. కులకళంకముగా తయారైన అతడు దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, బ్రాహ్మణులకు ఏమాత్రము గౌరవము ఇవ్వలేదు. పాపియైన అతడు తండ్రి ధనాన్ని దుర్వినియోగం చేసేవాడు. ఒకసారి అతడు రహదారిలో ఒక వేశ్య భుజండై చేయివేసి నడవడాన్ని చూసి చలించిపోయిన ధనపాలుడు అతనిని ఇంటి నుండి తరిమివేసాడు. ఆ విధంగా తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరి (గేమను కోల్పోయి వీధిలో పడిన ధృష్టబుద్ధి తనకున్న వస్త్రాభరణాలను అమ్ముకొని కొంతకాలము తన పాపకార్యాలను కొనసాగించాడు. ఆ ధనము కూడ ఖర్చు కాగానే నిజమైన కష్టాలు ఆరంభమైనాయి. తగినంత ఆహారము లభించక అతడు బక్కచిక్కిపోయాడు. చింతాగ్రస్తు డైన ధృష్టబుద్ధి ఇక చేసేదిలేక దొంగతనానికి సిద్ధపడ్డాడు. ఒక్కొక్కసారి రక్షకభటులకు చిక్కినా అతని తండ్రీ గొప్పతనాన్ని చూసి వారు అతనిని వదలివేసేవారు. కాని ఒకసారి అతడు ఒక పెద్ద దొంగతనము చేసి పట్టుబడ్డాడు. అపుడు రాజు అతనికి దేశబహిష్కరణ శిక్ష విధించాడు. ఆ విధంగా దేశబహిష్కరణ శిక్షకు గురియెన ధృష్టబుద్ధి ఒక కీకారణ్యములో ప్రవేశించి ఆకలిదప్పులకు లోనై విచక్షణారహితంగా పశువులను, పక్షులను చంపి పచ్చి మాంసాన్నే భుజించసాగాడు. ఆ విధంగా విల్లంబులు పట్టుకొని ప్రాణిహింస అనే పాపం చేస్తూ అతడు అనేక సంవత్సరాలు గడిపాడు. ఆ విధంగా అడవిలో సంచరిస్తూ ఒకరోజు ధృష్టబుద్ధి కౌండిన్యబుషి ఆశ్రమంలో ప్రవేశించడము జరిగింది. అది వైశాఖ మాసము. ఆ బుషి గంగానదిలో స్నానం చేసి అప్వుడే ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు. దైవవశంగా ఆ బుషివస్త్రం నుండి ఒక నీటిచుక్క ధృష్టబుద్ధి మీద పడింది. దానితో అతని సమస్త పాపాలు నశించాయి. వెంటనే పరివర్తన కలిగిన ధ ఎప్టబుద్ది ముకుళలితహస్తుడై తన పాపాలకు ప్రాయశ్చిత్తం తెలుపుమని ఆ మబుషీని ప్రార్ధించాడు. అతని మాటలను వినిన కౌండిన్యబుషి కరుణాంతరంగుడై ఈ విధంగా పలికాడు : “నీ పాపాలన్నీ కూడ శీఘ్రగతిన నశించే ఉదాత్తమైన పద్దతిని చెబుతాను విను. వైశాఖమాసం శుక్షపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మేరు పర్వతమంత పాపరాశినైనా నశింపజేయగలుగుతుంది. కనుక ఆ ఏకాదశిని నీవు శ్రద్ధతో ఆచరించు”. కాండిన్యబుషి చెప్పిన మాటలను వినిన ధృష్టబుద్ది ఆయన ఉపదేశించిన విధి ననుసరించి మోహిని ఏకాదశిని భక్తిశద్ధలతో నిర్వహించాడు. ఆ వ్రతపాలనముచే అతడు సమస్త పాపదూరుడై తదనంతరము దివ్యదేహాన్ని పొంది గరుడవాహనం మీద వైకుంఠానికి వెళ్ళాడు. ఈ ఏకాదశి వ్రతము మాయను తొలగించి అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. తీర్థస్నానము, దానము, యజ్ఞాచరణము వలన కలిగే పుణ్యరాశియెనా ఈ మోహిని ఏకాదశి 'వ్రతపాలనము వలన కలిగే పుణ్యముతో సరిపోలదు. హరేకృష్ణ!
మాసం:(చంద్రమాసం) -
త్రివిక్రమ,జ్యేష్ఠ
తిథి:(చంద్ర రోజు)-ఏకాదశి
పక్షం:కృష్ణపక్ష
వైశాఖమాసం కృష్ణపక్షంలో వచ్చే అపర ఏకాదశి వృత్తాంతము శ్రీకృష్ణయుధిష్టిర సంవాద రూపంలో బ్రహ్మాండపురాణంలో వర్షించబడింది. “వెశాఖమాసం క ప్షపక్షంలో వచే ్స్ ఏకాదశి కేరేమిటి, దాని మాహాత్మ సమేమిటి, ఆ వివరాలు నాకు చెప్పవలసినది" అంటూ ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని అడిగాడు. దానికి ప్రత్యుత్తరముగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు : “ధర్మరాజా! నీవు అడిగిన వివేకపూర్ణ మైనట్టి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైనది. ఆ ఏకాదశి పేరు అపర ఏకాదశి. రాజా! ఈ ఏకాదశి పాలనము అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త పాపాలను నశింపజేస్తుంది. బాహ్మణ హత్య, గోహత్య, భూణహత్య, పరనింద, అక్రమ సంబంధాలు, అసత్యవాదము, తప్పుడు సాక్షా శు ఇవ్వడము, డంబములు చెప్పుకోవడము, డబ్బు కొరకు వేదాలను పఠించడము లేదా బోధించడము, స సంతశాస్త్ర కల్పనము వంటి ఘోరమైన పాపాలైనా ఈ ఏకాదశి 'వ్రతపాలనతో నశించిపోతాయి. మోసకాడు, మిథ్యా జ్యోతిష్కుడు, దొంగ వైద్యుడు వంటివారు తప్పుడు సాక్ష్యమిచ్చేవారంతటి పాపాత్ములే అయినప్పటికిని ఇటువంటి పాపాలన్నీ అపర ఏకాదశి 'వ్రతపాలనతో దూరమౌతాయి. తన ధర్మాన్ని త్యజించి యుద్ధరంగం నుండి పారిపోయిన క్షత్రియుడు నిశ్చయంగా పతనం చెంది నరకంలో పడతాడు. అటువంటి వ్యక్తియైనా ఈ ఏకాదశిని పాటిస్తే స్వర్గాన్ని చేరుకుంటాడు” “రాజా! గురువు నుండి జ్ఞానాన్ని పొందిన తరువాత గురుదూషణను చేసే శిష్యుడు నిక్కముగా పాపాన్ని మూట కట్టుకుంటాడు. అంతటి పాపియెనా కూడ అపర ఏకాదశి పాలన ద్వారా పాపవిముక్తుడై పరమగతిని పొందగలుగుతాడు. రాజేంద్రా! కార్తీకమాసంలో పుష్కరతీర్ధంలో ముమ్మారు స్నానం చేసిన ఫలితం, పుష్యమాసంలో సూర్యుడు మకర సంక్రమణం చేసే సమయంలో ప్రయాగలో స్నానమాడిన ఫలితము, కాశీలో శివర్యాతి వ్రతాన్ని పాటించిన ఫలితము, గయలో విష్ణుపాదాల చెంత పెిండప్రదానము చేసిన ఫలితము, గురువు సింహరాశిలో ప్రవేశించినపుడు గౌతమినదిలో నా నమాడిన ఫలితము, కుంభమేళ సమయంలో కేదారనాథక్షే త దర్శనఫలము, బదరీనాథ్ క్ష త్ర దర్శనపూజాఫలము, సూర్యగ్రహణ సమయంలో కురుక్షే త్రంలో స్నానఫలము, ఏనుగులు, గుజ్జములు, గోవులు, సువర్ణము, భూమి మున్నగువాటిని దానమిచ్చిన ఫలము అన్నీ కూడ అపర ఏకాదశి 'వ్రతపాలనచే సులభంగా లభిస్తాయి. ఇది పాపవ్యక్షాన్ని కూల్చివేసే పదునైన గొడ్డలి వంటిది, పాపమనే అరణ్యాలను దహింపజేసే తీవ్రమైన దావానలము, ఇది పాపము నుండి పుట్టిన చీకటిని పటాపంచలు చేసే సూర్యుడు; పాపాటవిలో జింకకు ఇది సింహము వంటిది. రాజా! ఈ అపర ఏకాదశిని పాటించడము ద్వారా, విష్ణువును టత్రివిక్రముని రూపంలో ఆరాధించడము ద్వారా మనిషి సర్వమంగళమైన విష్ణుపదాన్ని పొందుతాడు. ఎల్లరి లాభం కొరకు నేను నీకు చెప్పేనట్టి ఈ ఏకాదశి మాహాత్మ్యాన్ని వినేవాడు, చదివేవాడు సర్వపాపవిముక్తుడౌతాడు.”
మాసం:(చంద్రమాసం) -
త్రివిక్రమ,జ్యేష్ఠ
తిథి:(చంద్ర రోజు)-ఏకాదశి
పక్షం:శుక్లపక్ష
జ్యేష్టమాసంలో వచ్చే నిర్ణల ఏకాదశి వర్షనము బ్రహ్మ వైవర్తపురాణంలోని వ్యాసదేవ భీమసేన జ్ర న్ న్ద వః సంవాదంలో కనబడుతుంది. ధర్మరాజు అనుజుడైనట్టి భీమసేనుడు ఒకసారి మహాముని శ్రీల వ్యాసదేవుని ఇలా అడిగాడు : “ఓ మహామునీ! నా విన్నపమును వినండి. నా జ్యేష్ట సోదరుడు ధర్మరాజు, తల్లి కుంతీదేవి, సోదరులైన అర్జున నకుల సహదేవులు, ద్రౌపది ఏకాదశి రోజున ఏదీ తినరు. నేను కూడ ఏకాదశిరోజున ఉపవాసం చేయాలని వారందరు, ముఖ్యంగా ధర్మరాజు ఎప్పుడూ చెబుతుంటారు. ఏకాదశి రోజున ఉపవాసమనేది శాస్తో్రోపదేశమని నాకు తెలిసినప్పటికిని ఆకలిని నేను భరించలేను కనుక ఉపవాసం చేయడం నాకు సాధ్యం కాదని నేను వారికి చెబుతుంటాను. నేను నా శక్త్యనుసారము దానమివ్వగలను, యథావధిగా కేశవుని అర్చించగలను; కాని ఉపవాసం మాత్రము చేయలేను. కాబట్టి ఉపవాసము లేకుండ ఏకాదశి ఫలాన్ని నేనెట్లా పాందగలనో నాకు ఉపదేశించవలసినది.” భీమసేనుని ఈ పలుకులను వినిన శ్రీల వ్యాసదేవుడు అతనితో “భీమా! నీవు స్వర్గలోకాలకు వెళ్ళాలనుకుంటే, నరకలోక వాసాన్ని తప్పించుకోవాలంటే ప్రతీనెల రెండు ఏకాదశి దినాలలో తప్పక ఉపవాసం చేయవలసియే ఉంటుంది.” అని అన్నారు. అపుడు భీముడు వ్యాసునితో “మహామునీ! ప్రతీ సంవత్సరము 24 ఏకాదశి దినాలలో ఉపవాసం చేయడం నాకు అసాధ్యం. రాత్రి పగలు ఉపవాసం మాటెందుకు, ఆకలిని నేను క్షణకాలం కూడ భరించలేను. వృకమనే జఠరాగ్ని నా కడుపులో ఎప్పుడూ ఉంటుంది. కేవలము అతిభోజనం ద్వారానే అది చల్లారుతుంది. అయినా అతి ప్రయత్నంతో నేను సంవత్సరంలో ఒక రోజు ఉపవాసం చేయగలను. కాబట్టి ఇహపరాలలో శుభాన్ని పొందడానికి నేను ఆచరించగలిగే వ్రతాన్ని నాకు ఉపదేశించండి” అని అన్నాడు. దానికి శ్రీల వ్యాసదేవుడు పలుకుతూ “రాజా! వేదనియమాలను గురించి, మానవుల కర్తవ్యాలను గురించి ఇదివరకే నీవు నా నుండి. విన్నావు. కాని కలియుగంలో ప్రతియొక్కరు నియమనిబంధనలను పాటించలేరు. కాబట్టి మహోన్నత ఫలితాలను సాధించగలిగే ఉదాత్తమైన పద్ధతిని నేను నీకు చెబుతాను. ఇది సమస్త పురాణసారము. శుక్త కృష్ణ పక్షాలలో వచ్చే ఏకాదశిదినాలను పాటించేవాడు ఎన్నడును నరకానికి పోడు” అని అన్నాడు.
> శ్రీల వ్యాసదేవుని మాటలను వినిన పరమ బలశాలి యోధుడైన భీమేసేనుడు పరమభీతుడై అశ్వత్థవృక్ష ఆకులాగా వణికిపోయి ఆయనతో “మహామునీ! నేనేం చేసేది? సంవత్సరమంతా నెలకు రెండుమార్లు పూర్తిగా ఉపవాసం చేయడం నాకు అసాధ్యం. కనుక స్తూ ప్రభూ! పరమ పుణ్య మైనట్టి వ్రతాన్ని, దానిని అనుసరించడము ద్వారా నేను సకలఫలాలను పొందే పద్ధతిని దయతో నాకు ఉపదేశించండి” అని అన్నాడు. భీముని మాటలకు బదులుగా శ్రీల వ్యాసదేవుడు ఇలా అన్నాడు : “జ్యేష్టమాసం శుక్షపక్షంలో సూర్యుడు వృషభరాశిలో గాని, మిథునరాశిలో గాని ఉన్నప్పుడు వచ్చే ఏకాదశి మేరు నిర్జల ఏకాదశి. ఆ ఏకాదశిరోజు మనిషి పూర్తి ఉపవాసాన్ని పాటించాలి. మంచినీళ్ళైనా త్రాగరాదు. ఆ రోజు ఆచమనము చేసినపుడు ఆవగింజ లేదా బంగారు కణిక మునిగేటంత జలంతో మాత్రమే ఆ కార్యాన్ని పూర్తి చేయాలి. అంత స్వల్పజలాన్ని అరచేతిలో వేసికొని గోకర్ణాన్ని తాకే విధంగా దానిని పట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ గాని, తక్కువ గాని జలాన్ని త్రాగితే అది సురాపానముతో సమానమౌతుంది.” “ఆ ఏకాదశి రోజు ఏదీ తినకూడదు. లేకపోతే 'వ్రతభంగమవుతుంది. దా (దశిరోజు సూర్యోదయం వరకు మంచినీైై నా త్రాగకూడదు. మనిషి ఈ విధంగా ఈ ఏకాదశిని నిర్ణలంగా పాటిస్తై సంవత ఎరంలోని అన్ని ఏకాదశిలను పాటించిన ఫలాని న పాందగలుగుతాడు.” “ద్వాదశిరోజు తెల్లవారురూమున అతడు స్నానం చేసి బంగారాన్ని, జలాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. తరువాత అతడు బ్రాహ్మణులతో కలిసి ఆనందముగా భోజనం చేయవచ్చును.” “భీమసేనా! ఈ ఏకాదశిని పాటించడము ద్వారా ఒనగూడే పుణ్యాన్ని ఇపుడు విను. ఈ ఏకాదశిని పాటించడము ద్వారా సంవత్ప్సరములోని అన్ని ఏకాదశిలను పాటించిన ఫలము దక్కుతుంది. శంఖచక్రగదాపద్మధారియైన విష్ణుభగవానుడు ఒకసారి నాతో పలుకుతూ “సర్వధర్మాలను విడిచి నాకు శరణాగతుడై ఈ నిర్ణల ఏకాదశిని పాటించే వ్యక్తి నాకు అత్యంత ప్రయమైనవాడు; అతడు నిశ్చయంగా సకల పాపవిముక్తుడౌతాడు. దానము చేయడం ద్వారా ఎవ్వరును పరమగతిని పాందలేరు; స్మార్తవిధిని అనుసరించడము. ద్వారా ఎట్టి లాభాన్ని పాందలేరు. నిజానికి దోషదూషితమైన కలియుగంలో వైదిక ధర్మనియమాలు లుప్తమై ఉంటాయి” అని అన్నాడు. “వాయునందనా! ఇంత కన్నను నీకు చెప్పేదేమున్నది? ఏకాదశి రోజులలో భోజనము నిషేధించబడింది; నిర్ణల ఏకాదశి రోజు జలపానము కూడ నిషేధించబడింది. ఈ ఏకాదశిని పాటించడము ద్వారా మనిషి సకలతీర్థక్షే త్ర దర్శన పుణ్యాన్ని పొందుతాడు. అటువంటి వ్యక్తికి మరణసమయంలో భీకరాకారులైన యమదూతలు కనబడరు. దివ్యరూపధారులైన విష్ణుదూతలు వచ్చి అతనిని విష్ణులోకానికి తీసికొనిపోతారు. ఈ ఏకాదశి పాలనము తరువాత జలాన్ని, గోవులను దానం చేసేవాడు సకల పాపవిముక్తుడాతాడు.”
> మిగిలిన పాండవులు ఈ ఏకాదశి మహిమను వినినంతట దానిని శ్రద్ధతో పాటించాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. ఆ రోజు నుండి భీమసేనుడు నిర్ణల ఏకాదశిని పాటించడము ఆరంభించాడు. అందువలననే ఇది పాండవ నిర్ణల ఏకాదశి లేదా భీమసేని ఏకాదశి అని ప్రసిద్ధి చెందింది. ఈ ఏకాదశిని పాటించడము ద్వారా సుమేరు పర్వతమంతటి లేదా మందర పర్వతమంతటి పాపమైనా భస్మీపటలమౌతుంది. రాజా! ఈ నిర్ణల ఏకాదశి రోజు చేసే తీర్థస్నానము, దానము, వేదమంత్రోచ్చారణము, యజ్ఞనిర్వహణము వంటి పుణ్యకార్యాలు నశింపులేనివిగా అవుతాయని శ్రీకృష్ణుడే ప్రకటించాడు. ఈ ఏకాదశి మహిమను భక్తితో చదివేవాడు లేదా వినేవాడు వైకుంఠలోకానికి వెళతాడు. ప్రతిపదతో కలఠిసెనట్టి అమావాస్య వ్రతాన్ని పాటించడము ద్వారాను, సూర్యగ్రహణ సమయంలో పితృతర్పణముల ద్వారాను లభించే ఫలము కేవలము ఈ ఏకాదశి మహిమను వినడము చేత కలుగుతుంది.
మాసం:(చంద్రమాసం) -
వామన,ఆషాఢ
తిథి:(చంద్ర
రోజు)-ఏకాదశి
పక్షం:కృష్ణపక్ష
యోగినీ ఏకాదశి జ్యేస్టమాసంలోని కృష్ణపక్షములో వచ్చే యోగినీ ఏకాదశి మహిమ శ్రీకృష్ణయుధిప్టిర సంవాదరూపమున బ్రహ్మ వైవర్త పురాణంలో వర్ణింపబడింది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో “ఓ దేవా! మధుసూదనా! నిర్ణల ఏకాదశి మహిమను నేను విన్నాను. ఇక ఇపుడు జ్యేస్టమాసములోని కృష్ణపక్షమున వచ్చే ఏకాదశిని గురించి వినగోరుతున్నాను” అని అన్నాడు. దానికి దేవదేవుడు ప్రత్యుత్తరమిస్తూ “రాజా! యోగినీ ఏకాదశి అని పిలువబడే ఆ ఏకాదశిని గురించి నేను నీకు వివరిస్తాను. అది మనిషి యొక్క ఘోరమైన పాపాలను నశింపజేసి అతనిని సంసారసాగరము నుండి ఉద్దరిస్తుంది. ఈ సత్యాన్ని వివరించడానికి ఇప్పుడొక పురాణకథను తెలియజేస్తాను” అని పలికి ఆ కథను వివరించసాగాడు. అలకాపురి రాజైన కుబేరుడు గొప్ప శివభక్తుడు. అతడు నిత్యము శివారాధనము చేసేవాడు. అతని దగ్గర కోముడనే ఒక యక్షుడు తోటమాలిగా ఉండేవాడు. అతని భార్య విశాలాక్షి. ఆమె అతి సౌందర్యవతి. ఆమె పట్ల హేముడు అమితానురక్తుడై ఉండేవాడు. హేముడు నిత్యము మానససరోవరము నుండి పుష్పాలను తెచ్చి శివపూజార్థమై యక్షరాజగు కుబేరునికి ఇచ్చేవాడు. ఒకరోజు అతడు మానససరోవరము నుండి పుష్పాలను తెచ్చినప్పటికిని వాటిని కుబేరునికి ఇవ్వక భార్యపప్రేమచే బద్ధుడై ఇంటిలోనే ఉండిపోయాడు. తత్కారణంగా ఆ రోజు కుబేరునికి పూలు అందలేదు. హేముని కొరకు అతడు ఆరుగంటలు ఎదురుచూసాడు. పూలు లేకపోవడం వలన శివారాధనను పూర్తి చేయలేక అతనికి త్మీవమైన కోపం వచ్చింది. తోటమాలి చేసిన ఆలస్యానికి కారణమేమిటో తెలిసికోమని అతడు ఒక దూతను పంపాడు. షకూముడు భార్యతో గూడి ఇంటిలో భోగవిలాసాలలో ఉన్నాడని వినిన కుబేరుడు అగ్రహోదగ్రుడై వెంటనే అతనిని తన చెంతకు తీసికొనిరమ్మని భటులను పంపాడు. తన పొరబాటును తెలిసికొనిన కాముడు ఎంతో సిగ్గుపడి భయముతో కుబేరుని దగ్గరకు వచ్చి వందనము చేసాడు. అతనిని చూడగానే కుబేరుని శరీరము కంపించింది, కళ్ళు ఎజ్జబడ్డాయి. త్మీవమైన 'కోధముతో అతడు “ఓరీ పాపీ! ధర్మవినాశకుడా! నా పరమ ఆరాధనీయుడగు శివుని నిర్లక్ష్యపరచి నీవు ఇంద్రియభోగంలో నెలకొన్నావు.
కనుక నీకు శ్వేతకుస్టు సంప్రాప్తించుగాక! నీ భార్యతో నీకు నిరంతర వియోగము కలుగుగాక! ఓరీ మూర్డుడా! వెంటనే నీవు ఈ ప్రదేశమును విడిచి వెళ్ళిపో” అని శపించి కేముని గెంటివేసాడు. కుబేరునిచే శపితుడైన కూముడు వెంటనే అలకాపురి నుండి పతనము చెంది ఈ భువిలో జన్మించాడు. 'శ్వేతకుష్టు సంప్రాప్తించగా అతడు త్మీవమైన దుఃఖపరిసితులకు లోనయ్యాడు. త్మీవమైన మానసికక్షోభ చేత, ఆకలిదప్పుల చేత అతడు ఒకసారి చారరాని దట్టమైన అరణ్యంలో ప్రవేశించాడు. అచట అతడు పగటిపూట త్మీవమైన దుఃఖాన్ని, రాత్రిపూట నిద్రలేమిని అనుభవించాడు. ఆ విధంగా చలికాలం, ఎండాకాలం కూడ గడచిపోయాయి. కాని శివపూజలో సహాయపడిన కారణంగా అతని స్మృతి మాత్రము చెక్కుచెదరలేదు. అనేక పాపాలు చేసినప్పటికిని అతడు పూర్వకర్మలను చక్కగా స్మృతిపథమున నిలుపుకున్నాడు; అతని చిత్తము విశుద్ధముగాను, అప్రమత్తముగాను ఉండేది. ఆ విధంగా అడవిలో చరిస్తూ అదృష్టవశాత్తుగా అతడు మార్కండేయ బుషిని కలిసికొన్నాడు. ఆ బుషి ఆయువు ఏడు కల్పాలు. తాను పరమపాపినని భావించిన కేముడు దూరము నుండే ఆ బుపషికి పదేపదే నమస్కరించాడు. కరుణాహృదయుడైన మార్కండేయుడు అతనిని చెంతకు పిలిచి ఆ కుష్టువ్యాధి ఎలా వచ్చిందని, అంతటి దయనీయస్థితి సంధప్రాప్తించడానికి అతడు చేసిన పాపమేమిటని ప్రశ్నించాడు. మార్కండేయ బుషి ప్రశ్నలకు బదులుగా హేముడు ఆయనతో “ఓ మునివర్యా! నేను కుబేరుని తోటమాలి కేముడను. మానససరోవరము నుండి ప్రతిరోజు నేను పూలు తెచ్చి నా ప్రభువు కుబేరునికి ఇస్తే ఆయన వాటితో శివారాధనము చేసేవాడు. కాని ఒకరోజు భార్యాలోలుడనైన కారణంగా పూలు తేవడంలో ఆలస్య మైంది. దానికి కుపీతుడైన కుబేరుడు నాకు శ్వేతకుష్టు సంధప్రాప్తిస్తుందని, నిరంతర భార్యావియోగము కలుగుతుందని శపించాడు. కాని పరమ దురదృష్టవంతుడనైన నేను మిమ్ము కఠరిసేటంత భాగ్యవంతుడను ఏ విధంగా అయితినో తెలియట్లేదు. పరుల దుఃఖాన్ని చూసి సాధువుల హృదయము దుఃఖితమౌతుందని, వారు సదా సంక్షేమకార్యాలలో నెలకొని ఉంటారని విన్నాను. ఓ మహామునీ! శుభమును బడయడానికై ఈ పతితుడు ఈ రోజు మీకు శరణాగతుడయ్యాడు. దయచేసి నన్ను ఉద్ధరించండి” అని విన్నవించాడు. |
అపుడు మార్కండేయ బుషి దయార్ద్రహృదయుడై అతనితో “ఓ తోటమాలీ! పరమ మంగళకరమైనది, లాభకరమైనది అయిన వ్రతమును నీకు చెబుతాను. జ్యేష్టమాసంలోని కృష్ణపక్షములో వచ్చే యోగినీ ఏకాదశిని నీవు శ్రద్ధతో పాటించు. దాని ప్రభావంతో నీవు ఈ కుష్టురోగం నుండి బయటపడతావు” అని అన్నాడు. మార్కండేయుని ఉపదేశాన్ని వినిన హేముడు ఆనందముతో ఉప్పొంగి ఆ బుషికి పదేపదే నమస్కరించాడు. తరువాత ఆయన ఆదేశానుసారము అతడు పవిత్రమైన ఏకాదశి వ్రతాన్ని పాటించాడు. ఆ వ్రతప్రభావంతో అతనికి పూర్వ దివ్యరూపం తిరిగి వచ్చింది. తరువాత అతడు ఇంటికి తిరిగి చేరి తన భార్యను కరిసికొన్నాడు. ఎనుబది ఎనిమిదివేల మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయగా వచ్చే ఫలము కేవలము ఈ యోగినీ ఏకాదశి వ్రతపాలన వలన కలుగుతుంది. ఇది మనిషి యొక్క సమస్త పాపాలను నశింపజేసి అమిత పుణ్యాన్ని చేకూరుస్తుంది. హరేకృష్ణ! (ముఖ్యసూచన : ఏకాదశిరోజు బ్రహ్మహత్యాపాతకము లేదా గోహత్యాపాతకము వంటి ఘోరమైన పాపాలు ఐదురకాలైన ధాన్యాలను ఆశయిస్తాయి. కనుక చరమలాభాన్ని పొందగోరే శ్రద్ధావంతులు ఆ రోజు వాటిని భుజించరాదు. 1) బియ్యము, బియ్యము నుండి తయారైనట్టి పిండి, అటుకులు, మేలాలు వంటివి, 2) గోధుమపిండి, మైదాపిండి, రవ్వ 3) బార్లీ వంటివి, 4) పెసరపప్పు, కందిపప్పు వంటి పప్పుదినుసులు, బఠానీలు వంటివి, 5) ఆవాలు, నువ్వులు, వాటి నుండి తీసే నూనె అనేవే ఆ ఐదురకాల నిషిద్ధధాన్యాలు. వీటిని తింటే ఏకాదశి 'వ్రతభంగము జరిగినట్టు అవుతుంది. పాలుపండ్లతో ఉసవాసము చేయడము శేష్టము. ద్వాదశిరోజున ధాన్యముతో వండిన ప్రసాదముతో పారణచేయడం ద్వారా ఏకాదశి వతము పూర్తవుతుంది)
మాసం:(చంద్రమాసం) -
వామన,ఆషాఢ
తిథి:(చంద్ర
రోజు)-ఏకాదశి
పక్షం:శుక్లపక్ష
శయన ఏకాదశి (దేవశయని లేదా పద్మ ఏకాదణి వృత్తాంతము శ్రీకృష్ణధర్మరాజ సంవాదరూపంలో భవిష్యోత్తర పురాణమునందు వర్ణించబడింది. ఆషాఢమాసం శుక్షపక్షంలో వచ్చే ఏకాదశి సురును గురించి, ఆ పవిత్రమైన రోజున పూజించవలసిన భగవంతుని గురించి, వతనియమమును గురించి ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు. అదే. ప్రశ్నను నారదుడు ఒకమారు బ్రహ్మదేవుని అడిగాడని, బ్రహ్మ అతనికి 'ప్రత్యుత్తరముగా తెలిపిన అద్భుతమైన చరితమును తాను వివరిస్తానని శ్రీకృష్ణుడు తెలిపాడు. ముని శేష్టుడగు నారదుడు ఒకసారి తన తండ్రిని సమీపించి “తండ్రీ! ఆషాఢమాసం శుక్షపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? విష్ణుప్రత్యర్థమై ఆ ఏకాదశి 'వ్రతపాలన చేసే విధానాన్ని నాకు తలియజేయవలసినది” అని ప్రార్థించాడు. అది వినిన బ్రహ్మ అతనితో “ఏకాదశి వ్రతమంతటి పవిత్రమైన వ్రతము ఈ భౌతికజగత్తులో వేరొక్కటి లేనే లేదు. సమస్త పాపాలను నశింపజేయడానికి మనిషి తప్పనిసరిగా ఏకాదశివతాన్ని పాటించాలి. ఏకాదశి వ్రతపాలన చేయనివాడు నరకగామి అవుతాడు. ఆషాఢశుక్షపక్షంలో వచ్చే ఏకాదశి దేవశయని లేదా పద్మ ఏకాదశి అని పిలువబడుతుంది. హృషీ కేశుని ప్రీత్యర్థమై మనుజుడు ఈ ఏకాదశిని పాటించాలి” అని అన్నాడు. ప్రపంచచక్రవర్తి, రాజర్షియైన మాంధాత గురించి పురాణాలలో చెప్పబడింది. అతడు సూర్యవంశములో జన్మించాడు. పరమశక్తిమంతుడు, సత్యసంధుడు అయిన అతడు ప్రజలను కన్నబిడ్డలలాగా పాలించేవాడు. అతని రాజ్యంలో కరువుకాటకాలు గాని, ఏ విధమైన రోగం కాని ఉండేవి కావు. ప్రజలందరు సుఖశాంతులతో జీవిస్తూ సమృద్ధిగా ఉండేవారు. మాంధాత కోశాగారములో అధర్మయుత సంపాదన ఉండేది కాదు. ఆ ప్రకారంగా రాజు, ప్రజలు ఆనందముగా కాలం గడుపసాగారు. కొన్ని సంవత్సరాల తరువాత విధివశాత్తుగా మూడు సంవత్సరాలు వానలు కురియలేదు. తతృలితంగా జనులు ఆకలిపీడితులై చింతాపూర్ణులయ్యారు. ఆహార కొరత వలన కలిగిన దుఃఖఫలితంగా యజ్ఞయాగాదులు, వేదాధ్యయనము నిలిచిపోయాయి. అపుడు ప్రజలందరు రాజు వద్దకు వెళ్ళి అతనితో ఇలా అన్నారు “రాజా! మేము చెప్పేది విను. శాస్త్రాలలో జలము "*నరి అని చెప్పబడింది, ఇక భగవానుడు దానిలో వసించువాడు కనుక నారాయణుడయ్యాడు.
మేఘరూపంలో ఆతడు సర్వవ్యాపాయె ఉన్నాడు. వర్షము కురియుటకు ఆతడొక్కడే కారణుడు. వర్షము వలన ధాన్యము ఉత్పత్తి అవుతుంది, ధాన్యమ్ముపై ఆధారపడి జీవులు బ్రతుకుతారు. ప్రస్తుతము ఆహారకొరత వలన నీ ప్రజలమగు మేము దుఃఖితులమై యున్నాము. కనుక ఓ రాజోత్తమా! ఈ విపత్కర పరిస్థితికి ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొని మాకు తిరిగి శాంతిని, సమృద్ధిని ప్రసాదించు.” ప్రజల మాటలను వినిన రాజు వారితో “మీరు చెప్పినది నిజమే. అన్నము పరబ్రహ్మస్వరూపమని చెప్పబడింది. జీవులందరు అన ము మైన ఆధారపడియే జీవిస్తారు. రాజు చేసిన పాపాల వలననే రాజు, అతని ప్రజలు కష్టాల పాలవుతారని పురాణాలలో చెప్పబడింది. నేను చేసిన దోషమేమిటో నా బుద్ధితో నేను తెలిసికోలేకపోతున్నాను. అయినా నా ప్రజలైన మీ కొరకు నేను ఏదో ఒకటి చేస్తాను” అని అన్నాడు. ఈ విధంగా పలికిన మాంధాత కొంత ముఖ్య సైన్యాన్ని తీసికొని బ్రహ్మకు నమస్కరించి అరణ్యంలో ప్రవేశించాడు. అరణ్యంలో అతడు నిత్యము బుష్యాశమాలను సందర్శించాడు. ఆ విధంగా అడవిలో తిరుగుతున్నప్పుడు అదృష్టవశాత్తుగా అతడు బ్రహ్మతనయుడైన అంగీరబుషిని కలిసాడు. బ్రహ్మతేజస్సుతో వెలుగొందుతున్న అంగీరబుషి తన తేజముతో నలుదిక్కులను ప్రకాశింప జేస్తున్నాడు. రాజు ఆయనను చూడగానే తన వాహనం నుండి [క్రిందకు దిగి పాదాభివందనము చేసాడు. బుషి ఆ రాజును ఆశీర్వదించాడు. తరువాత అంగీరబుషి మాంధాతను 'క్షేమసమాచారాలు అడుగగా ఆ రాజు మూడు సంవత్సరాల నుండి వర్షాలు కురియుట లేదని, తతృలితంగా తన ప్రజలు అనేక కష్టాల పాలవుతున్నారని, ఆ కరువుకాటకాలకు కారణమేమిటో తనకు తెలియుట లేదని పలికాడు. తన ప్రజలు తిరిగి సుఖశాంతులను పొందే విధానాని స తెలియజేయమని ప్రార్థించాడు. అది వినిన అంగీరబుషి రాజుతో “రాజా! ఇది సత్యయుగము. అన్ని యుగాలలోకి సర్వోత్తమమైన యుగము. ఈ యుగంలో జనులు పరబ్రహ్మారాధనలో ఉంటారు. ధర్మము నాలుగు పాదాలతో నడుస్తుంది. బ్రాహ్మణులు తప్ప వేరెవ్వరు ఈ యుగంలో తపస్సు చేయరాదు. ఈ నియమము ఉన్నప్పటికిని ఒక శూద్రుడు నీ రాజ్యంలో తపస్సు చేస్తున్నాడు. ఈ అధర్మయుత ప్రవర్తన కారణంగానే నీ రాజ్యంలో కరువు సంభవించింది. కనుక అతనిని వధించి నీ రాజ్యంలో శాంతిసమృద్ధులను నెలకొల్పుము అని చెప్పాడు. తపోనిష్టుడైన అమాయకుని వధించడము తనకు అసాధ్యమని, అందువలన తనకు వేరే సులభ పరిష్కారము తెలుపుమని రాజు ఆయనను ప్రార్థించాడు.
“రాజా! అయితే ఆషాఢశుక్షపక్షంలో వచ్చే పద్మ ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి వ్రతాన్ని నీవు పాటించు. ఆ వ్రతప్రభావం వలన నీ రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. ఈ ఏకాదశి మనిషికి సమస్త మంగళాన్ని చేకూర్చి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. పూర్ణత్వపథంలోని సమస్త అడ్డంకులను అది తొలగిస్తుంది. కనుక నీ ప్రజలతో పాటుగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించు” అని అంగీరబుషి పలికాడు. బుషి వాక్యాలను వినిన మాంధాత పురానికి తిరిగి వచ్చి ఆషాఢమాసంలో బంధుమిత్రపరివార సహితంగా శయన ఏకాదశి వ్రతాన్ని పాటించాడు. ఆ వ్రతప్రభావం వలన రాజ్యంలో విరివిగా వర్షాలు కురిసాయి. నీటి కొరత తీరిపోగానే రాజ్యమంతా ధాన్యరాశితో నిండిపోయింది. అపుడు హ షీకేశుని అనుగ్రహము చేత అందరు సుఖంగా జీవించారు. కనుక సుఖసంతోషాలను, ముక్తిని ప్రసాదించే ఈ పవిత్రమైన ఏకాదశిని ప్రతియొక్కరు తప్పకుండా పాటించాలి. ఈ ఏకాదశి మాహాత్మ్యాన్ని వినేవాడు, చదివేవాడు సమస్త పాపవిముక్తుడౌతాడు. ఈ ఏకాదశి విష్ణుశయని ఏకాదశి అని కూడ పిలువబడుతుంది. విష్ణుప్రత్యర్థమై భక్తులు దీనిని ఎంతో భక్తిశద్ధలతో పాటిస్తారు. వారు ఇంద్రియభోగాన్ని కాని, ముక్తిని గాని కోరక కేవలము విశుద్ధభక్తినే కోరుకుంటారు. సుప్రసిద్ధమైన చాతుర్మాస్య వ్రతము ఈ ఏకాదశి నుండే ఆరంభమౌతుంది. శ్రీహరి నిద్రకు ఉపక్రమించే ఆ రోజు నుండి ఆతడు మేల్కొనే రోజు వరకు భక్తులు భగవల్లీలలను వింటూ, కీర్తిసూ చాతుర్మాస్య వ్రతాన్ని పాటిస్తారు. శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పినపుడు ధర్మరాజు శ్రీవిష్టుశయన వ్రతాన్ని లేదా చాతుర్మాస్య వ్రతాన్ని పాటించే పద్ధతిని తెలుపుమని అడిగాడు. సూర్యుడు కర్కటరాశిలో ఉన్నప్పుడు జగన్నాథుడగు మధుసూదనుడు నిద్రకు ఉపక్రమించి, సూర్యుడు తులారాశికి చేరినపుడు తిరిగి మేల్కొంటాడు. చాతుర్మాస్య వ్రతము శయన ఏకాదశి నుండి ఆరంభమౌతుంది. స్నానము చేసిన తరువాత విష్ణువుకు పీతాంబరమును ధరింపజేసి తెల్లని వస్త్రములతో చక్కని శయ్యను ఏర్పాటు జేసి ఆ దేవదేవుని విశమింపజేయాలి. మొట్టమొదట గ బ్ర భగవానునికి బ్రాహ్మణుల చేత పంచామృతాలతో అభిషేకము చేయించి, వస్త్రముతో తుడిచి చందనము పూయాలి. తరువాత గంధపుష్పదీపాలతో భగవంతుని అర్చించాలి. చాతుర్మాస్య వ్రతాన్ని ఏకాదశిరోజు నుండి గాని, దా దశి నుండి గాని, పౌర్ణమి నుండి గాని లేదా సంక్రాంతి నుండి గాని పాటించవచ్చును. చాతుర్మాస్య వ్రతము కార్తీకమాసంలోని ఉధ్ధాన ద్వాదశి రోజున ముగుస్తుంది. శ్రీహరిని స్మరిస్తూ చాతుర్మాస్య వ్రతాన్ని పాటించేవాడు సూర్యప్రభలతో జరిగినట్టు అవుతుంది. పాలుపండ్లతో ఉపవాసము చేయడము ,శేష్టము. ద్వాదశిరోజున ధాన్యముతో వండిన ప్రసాదముతో పారణచేయడం ద్వారా ఏకాదశివతము పూర్తవుతుంది
మాసం:(చంద్రమాసం) -
శ్రీధర,శ్రవణ
తిథి:(చంద్ర
రోజు)-ఏకాదశి
పక్షం:కృష్ణపక్ష
కామిక ఏకాదశి విశేషాలు శ్రీకృష్ణధర్మరాజుల సంవాదరూపంలో బ్రహ్మ వైవర్త పురాణంలో వివరించబడినాయి. “దేవదేవా! శ్రీ ప్లా! దేవశయని ఏకాదశి మహిమను నీ నుండి నేను విన్నాను. ఆషాఢమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమను ఇపుడు నేను వినగోరుతున్నాను. దయచేసి దాని మహిమను నాకు చెప్పవలసినదిో అని ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు. దానికి ప్రత్యుత్తరముగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో “రాజా! సమస్త పాపాలను నశింపజేసే ఈ ఏకాదశివ్రత వర్ణనను సావధానంగా విను. పూర్వకాలంలో నారదుడు ఒకమారు ఇదే విషయాన్ని బ్రహ్మదేవుని అడుగుతూ ఆ రోజు ఆరాధించవలసిన దైవమును గురించి, ఆ ఏకాదశి రోజు అనుసరించవలసిన విధిని గురించి ప్రశ్నించాడు” అని అన్నాడు. అఖిల జగద్గురుడగు బ్రహ్మ అపుడు సమాధానము చెబుతూ “ఆషాఢమాసం క ఎప్షపక్షంలో వచ్చే ఏకాదశి పేరు కామిక ఏకాదశి. ఈ ఏకాదశి మహిమను వినడము ద్వారా మనిషి వాజపేయ యజ్ఞనిర్వహణ ఫలాన్ని పొందగలుగుతాడు. ఆ మంగళమయమైన రోజు మనుజుడు శంఖచక్రగదాపద్మధారియైన విష్ణువును ఆరాధించాలి. గంగాతీరము, కాశి, నైమిశారణ్యము, పుష్కర్ వంటి తీర్థస్థానాలలో వసించి అక్కడ స్నానం చేయడము వలన కలిగే ఫలము ఆ రోజు "కేవలము విష్ణు ఆరాధనచే లభిస్తుంది. కేదారనాథ్ లో, కురుక్షే 'త్రములో లేదా సూర్యగ్రహణరోజు చేసే స్నానము వలనైనా లభించనట్టి ఫలము ఆ రోజు శ్రీకృష్ణుని ఆరాధనము వలన తప్పక లభిస్తుంది. కనుక విష్ణు ఆరాధనతో ఈ కామిక ఏకాదశి వ్రతాన్ని నిష్టగా పాటించడము ప్రతియొక్కరి కర్తవ్యము” అని అన్నాడు. నీరు తామరాకును అంటని చందముగా కామిక ఏకాదశి ప్రభావము వలన మనిషిని పాపము ఏమాత్రము అంటదు. తులసీదళములతో శ్రీహరిని అర్చించేవాడు సమస్త పాపవిముక్తుడౌతాడు. తులసీదర్శనమే సర్వపాపహరము. తులసీస ఎర దేహాన్ని పవిత్రము చేస్తుంది. తులసీప్రణామము ద్వారా మనిషి రోగవిముక్తుడౌతాడు, తులసీకి స్నానం చేయించడము ద్వారా మనిషికి యమరాజు భయం పోతుంది, తులసీమొక్కను నాటడము ద్వారా మనిషి శ్రీకృష్ణునితో కలిసి జీవించే భాగ్యాన్ని పొందగలుగుతాడు, తులసీదళాలను శ్రీకృష్ణపాదారవిందములకు అర్చించడము ద్వారా ఎవ్వడైనా విశుద్ధభక్తిని పొందగలుగుతాడు. ఏకాదశిరోజు తులసీదేవికి నమస్కరించి నెయ్యితో దీపారాధన చేసేవాని పుణ్యాన్ని చిత్రగుప్పుడైనా ఎన్నలేడు. బాహ్మణహత్య లేదా భూణహత్య వంటి ఘోరమైన పాపమైనా కామిక ఏకాదశి 'వ్రతపాలన వలన నశించిపోతుంది. అది ఈ వ్రతపాలన వలన కఠిగే గౌణఫలము. ఈ ఏకాదశి మహిమను వినేవాడు లేదా చదివేవాడు నిశ సృయంగా విష్ణులోకానికి చేరుకుంటాడు.
మాసం:(చంద్రమాసం) -
పురుషోత్తమ,అధిక
తిథి:(చంద్ర
రోజు)-ఏకాదశి
పక్షం:శుక్లపక్ష
“ఓ జనార్దనా! అధికమాసములోని శుక్షపక్షము నందు వచ్చెడి ఏకాదశి నామమేమిటి? దానినెట్టు పాటించవలెను? ఇది నాకు వివరించవలసినది అని ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగినట్లు సూతగోస్వామి చెప్పెను. ఈ ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణభగవానుడు ఇట్లు పలికెను : “ఓ పాండవా! అధికమాసములోని శుక్షపక్షములో వచ్చెడి ఏకాదశి కేరు పద్మిని ఏకాదశి. అది అత్యంత శుభకరమైనది. దృఢనిశ్చయముతో దీనిని పాటించెడి అదృష్టవంతుడు నా ధామాన్ని పొందుతాడు. పాపములను శమింపజేయడంలో ఈ ఏకాదశి నాతో సమానముగా శక్తివంతమైనది. దీనిని గురించి చతుర్ముఖ బ్రహ్మ మయొనను తగినంతగా వర్ణింపజాలడు. మోక్షదాయకము, పాపహరమునైన ఈ ఏకాదశిని గురించి బ్రహ్మదేవుడు పూర్వము నారదునికి చెప్పెను. రాజా! పద్మిని ఏకాదశిని పాటించే విధానాన్ని నీకు వివరిస్తాను. సావధానంగా విను.” “ఏకాదశికి ఒకరోజు ముందు దశమి నుండియే మనుజుడు ఉపవాసమును ఆరంభించి మినపప్పు, ఎజ్జపప్పు, శనగపప్పు, పాలకూర, తేనె, ఉప్పు మున్నగువాటిని తినరాదు. ఇతరుల ఇండ్లలో భోజనము చేయరాదు. కంచుపాత్రలో భోజనము చేయరాదు. ఈ ఎనిమిది విషయాలను అతడు పాటించాలి. దశమిరోజు ఒక పూటనే భోజనము చేసి నేలమై పరుండవలను. బ్రహ్మచర్యమును పాటించవలెను. ఇక ఏకాదశిరోజు తెల్లవారురూముననే నిద్ర లేవవలెను, కాని దంతధావనము చేసికొనరాదు. వీలైతే తీర్ధస్థానములో స్నానము చేయాలి. ఓ ధర్మరాజా! పీతాంబరధారి, సకలజీవులకు ఆనందము నొసగువాడు అయిన దేవదేవుని అర్చనకు సమాయత్తుడై మనుజుడు పిదప శరీరమును శుభపరచుకొనవలను. ఆ విధముగా అతడు సకలపాపములను నశింపజేసికొనగలడు. తరువాత అతడు గాయత్రీమంత్రమును జపించి పితృదేవతలకు తర్చణము నొసగవలెను. ఆ పిదప విష్ణుమందిరములో లక్ష్మీపతియగు నారాయణుని దర్శింపవలను.
“వీలైతే అతడు స్వర్లమయ _ రాధాకృష్ణ మూర్తులను చక్కగా అర్చించవలను. సుగంధజలపూర్ణమగు రాగి లేదా మట్టి కలశమును ఏర్పరచి బట్ట కప్పి దానిమై బంగారు లేదా వెండి మూతను పెట్టి దానిమై రాధాకృష్ణులను ఆసీనులను చేయవలెను. తరువాత శక్త్యనుసారము ధూపదీపసములతోను, కర్పూర కుంకుమలతోను, గంధమాల్యాదులతోను, చక్కని నైవేద్యములతోను అర్చన చేయవలను. ఈ ప్రత్యేక ఏకాదశిరోజు అతడు ఆనందముతో నృత్యగానములు చేయవలెను. వ్యర్థ సంభాషణము చేయరాదు. నీచజన్ములను తాకరాదు, వారితో మాట్లాడరాదు. సత్యమునే పలుకవలెను. విష్ణుమూర్తి, బ్రాహ్మణులు లేదా గురువు ఎదుట ఇతరులను నిందించరాదు. భక్తుల సాంగత్యములో అతడు వైష్ణవుల ద్వారా విష్టుమహిమలను (శ్రవణము చేయాలి. ఈ ఏకాదశిరోజు మంచినీరైనను త్రాగరాదు. ఇట్టి కఠినతపస్సు చేయలేని వ్యక్తి కేవలము నీరు లేదా పాలు త్రాగవచ్చును. లేనిచో ఉపవాసభంగము అవుతుంది. రాత్రంతయు మేల్కొనియుండి పరమపురుషుని ప్రీత్యర్థము సంగీతవాద్యములతో సంకీర్తనము చేయవలెను.” “రేయి తొలిరూములో అతడు భగవంతునికి కొబ్బరి నైవేద్యము పెట్టాలి, రెండవ రూములో బేల్ ఫలమును, మూడవ రూములో నారింజపండును, చివరి రూములో పోకచెక్కను నైవేద్యము పెట్టాలి. తొలిరూము మేల్కొనుట వలన భక్తునకు అగ్నిష్టోమము చేసిన ఫలము కలుగుతుంది; రెండవ రూము మేల్కొనుట వలన వాజపేయ యజ్ఞము చేసిన ఫలితము కలుగుతుంది; మూడవ రూము మేల్కొనుట వలన అశ సమేధయజ్ఞము చేసిన ఫలితము కలుగుతుంది. ఇక పూర్తి రాత్రి మేల్కొనియుండు వానికి ఈ ఫలితములే గాక రాజసూయయజ్ఞము చేసిన ఫలితము కూడ లభిస్తుంది. కనుక ఈ పద్మిని ఏకాదశికి మించిన ఉపవాసము లేదు. ఈ ఏకాదశిని పాటించినవాడు సకలతీర్థాలలో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.” “రాత్రంతా మేల్కొని ఉన్న తరువాత సూర్యోదయము కాగానే మనుజుడు స్నానం చేసి నన్ను అర్చించాలి. తరువాత యోగ్యుడైన బ్రాహ్మణునికి భోజనము పెట్టి కేశవుని మూర్తిని సుగంధ జలకలశాన్ని అతనికి దానం చేయాలి. ఈ కానుక అతనికి ప్రస్తుత జన్మలో విజయాన్ని, తరువాత మోక్షాన్ని తప్పక కలుగజేస్తుంది. ఓ ధర్మరాజా! నీవు అడిగినట్లుగా పద్మిని ఏకాదశి యొక్క విధివిధానములను, దానిని పాటించడము వలన కలిగే లాభాలను వివరించాను. ఈ ఒక్క ఏకాదశిని పాటించినచో ఇతర అన్ని ఏకాదశులను పాటించిన సమాన ఫలితము కలుగుతుంది. ఇక ఈ పవిత్రరోజును గురించిన ఒక అద్భుతమైన చరితమును వివరించెదను వినుము. పులస్త్యముని ఒకమారు దీనిని నారదునికి వినిపించెను.”
“పులస్త్యముని ఒకమారు కార్తవీర్యార్దునుని కారాగ్భృహము నుండి రావణుని విడిపించెనని వినిన నారదుడు అతనితో “మునివర్యా! ఇంద్రాది దేవతలనే జయించిన రావణుని కార్తనీర్యార్డునుడు ఏ విధంగా జయించియుండెను? అని ప్రశ్నించెను.” దానికి సమాధానముగా _పులస్త్యముని ఇట్లు పలికెను : “త్రేతాయుగంలో కార్తవీర్యుడు (కార్తవీర్యార్దునుని జనకుడు) హైహయ వంశములో జన్మించెను. అతని నగరము మహిష్మతి. అతనికి వెయ్యిమంది రాణులు. కాని వారిలో ఎవ్వరికీ సంతానము కలుగలేదు. అందుకు వగచిన రాజు ఎన్నో యజ్ఞాలు చేసాడు; దేవతలను, పితృదేవతలను ఎందరినో పూజించాడు. కాని ఏ మునిశాపము చేతనో రాజుకు పుత్రసంతానమే కలుగలేదు. అందువలన అతడు తీవ్రమగు తపస్సు చేసి తన లక్షా న్ని సాధించాలని అనుకున్నాడు. ఆ విధంగా అతడు కౌపీనాన్ని ధరించి, రాజ్యాన్ని మంత్రులకు అప్పజెప్పి అరణ్యానికి బయలుదేరాడు. అతని రాణులలో ఒకతె పద్మిని ఇక్షా వకువంశములో జన్మించినది. హరిశ్చంద్రుని కుమార్తెయెన ఆమె భర్త అడుగుజాడలలో నడవాలని నిర్ణయించుకొని అన్ని ఆభరణాలను తీసివేసి కట్టుబట్టలతో అతనిని అనుసరించినది.” “గంధమాదన పర్వతాన్ని చేరిన కార్తవీర్యుడు తీవమగు తపోధ్యానాదులతో గదాధరుని పదివేల సంవత్సరములు అర్బించాడు. అయినప్పటికిని అతనికి పుత్రుడు కలుగలేదు. కేవలము శల్యప్రాయంగా మారిన భర్తను చూసి పద్మిని ఆలోచించినదై సతీ అనసూయ చెంతకు వెళ్ళి వినమముగా ఇట్లు ప్రశ్నించింది. “అమ్మా! నా భర్త గత పదివేల సంవత్సరములుగా తపస్సు చేస్తున్నారు. సమస్త పాపాలను, కష్టాలను తొలగించే కేశవుడు ఇంకను ఆయన యొడ ప్రసన్నుడు కాలేదు. కనుక ఏదేని ఉపవాసదీక్షను నాకు తెలిపి తద్ద్వారా భగవంతుడు మా యొడ ప్రసన్నుడయ్యేటట్లు చేయవలసినది. అపుడు ఆతని అన్ముగహముతో ప్రపంచ చక్రవర్తి కాబోయే పుత్రుని మేము పొందగలము.” “పతివ్రతయైన పద్మిని మాటలను వినిన సతీ అనసూయ నవ్వుతూ ఇట్లా పలికింది : ఓ కమలాక్ష! సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటాయి. కాని ప్రతి ముప్పుదిరండు నెలల తరువాత ఒక అధికమాసం వస్తుంది. అట్టి అధికమాసంలో వచ్చే రెండు ఏకాదశులు పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి అని పిలువబడతాయి. నీవు ఈ రెండు రోజులు ఉపవసించి రేయి అంతయు జాగరణ చేయాలి. ఇది నీవు చేస్త దేవదేవుడైన హరి నీ పట్ల ప్రసన్నుడై ఒక పుత్రుని ప్రసాదిస్తాడు.” అది వినిన పద్మిని శ్రద్ధతో అనసూయ ఉపదేశాన్ని పాటించింది. నిర్ణల ఉపవాసం చేసిన పద్మిని నృత్యకీర్తనలతో రేయంతా గడిపింది. ఆమె భక్తికి ప్రసన్ను డైన "కేశవుడు ఎదుటనే గరుడవాహనారూఢుడై వచ్చి ఆమెతో “సాధ్వీ! అధికమాసంలోని ఈ ప్రత్యేక ఏకాదశి రోజు ఉపవసించి నీవు నన్ను ప్రసన్నుని చేసావు. నీవు కోరిన వరము నడుగుము” అని అన్నాడు. “భగవంతుని అద్భుతమగు వాక్కులను వినిన పద్మిని ఆతనిని స్తుతించి తన భర్త కోరికను తీర్చమని అడిగింది. అది వినిన దేవదేవుడు వారి కోరిక సిద్దిస్తుందని దీవించాడు.” తరువాత లోకార్తిహరుడగు భగవానుడు కార్తవీర్యునితో “రాజా! నీ పత్ని నన్ను మిగుల ప్రసన్నుని జేసినది కనుక నీ అభీష్టాన్ని అడుగు. నేను దానిని తీరుస్తాన” అని అన్నాడు. దానికి సమాధానముగా రాజు “ఓ జగదీశ్వరా! మధుసూదనా! దేవతలతో గాని, మానవులతో గాని, పన్నగులతో గాని, దానవులతో గాని జయింపబడని పుత్రుని నా కొసగుము. కేవలము నీ చేతనే అతడు పరాజితుడు కావచ్చును” అని అన్నాడు. తథాస్తు అని పలికి భగవానుడు అంతర్హితుడయ్యాడు. ముదమందిన రాజు తన భార్య పద్మినితో కలిసి పురానికి తిరిగి వచ్చాడు. తదనంతరము పద్మిని గర్భవతియై మహావీరుడైన కార్తవీర్యార్దునునికి జన్మనొసగింది. ముల్లోకములలో అతడు పరమ శక్తిశాలి అయ్యాడు. పదితలల రావణుడే అతనిని యుద్ధంలో జయించలేకపోయాడు. తల్లి చేసిన పద్మినీ ఏకాదశి వ్రతపాలన వలన అతడు రావణునే జయింపగలిగాడు. అతడు భగవంతుని వరదానము వంటివాడు. ఈ విధంగా నారదునికి వివరించి పులస్త్యముని వెడలిపోయాడు. శ్రీకృష్ణభగవానుడు ధర్మరాజుతో పలుకుతూ “ఓ ధర్మనందనా! నీవు అడిగిన విధంగా ఈ ప్రత్యేక ఏకాదశి శక్తిని గురించి నీకు వివరించాను. ఎవరైతే ఈ ఏకాదశి ఉపవాసాన్ని చేస్తారో వారు తప్పక నా ధామాన్ని పొందుతారు. నీ కోరికలు తీరాలంటే నీవు కూడ ఈ విధంగానే ఒనరించుము” అని అన్నాడు. 'కేశవుని పలుకులను వినిన ధర్మరాజు మిక్కిలి ముదమంది సమయం రాగానే పద్మినీ ఏకాదశిని ఆచరించాడు. ఈ విశేష ఏకాదశి వివరణను ముగిస్తూ సూతగోస్వామి శౌనకునితో “ఓ శౌనకా! ఈ మహనీయమగు ఏకాదశిని గురించి అంతయు నీకు వివరించాను. అధికమాసంలో వచ్చే ఏకాదశులను భక్తిశద్ధలతో పాటించేవాడు భగవద్ధామానికి చేరుతాడు. ఈ ఏకాదశుల గురించి వినినా, చదివినా మనుజుడు అనంత లాభాన్ని పొంది చివరకు శ్రీహరిధామానికి చేరుతాడు” అని పలికారు.
మాసం:(చంద్రమాసం) -
పురుషోత్తమ,అధిక
తిథి:(చంద్ర
రోజు)-ఏకాదశి
పక్షం:కృష్ణపక్ష
అధికమాసము కృష్ణపక్షములో వచ్చే పరమ ఏకాదశి మాహాత్మ్యము శ్రీకృష్ణయుధిష్టిర సంవాదరూపమున వర్షించబడినది. “ఓ దేవదేవా! అధికమాసములో కృష్ణపక్షమునందు వచ్చెడి ఏకాదశి పేరేమిటి? ఓ జగత్పతీ! దానిని చక్కగా పాటించెడి విధానమేమిటి? ఇది నాకు వివరించవలసినది” అని ధర్మరాజు శ్రీక ఎష్షుని అడిగాడు. దానికి శఈ్రక ఎపష్షభగవానుడు ఈ విధముగా సమాధానమిచ్చాడు : “ఓ ధర్మరాజా! ఆ పుణ్యదినము మేరు పరమ ఏకాదశి. అది పరమసుఖమయమైనట్టి జీవితాన్ని అన్ముగహించి చివరకు జన్మమృత్యువుల నుండి మోక్షాన్ని కలిగిస్తుంది. నేను అంతకుముందు వివరించిన విధంగానే ఈ ఏకాదశిని కూడా పాటించాలి. అనగా ఈ ఏకాదశి రోజున పురుషోత్తముడనగు నన్ను భక్తిశద్ధలతో పూజించాలి. కంపిల్య నగరములో మహామునుల నుండి నేను వినినట్టి ఒక అదు ఎతమైన చరితాన్ని ఈ సందర, ఎములో ఇపుడు చెప్పెదను. సావధానుడవై ఆలకింపుము.” ఒకప్పుడు కంపిల్య నగరములో సుమేధుడనే పుణ్యబ్రాహ్మణుడు తన భార్య పవిత్రతో కలిసి వసించేవాడు. ఆమె పరమసాధ్వి, భర్తకు విధేయురాలు. పూర్వజన్మపాపము వలన సుమేధుని చెంత ధనము గాని, ఆహారము గాని లేకపోయింది. పలువురిని అన్నము అడిగినప్పటికిని తగినంత ఆహారము అతనికి లభించెడిది కాదు. భార్యాభర్తలిద్దరికి చాలీచాలనంత అన్నవస్తాాదులు, ఇల్లు ఉండేవి. ఇంతటి దారిద్ర్యము ఉన్నప్పటికిని ఉత్తమ ప్రవర్తన కలిగిన పవిత్ర తన భర్తను చక్కగా ఘేవించేది. ఇంటికి అతిథులు వచ్చినపుడు ఆమె తన వంతు ఆహారాన్ని వారికి ఇచ్చి తాను పస్తులుండేది. అయినా కూడ ఆమె ముఖకమలము ఎన్నడును వాడలేదు. ఈ ఉపవాసాలతో ఆమె నీరసించినప ఎటికిని సుమేధుని పట్ల ఆమె అనురాగము చెక్కుచెదరలేదు. ఇదంతా చూసి తన దురదృష్టానికి మిగుల వగచిన సుమేధుడు ఒక రోజు భార్యతో “పవిత్రా! ధనవంతులను భిక్షమడగినను అల్బంగానే నాకు భిక్ష దొరకుతున్నది. నేనేమి చేయాలి? ఈ దుఃఖము తీరే మార్గమేమిటి? తగినంత ధనము లేనప ఏడు కుటుంబము సరిగా జరుగదు కదా! కాబట్టి దూరప్రాంతాలకు వెళ్ళి నేను ధనమును సంపాదిస్తాను. నేను ఈ ప్రయత్నం చేస్తే తప సక అద్భష్టం కలుగుతుంది. ప్రయత్నం లేకుండ మనిషి తన కోరికలను గాని, అవసరాలను గాని తీర్చుకొనలేడు” అని పలికాడు. భర్త మాటలను వినిన పవిత్ర చేతులను జోడించి అశ్రుపూర్ణ నయనాలతో అభిమానపూర్వకంగా ఇలా పలికింది : “ఓ బ్రాహ్మణోత్తమా! ఇపుడు మనము దరిద్రులుగా ఉన్నామంటే పూర్వజన్మలో నేను గాని, మీరు గాని. యోగ్యులకు దానమివ్వకుండవచ్చును.
భర్త లేనప్పుడు భార్యను తండ్రి గాని, తల్లి గాని, సోదరుడు గాని, మామగారు గాని ఆదరించరు. అందరు నన్ను తీవ్రంగా విమర్శిస్తారు. కనుక ఉన్నచోటనే ఉండి ఉన్నదానితో సంతృప్తిగా ఉందాము. విధిప్రకారం కాలంలో మనకు రావలసినది వచ్చి మనం సుఖంగా ఉండగలము” భార్య మాటలను వినిన సుమేధుడు ఉన్న ఊరిలోనే ఉండడానికి నిశ్చయించుకున్నాడు. ఒకరోజు కౌండిన్యముని వారి ఇంటికి వచ్చాడు. ఆయనను చూడగానే సుమేధుడు, అతని భార్య లేచి నిలబడి ఆహ్వానించి వందనము చేసారు. “ఓ మునివర్యా! ఈ రోజు మీ దర్శనము చేత మేము ధన్యులమయ్యాము. మా జన్మ తరించింది” అని సుమేధుడు ఆయనతో పలికాడు. ఆ రీతిగా భార్యాభర్తలిద్దరు కౌండిన్యమునికి సకలోపచారాలు చేసారు. తరువాత సుమేధుని భార్య పవిత్ర మునితో ఇలా పలికింది “ఓ బాహ్మణోత్తమా! దార్మిద్యము వలన కలుగునట్టి ఈ దుఃఖము నుండి మేమెట్లు ముక్తులము కాగలమో చెప్పవలసినది. మా దురదృష్టము అంతమయ్యే విధంగా ఏ తీర్థయాత్రనో, ఉపవాసమునో, తపస్సునో మాకు తెలియజేయుడుఅని పలికింది. “వినమముగా ఆమె పలికిన మాటలను వినిన కౌండిన్యముని క్షణకాలము ఆలోచించి పిదప ఆమెతో దేవదేవుడైన హరికి ప్రెయమైన ఉపవాసము ఒకటున్నది. ఆ రోజు చేసెడి ఉపవాసము అన్ని పాపాలను నశింపజేసి దారిద్య దుఃఖాన్ని తొలగిస్తుంది. అధికమాసంలో కృష్ణపక్ష సమయమున వచ్చెడి ఆ రోజు పరమ ఏకాదశి అని పిలువబడుతుంది. అది విష్ణువుకు అతి ముఖ్యమైన రోజు. ఈ అధికమాస ఏకాదశి ధనధాన్యాది సమస్తావసరాలను అనుగ్రహిస్తుంది. చివరకు మోక్షాన్ని కూడ ఇస్తుంది. ఆ రోజు సాయంత్రము హరినామసంకీర్తనము చేసి ఆనందముతో నృత్యము చేయాలి. ఆ విధంగా రాత్రి మొత్తం గడపాలి. కుబేరుడు ఒకమారు ఈ ఉపవాసవతాన్ని చేసాడు. అతడు ఎంత నిష్టగా ఈ వ్రతాన్ని చేసాడో గమనించిన శివుడు అతనిని దేవతల కోశాధికారిగా మార్చాడు. అలాగే భార్యాపుత్రులను అమ్మేసిన తరువాత హరిశ్చందుడు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి, తద్ద్వారా తన వారిని తిరిగి పొందాడు. తదనంతరము అతడు ఎటువంటి అడ్డంకులు. లేకుండ రాజ్యపాలనము చేయగలిగాడు. కనుక ఓ సాధీ స్! నియమనిబంధనలతో నీవు ఈ పవిత్రమైన ఏకాదశిని పాటించు” అని పలికాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో “ఓ పాండునందనా! కౌండిన్యముని ఈ ప్రకారము కరుణతోను, అను[గ్రహంతోను పరమ ఏకాదశిని గురించి మరియు పంచరాత్రిక వ్రతమును గురించి పవిత్రకు బోధించాడు. తరువాత అతడు సుమేధునితో ఈ పరమఏకాదశి నుండి మీరు నియమనిబంధనలతో పంచరాత్రిక పద్ధతిలో ఉపవాసదీక్షను చేపట్టండి. తెల్లవారురూముననే స్నానం చేసి మీ దంపతులిరువురు, మీమీ తల్లిదండ్రులతో పాటు మీ శక్త్యనుసారము ఐదురోజులు ఉపవాసం చేయండి. ఈ జగత్తులో ఉన్నంతవరకు సరిపడెడి ధనధాన్యాదులను పొందండి. భగవద్ధామము మీకు తదనంతరము లభించగలదు అని పలికాడు. “ఈ మహోన త ఉపదేశాని _ వినిన బ్రాహ్మాణ దంపతులు యథావిధిగా పరమ ఏకాదశిని పాటించి పంచర్యాత్రిక ఉపవాసాన్ని నిర్వహించారు. తదనంతరము ఒక అందమైన రాకుమారుడు రాజమహలు నుండి వారి చెంతకు వచ్చాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞపై అతడు వారికి భవ్య మైన భవంతిని ఒసగి దానిలో నివసించమని వారిని కోరాడు. వారి జీవిక కొరకు ఒక ఊరినే వారికి కానుకగా ఇచ్చి తన పురానికి వెడరిపోయాడు. ఆ విధంగా సుమేధ పవిత్రలు ఇహలోకసౌఖ్యాలను అనుభవించి చివరికి విష్ణులోకానికి చేరుకున్నారు.” “ఈ పరమఏకాదశి రోజు ఉపవాసము ఉన్నవారు, అట్లే పంచర్యాత్రిక ఉపవాసము చేసినవారు సమస్త పాపాల నుండి బయటపడతారు. వారు ఇహలోక సౌఖ్యాలను అనుభవించిన తరువాత విష్ణుపదాన్ని పొందుతారు. సుమేధుడు పవిత్రలు ఆ విధంగానే పొందారు. ఓ ధర్మరాజా! పరమ ఏకాదశి రోజు ఉపవాసము చేయడం వలన కలిగే ఫలితాలను గణించుట అసాధ్యము. పుష్కర గంగాస్నానములతో, గోదానముతో, సమస్త ధర్మకార్యనిర హణముతో అది సమానము. ఈ రోజు ఉపవాసము చేసినవాడు గయలో పితృతర్పణము చేసినవాడవుతాడు. నిజానికి అతడు అన్ని ఇతర శుభదినాలలో ఉపవాసము చేసినట్లు అవుతుంది.” “నాలుగు వర్ణములలో బ్రాహ్మణుడు ఉత్తముడు అయినట్లు, చతుష్పాద జంతువులలో గోవు ఉత్తమము అయినట్లు, దేవతలలో ఇంద్రుడు (శేష్టుడు అయినట్లు, మాసములలో అధికమాసము (శేష్టమైనది. ఈ అధికమాసములో పంచరాత్రిక విధానములో ఐదురోజుల ఉపవాసము సమస్తమగు పాపములను నశింపజేస్తుంది. అధికమాసములో వచ్చెడి పరమ, పద్మిని ఏకాదశులతో పాటు ఈ పంచరాత్రిక ఉపవాసమును చేసినచో పాపవినాశనం జరుగుతుంది. మనిషి ఈ అన్నీ రోజులలో ఉపవాసము చేయలేకపోతే అధికమాసములో తన శక్త్యనుసారము ఉపవాసం చేయవచ్చును. మానవజన్మను బడసి కూడ చక్కగా స్నానము చేసి అధికమాసములోని ఏకాదశి ఉపవాసమును పాటించనివాడు ఎనుబదినాలుగు లక్షల జీవరాశులలో దుఃఖాలను అనుభవిస్తాడు. మానవజన్మ మోక్షసాధనకే కనుక ప్రతియొక్కడు అన్ని విధముల ఈ పరమ ఏకాదశిని పాటించాలి” ధర్మరాజా! పరమ ఏకాదశిరోజు ఉపవసించడము వలన కలిగే అదు ఎతమైన ఫలితాలను నీవడిగిన విధంగా వివరించాను. “అధికమాసములోని క ప్షపక్షములో వచ్చెడి ఈ ఏకాదశిని నీవు తప క పాటించాలి” అని పలికి శ్రీకృష్ణభగవానుడు ముగించాడు. శ్ర్రీక ఫష్షుడు ఉపదేశించిన విధంగా ధర్మరాజు తన పత్ని ద్రౌపదితో, సోదరులతో కూడి పరమ ఏకాదశిని పాటించాడు. హరేక ప్ల!
మాసం:(చంద్రమాసం) -
శ్రీధర,శ్రవణ
తిథి:(చంద్ర
రోజు)-ఏకాదశి
పక్షం:శుక్లపక్ష
పవిత్రోపన ఏకాదశి మాహాత్మ్యము శ్రీకృష్ణధర్మరాజ సంవాదరూపంలో భవిష్యోత్తర పురాణంలో వరించబడింది. శావణమాసంలోని శుకపకం౦ంలో వచ్చే ఏకాదశి కేరును, దాని మాహాత్మ్యాన్ని మి ౧౧ వివరించమని ధర్మరాజు ఒకసారి శ్రీ ఫహ్షుని అడిగాడు. ఆ ఏకాదశి కరు పవిత్ర ఏకాదశి యని, మనిషి యొక్క సమస్త పాపాలను నశింపజేసే ఆ ఏకాదశిని గురించి శ్రద్ధగా వినమని, ఆ ఏకాదశి మాహాత్మ్యాన్ని వినడము చేత వాజపేయ యజ్ఞము చేసినంత ఫలము కలుగుతుందని శ్రీకృష్ణుడు ప్రత్వుత్తరమిచ్చి ఆ వివరాలను ఇలా తెలుప నారంభించాడు. 6ెలణూో లాభా గ్దా పరయుగారంభంలో మాహిష్మతీపురమనెడి రాజ్యాన్ని మహీజిత్తుడనెడి రాజు పాలించేవాడు. సంతానము లేకపోవడము వలన కార్యనిర్వహణలో అతడు సర్వదా చింతాక్రాంతుడై ఉండేవాడు. సంతానహీనుడైనవానికి ఇహపరాలలో సుఖం లేదు కదా! ఎన్ని సంవత్పరాలైనప్పటికిని ఆనందాన్ని కలిగించే పుతరత్నమే అతనికి కలుగలేదు.” తన దీనపరిస్థితిని గమనించిన రాజు ఒకరోజు తన కన్నబిడ్డలుగా చూసుకునే రాజ్యప్రజలను సభకు పిలిపించి ఇలా అన్నాడు : “ప్రజలారా! ఈ జన్మలో నేనెట్టి పాపము చేయలేదు, అధర్మయుతమైన ధనముతో ఖజానాను నింపలేదు, బ్రాహ్మణుల సంపత్తిని దేవతల సంపదను కొట్టగొట్టలేదు. పెగా యథావిధిగా ఈ ప్రపంచాన్ని జయించాను. మిమ్మల్ని కన్నబిడ్డలుగా చూసుకుంటున్నాను. తప్పు చేసియుంటే సోదరుడు, బంధువుల వంటి సంబంధికులనైనను దండించుటలో వెనుకాడలేదు. సౌమ్యుడు, పుణ్యాత్ముడు అయితే. శత్రువుకైనను నేను గౌరవమిచ్చెదను. ఓ బ్రాహ్మణులారా! ఈ ప్రకారముగా ధర్మమార్గములో నడిచినప్పటికిని నేను పుత్రహీనుడనయ్యాను. దీనికి కారణమేమిటో నాకు తెలపండి.” “రాజు యొక్క దీనాలాపములను వినిన బ్రాహ్మణులు తమలో తాము చర్చించుకొని తమ రాజు నిమిత్తమై భూతభవిష్యద్వ ర్హమానముల నెరిగిన బుషులను కలవడానికి అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అరణ్యానికి వెళ్ళి అటుఇటు తిరుగుతూ వారు అనేక ఆశ్రమాలను సందర్శించారు. చివరకు వారు లోమశ మునిని కలిసికొన్నారు. ఆయన కఠోరతపస్సులో ఉన్నాడు. ఆయన దేహము దివ్యముగాను, ఆనందమయముగాను ఉన్నది. ఆయన ఉపవాసవతంలో ఉన్నాడు. ఆత్మని్మిగ్రహుడైన ఆ ముని సర్వజ్ఞానసంపన్నుడు, బ్రహ్మదేవుని ఆయువంత ఆయుర్దాయము కలవాడు, తేజోమయుడు అయియున్నాడు. బ్రహ్మదేవుని ఒక కల్పము గడచిపోగానే ఆ ముని దేహం నుండి ఒక రోమము (లోమము) 'క్రిందపడుతుంది.
అందుకే మునికి లోమశ ముని అనే పేరు వచ్చింది. ఆయనకు భూతభవిష్యద్వ ర్తమానములు తెలుసు” ఇ ఆ ముని తేజస్సుచే మోహితులైనవారై బ్రాహ్మణులు ఆయన చెంతకు వెళ్ళి వినమముగా స్తోత్రము చేసారు. అది వినిన ఆ ముని వారెవరని, తననెందులకై స్తుతిస్తున్నారని అడిగాడు. అపుడు ప్రత్యుత్తరముగా బ్రాహ్మణులు ఆయనతో “మునివర్యా! సందేహనివృత్తి కొరకే మీ చెంతకు వచ్చాము. మా రాజైన మహీజిత్తునకు సంతానము కలుగలేదు. ప్రజలమైన మమ్ము రాజు కన్నబిడ్డలలాగా చూచుకొంటున్నాడు. అందువలన రాజు కష్టాన్ని చూసి మేము భరించలేకపోయాము. భాగ్యవశాత్తు మేము నేడు మిమ్ములను చూడగలిగాము. మహనీయుడైన వ్యక్తి దర్శనమాత్రము చేతనే పురుషుడు సకలాభీష్టాలను పొందగలుగుతాడు. పుత్రహీనుడైన మా రాజు పుత్రవరదుడు అయ్యే మార్గాన్ని బోధించండి” అని విన్నపం చేసికొన్నారు. “వారి ప్రార్థనలను వినిన లోమశముని వెంటనే ధ్యానమగ్ను డై మహీజిత్తు యొక్క పూర్వజన్మను గురించి తెలిసికొన్నాడు. మహీజిత్తు తన పూర్వజన్మలో ఒక వైశ్యుడు. ఆ జన్మలో అతడు ఒక పాపకార్యం చేసాడు. వ్యాపారార్థము అతడు ఒక గ్రామం నుండి వేరొక గ్రామానికి వెళుతూ దారిలో దప్పికకు గురైనాడు. అది ద్వాదశి మధ్యాహ్న సమయము. చెంతనే అతనికి ఒక మంచినీళ్ళ కొలను కనిపించింది; దానిలో అతడు నీళ్ళను త్రాగాలనుకున్నాడు. అప్పుడే ఒక ఆవు, అప్పుడే పుట్టిన తన లేగతో పాటు నీళ్ళు త్రాగడానికి అక్కడకు వచ్చింది. కాని ఆ వైశ్యుడు ఆవును దూరంగా తరిమివేసి తానే మంచినీళ్ళను త్రాగాడు. దప్పిక గొనిన ఆవును నీళ్ళు త్రాగకుండ ఆపినందులకు అతనికి పాపం అంటింది. తత్కారణంగా అతడు ప్రస్తుత రాజజన్మలో పుత్రహీనుడయ్యాడు.” అది వినిన (బాహ్మణులు పుణ్యంతో పాపాన్ని పరిహరించవచ్చుననియు రాజు యొక్క పాపము తొలగి పుత్రవంతుడు అయ్యే పద్దతిని ఉపదేశించమనియు మునిని అర్థించారు. అపుడు లోమశముని వారితో “శ్రావణమాసంలోని శుక్షపక్షములో వచ్చే సుప్రసిద్ధ ఏకాదశి పవిత్ర ఏకాదశి. మీరు, మీ రాజు ఆ ఏకాదశిని యథావిధిగా ఆచరించండి. తరువాత ఆ ఏకాదశివతపాలన కరిగిన పుణ్యాన్ని మీరు మీ రాజుకు ధారపోయండి. మీరునా ఉపదేశాన్ని కచ్చితంగా పాటిస్తేమీ రాజు పుత్రవంతుడౌతాడు” అని అన్నాడు. ముని మాటలను వినిన బ్రాహ్మణులు ఆనందించారు, సంతోషించారు. తరువాత తమ రాజ్యానికి తిరిగి వెళ్ళి లోమశముని చెప్పినదంతా ఆయనకు పూసగుచ్చినట్లు చెప్పారు. తదనంతరము సరియైన సమయము రాగానే రాజు యొక్క సలహాదారులైన బ్రాహ్మణులు ముని యొక్క ఉపదేశాన్ని గుర్తు చేసికొని రాజుతోపాటు పవిత్ర ఏకాదశిని యథావిధిగా పాటించారు. ద్వాదశిరోజు వారు తమ పుణ్యాన్ని రాజుకు ధారపోసారు. ఆ పుణ్యఫలంగా రాణి గర్భవతియై అందమైన పుత్రుని కన్నది. “ధర్మరాజా! ఈ పవిత్ర ఏకాదశిని పాటించేవాడు సమస్త పాపాల నుండి బయటపడి ఇహపరాలలో సుఖవంతుడౌతాడు. ఈ ఏకాదశి మాహాత్మ్యాన్ని వినేవాడు ఈ జన్మలో పుత్రప్రాప్తి ఆనందాన్ని అనుభవించి తదనంతరము భగవద్దామానికి చేరుకుంటాడు.” (ఆగష్టు నెల 20వ తేదీ శుక్రవారం పవిత్ర ఏకాదశి పర్వదినము. మర్నాడు ద్వాదశిపారణ రమారమీ ఉదయం 6.30 గం॥!! నుండి 9.30గం|! లోపల చేయాలి) (ముఖ్యసూచన : ఏకాదశిరోజు బ్రహ్మహత్యాపాతకము లేదా గోహత్యాపాతకము వంటి ఘోరమైన పాపాలు ఐదురకాలైన ధాన్యాలను ఆశయిస్తాయి. కనుక చరమలాభాన్ని పొందగోరే 'శ్రద్ధావంతులు ఆ రోజు వాటిని భుజించరాదు. 1) బియ్యము, బియ్యము నుండి తయారైనట్టి పిండి, అటుకులు, మేలాలు వంటివి, 2) గోధుమపిండి, మైదాపిండి, రవ్వ త్ర బార్లీ వంటివి, త్తు పెసరపప్పు, కందిపప్పు వంటి పప్పుదినుసులు, బఠానీలు వంటివి, 5) ఆవాలు, నువ్వులు, వాటి నుండి తీస, నూనె అనేవే ఆ ఐదురకాల నిషిద్ధధాన్యాలు. వీటిని తింటే ఏకాదశి 'వ్రతభంగము జరిగినట్లు అవుతుంది. పాలుపండ్లతో ఉపవాసము చేయడము (శేష్టము. ద్వాదశిరోజున ధాన్యముతో వండిన ప్రసాదముతో పారణచేయడం ద్వారా ఏకాదశివతము పూర్తవుతుంది
మాసం:(చంద్రమాసం) -
హృశికేశ,భాద్రపద
తిథి:(చంద్ర
రోజు)-ద్వాదశి
పక్షం:కృష్ణపక్ష
ఎకాదశి వతం నామ సర్య్వకామఫలప్రదం | కర్తవ్యం సర్వదా విమైైర్ విష్ణు ప్రీణనకారణం |!” అన్నద ఏకాదశి మహిమ శ్రీకృష్ణధర్మరాజుల సంవాదరూపంలో బ్రహ్మ వైవర్తపురాణంలో వర్ణించబడింది. “కృష్ణా! శ్రావణమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి?! దానిని గురించి నాకు వివరించవలసినది” అని ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్నాడు. దానికి ప్రత్యుత్తరముగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు : “రాజా! నేను చెసే ఎది సావధానంగా విను. మనిషి యొక్క సమస్త పాపాలను హరించే ఈ మంగళమయమైన ఏకాదశి పేరు అన్నద ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి ఇంద్రియాధీశుడైన హృషీకేశుని అర్చించేవాడు సమస్త పాపకర్మల ఫలం నుండి ముక్తుడౌతాడు.” “పురాతనకాలంలో హరిశ్చంద్రుడనే సుప్రసిద్ధుడైన చక్రవర్తి ఉండేవాడు. అతడు సత్యసంధుడు, నీతిమంతుడు. ఏవో కొని తెలియని కార్యాల కారణంగాను, తన మాటను నిలబెట్టుకోవడం కొరకు గాను అతడు తన రాజ్యాన్ని కోల్పోయాడు. చివరకు అతడు తనను, తన భార్యను, పుత్రుణ్ణి కూడ అమ్ముకోవాల్సి వచ్చింది. రాజా! ఆ పుణ్యచక్రవర్తి ఒక చండాలునికి యేవకుడయ్యాడు. అయినప్పటికిని అతడు సత్యసంధతతో స్థరమైన శ్రద్ధను కనబరచాడు. తన యజమాని ఆదేశంమై అతడు శ్మశానంలో శవాలమై కప్పిన గుడ్డలను తన జీతంగా తీసికోవడం మొదలుపెట్టాడు. అంతటి నీచమైన పనిలో నెలకొనినప్పటికిని అతడు తన సత్యసంధత నుండి, సక్రమ వర్తనము నుండి వైదొలగలేదు. ఈ ప్రకారంగా అనేక సంవత్సరాలు గడిచాయి.” “తరువాత ఒక రోజు ఆ చక్రవర్తి గొప్ప చింతతో ఆలోచించడము మొదలుపెట్టాడు. తాను ఏం చేయారి, ఎక్కడికి పోవాలి, ఏ విధంగా తాను ఉద్ధరింపబడతాననే విషయాన్ని అతడు పదేపదే తలపోసాడు. అతని కష్టాన్ని చూసిన గౌతమముని ఆ రాజు చెంతకు వచ్చాడు. ఆ మునిని చూసిన హరిశ్చంద్రుడు పరుల లాభము కొరకే బాహ్మణులను బ్రహ్మదేవుడు సృష్టించాడని తలచాడు. తరువాత అతడు ఆ మునికి వందనములు కావించి చేతులు జోడ్చి చెంతన నిలిచాడు. ఆ తరువాత తన దీనగాథను అతడు గౌతమముననికి వివరించాడు.” రాజు యొక్క దీనగాథను వినిన గౌతమముని ఆశ్చర్యచకితుడై “రాజా! శ్రావణమాస కృష్ణపక్షంలో వచ్చే అన్నద ఏకాదశి అత్యంత మంగళకరమైనది, సర్వపాపహరమైనది. ఆ ఏకాదశి త్వరలోనే రాబోవడము నీ అదృష్టమనే చెప్పుకోవచ్చును. ఆ ఏకాదశిరోజు నీవు ఉపవాసం ఉండాలి, రాత్రంతా జాగరణ చేయాలి. దాని ఫలితంగా నీ పాపమంతా నశిస్తుంది. ఓ రాజోత్తమా! నీ ప్రభావం చేతనే నేను నీ చెంతకు వచ్చానని తెలిసికో!” అని అన్నాడు. “హరిశ్చంద్రుని ఆ రీతిగా ఆదేశించిన పెమ్మట గౌతమముని అద్భృశ్యుడయ్యాడు. ఆ తరువాత ముని ఆదేశం మేరకు రాజు అన్నద ఏకాదశి వ్రతాన్ని పాటించి సర్వపాపదూరుడయ్యాడు.” ఓ రాజసింహమా! ఈ అద్భుతమైన ఏకాదశి ప్రభావం ఎటువంటిదంటే అనేకానేక సంవత్సరాలు అనుభవించాల్సి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడ దాని వలన హరించుకుపోతాయి. ఈ ఏకాదశి ప్రభావం వలననే హరిశ్చంద్రుడు తన భార్యను, మృతపుత్రుని తిరిగి పొందాడు. అపుడు దేవతలు దుందుభులు (మోగించి ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపంచారు. తదనంతరము ఈ ఏకాదశి ప్రభావం వలననే ఆ రాజు తన రాజ్యాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండ అనుభవించగలిగాడు. చివరకు అతడు తన బంధుమిత్రప్రజలతో పాటుగా భగవద్ధామానికి వెళ్ళాడు. రాజా! ఈ ఏకాదశిని పాటించిన వ్యక్తి సమస్త పాపాల నుండి బయటపడి ఆధ్యాత్మికజగత్తును చేరగలడు” అని శ్రీకృష్ణుడు ముగించాడు. ఈ ఏకాదశి మహిమను వినినవాడు, చదివినవాడు అశ్వమేధయాగఫలాన్ని పొందగలుగుతాడు.
మాసం:(చంద్రమాసం) -
హృశికేశ,భాద్రపద
తిథి:(చంద్ర
రోజు)-ద్వాదశి
పక్షం:శుక్లపక్ష
పార్శ్వ ఏకాదశి మహిమ బ్రహ్మవైవర్త పురాణములో శ్రీక ఎప్షధర్మరాజ సంవాదరూపములో వర్షించబడింది. ఇది పరివర్తిని ఏకాదశి లేదా వామన ఏకాదశి అని కూడ ప్రసిద్ధి చెందింది. భాద్రపదశుక్షపక్షంలో వచ్చే ఏకాదశి సపరేమిటి, దానిని ఏ విధంగా పాటించాలి, దానిని పాటించడము వలన కలిగే లాభ మేమిటని ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని అడిగాడు. దానికి ప్రత్యుత్తరమిస్తూ శ్రీకృష్ణుడు అతనితో “రాజా! భాద్రపద శుక్తపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పార్శ్వ ఏకాదశి. ఇది అత్యంత శుభకరమైనది. అది మనిషికి మోక్షాన్ని ప్రసాదించి సమస్త పాపాలను పరిహరిస్తుంది. ఈ ఏకాదశి మహిమను విన్నంత మాత్రము చేతనే మనిషి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి పాలనము వలన కలిగే పుణ్యం వాజపేయ యజ్ఞఫలంతో కూడ లభించదు. దీనికి జయంతి ఏకాదశి అని కూడ కపేరు ఉన్నది. ఈ ఏకాదశిరోజు శ్రీవామనదేవుని భక్తితో అర్చించేవాడు ముల్లోకవాసులచే అర్చింపబడతాడు. పద్మాక్షుడగు విష్ణువును ఈ రోజు ఆరాధించువాడు నిస్సందేహముగా భగవద్ధామానికి వెళతాడు. శయనించియున్న భగవానుడు ఈ ఏకాదశి రోజునే ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతాడు. అందుకే దీనికి పార్శ్వ పరివర్తిని ఏకాదశి అని కేరు వచ్చింది” అని అన్నాడు. అది వినిన ధర్మరాజు అపుడు శ్రీకృష్ణునితో “ఓ జనార్దనా! నీవు చెప్పిన దానిని వినినప్పటికిని నాకు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. ఓ దేవదేవా! నీవు ఎలా శయనిన్తావు? ఏ విధంగా ప్రక్కకు ఒత్తిగిల్లుతావు? చాతుర్మాస్యవతాన్ని ఆచరించే విధానమేమిటి? నీవు శయనించినపుడు జనులు చేయవలసినదేమిటి? నీవు బరిచక్రవర్తిని ఎందుకు త్రాళ్ళతో బంధించావు? వీటన్నింటికి సమాధానము చెప్పి నాకు సందేహనివ అత్తి చేయవలసినది” అని అన్నాడు. దానికి బదులుగా శ్రీక ఫష్షుడు అతనితో “ఓ రాజకేసరీ! 'త్రేతాయుగములో బలి అనే నా భక్తుడు ఒకడు ఉండేవాడు. రాక్షసకులంలో జన్మించినప్పటికిని అతడు నిత్యము నన్ను పూజిస్తూ స్తుతించేవాడు. అతడు బ్రాహ్మణులను కూడ అర్బించేవాడు, యజ్ఞమును ఒనరించేవాడు. ఈ ప్రకారంగా అతడు త్వరలోనే ప్రభావపూర్తుడై ఇంద్రునే పరాబితుని చేసాడు. స్వర్గరాజ్యాన్ని హస్తగతం చేసికొన్నాడు. అపుడు ఇంద్రునితో పాటు దేవతలందరు, బుషులందరు నన్ను ఆశ్రయించారు. వారి ప్రార్ధనలకు నేను వామనరూపములో అవతరించి బలిమహారాజు యొక్క యజ్ఞ ప్రాంగణానికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాను” “నేను బలిని మూడడుగుల నేలను దానమడిగాను. కేవలము మూడడుగుల నేలను గాక ఇంకా ఏదైనా కోరుకొమ్మని బలిచక్రవర్తి నన్ను అర్థించాడు. అడిగినదానితోనే సంతృప్తి చెందుతానని చెప్పే నేను దృఢనిశ్చయాన్ని ప్రదర్శించాను. ఆమై ఇక ఎంతమాత్రము సంకోచము లేకుండ బలిమహారాజుూ, అతని భార్య యైన వింధ్యావళి నాకు మూడడుగుల నేలను దానమిచ్చారు. అపుడు నేను వామనరూపంలోనే క్రమంగా శరీరాన్ని పెంచి ఒక్క అడుగుతో సప్త అధోలోకాలను ఆక్రమించాను; రెండవ అడుగుతో [గగ్రహమండలముతో పాటు సమస్త ఆకాశాన్ని ఆక్రమించాను. మూడవ అడుగుకు స్థానమును చూపమని అడుగగా బలి తన శిరాన్ని స్థానంగా సూచించాడు. ఆ విధంగా వామనదేవుడు తన పాదాన్ని బలిచక్రవర్తి శిరముమై ఉంచాడు. ఆ చక్రవర్తి వినమతకు మెచ్చిన నేను అతనితోనే శాశ్వతముగా ఉండెదనని ఆశీర్వదించాను.” “ఈ ఏకాదశి రోజునే, అంటే భాద్రపదశుక్షపక్ష ఏకాదశి రోజునే శ్రీవామనదేవుని శ్రీవిగ్రహము 'న్తవక్ష బలిమహారాజు గృహములో ప్రతిష్టంచబడింది. నా వేరొక రూపము అనంతశేష తల్పముమై కీరసాగరంలో 'ప్రతిష్టంచబడింది. భగవానుడు శయన ఏకాదశి నుండి ఉత్థాన ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు శయనిస్తాడు. ప్రతియొక్కడు భగవానునికి ఈ నాలుగు నెలలు విశేషమైన అర్చన చేయాలి. అంతే కాకుండ ఈ సమయంలో వచ్చే ప్రతీ ఏకాదశిని యథావిధిగా పాటించాలి” అని అన్నాడు. ఈ ఏకాదశి పాలన ద్వారా మనిషి శతాశ మేధ యజ్ఞఫలాన్ని పొందగలుగుతాడు. హరేక ప్ల! (సెప్టెంబరు నెల 19వ తేదీ ఆదివారం పార్శ్వ ఏకాదశి పర్వదినము. మర్నాడు ద్వాదశిపారణ ఉదయం రమారమీ 6.30గ౦|! నుండి 7.30 గం!! లోపల చేయాలి (ముఖ్యసూచన : ఏకాదశిరోజు బ్రహ్మహత్యాపాతకము లేదా గోహత్యాపాతకము వంటి ఘోరమైన పాపాలు ఐదురకాలైన ధాన్యాలను ఆశయిస్తాయి. కనుక చరమలాభాన్ని పొందగోరే 'శ్రద్ధావంతులు ఆ రోజు వాటిని భుజించరాదు. 1) బియ్యము, బియ్యము నుండి తయారైనట్టి పిండి, అటుకులు, డేలాలు వంటివి, 2) గోధుమపిండి, మైదాపిండి, రవ్వ వ్రు బార్లీ వంటివి, త్తు పెసరపప్పు, కందిపప్పు వంటి పప్పుదినుసులు, బఠానీలు వంటివి, 5) ఆవాలు, నువ్వులు, వాటి నుండి తీసే నూనె అనేవే ఆ ఐదురకాల నిషిద్ధధాన్యాలు. వీటిని తింటే ఏకాదశి 'వ్రతభంగము జరిగినట్టు అవుతుంది. పాలుపండ్లతో ఉపవాసము చేయడము (శేష్టము. ద్వాదశిరోజున ధాన్యముతో వండిన ప్రసాదముతో పారణచేయడం ద్వారా ఏకాదశివతము పూర్తవుతుంది
మాసం:(చంద్రమాసం) -
పద్మనాభ,ఆశ్వయుజ
తిథి:(చంద్ర
రోజు)-ఏకాదశి
పక్షం:కృష్ణపక్ష
ఎకాదశి వతం నామ సర్య్వకామఫల ప్రదం | కర్తవ్యం సర్వదా విమైైర్ విష్ణు ప్రీణనకారణం |!” ఇందిర ఏకాదశి మహిమ శ్రీకృష్ణధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మ వైవర్త పురాణంలో వర్ణించబడింది. ఒకసారి ధర్మరాజు దేవదేవునితో “ఓ కృష్ణా! మధుసూదనా! భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మ్పేరేమిటి? ఆ ఏకాదశి పాలనకు ఉన్నట్టి నియమనిబంధనలు ఏమిటి? ఆ 'వ్రతపాలన వలన కలిగే లాభ మేమిటి? అని ప్రశ్నించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు : “ఈ ఏకాదశి పేరు ఇందిర ఏకాదశి. దీనిని పాటించడము దా సరా మనుజుడు తన పిత దేవతలను ఉద్దరించగలుగుతాడు, అంతే కాకుండ అతని సమస్త పాపాలు నశిస్తాయి” “రాజా! సత్యయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు. తన శత్రువులను అణచడంలో నేర్చరియెన ఆ రాజు మాహిష్మతీ పురాన్ని చక్కగా పాలించేవాడు. పుత్రపాతులతో గూడి అతడు ఎంతో సుఖంగా జీవించాడు. అతడు సర్వదా విష్ణుభక్తిరతుడై ఉండేవాడు. ఆధ్యాత్మికజ్ఞానంలో నిరంతరము లగ్నమై యుండెడి భక్తుడైన కారణంగా ఆ రాజు ముక్తినాసగెడి గోవిందుని నామస్మరణలోనే తన కాలాన్ని గడిపేవాడు” “ఒకనాడు ఆ రాజు తన రాజ్యసంహాసనం పై కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు. నారదమునిని చూడగానే ఆ రాజు లేచి నిలబడి, చేతులు జోడ్చి వినమంగా వందనము కావించాడు. తరువాత షోడశోపచార పూజ కావించి మునిని సుఖాసీనుని కావింపజేసాడు. అపుడు నారదుడు ఇంద్ర సేనునితో “రాజా! నీ రాజ్యంలో అందరూ సుఖసమృద్ధులతో ఉన్నారా? నీ మనస్సు ధర్మపాలనలో లగ్నమై ఉన్నదా? నీవు విష్ణుభక్తిలో నెలకొని ఉన్నావా?” అని ప్రశ్నించాడు.” దానికి ప్రత్యుత్తరంగా ఇంద్రసేనుడు నారదునితో “ఓ మునివర్యా! మీ దయ వలన అంతా బాగానే ఉన్నది, మంగళమయంగానే ఉన్నది. నేడు మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది, నాకు యజ్ఞఫలం లభించింది. ఓ దేవర్షీ! మీ రాకకు కారణమేమిటో చెప ఏవలసినది” అని అన్నాడు.
రాజు మాటలను వినిన తరువాత నారదుడు అతనితో ఇలా అన్నాడు 2: ఓ రాజశార్దూలమా! నాకు కనిపించిన ఒక అదు ఎతమైన సంఘటనను చెబుతాను విను. ఓ రాజేంద్రా! నేనొకసారి బ్రహ్మలోకం నుండి యమరాజు యొక్క లోకానికి వెళ్ళాను. యమరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించాడు. నేను కూడ అతనిని స్తుతించాను. అక్కడ యమలోకంలో మహాపుణ్యభాగుడైన నీ తండ్రిని నేను చూసాను. 'వ్రతోల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడకు వెళ్ళవలసివచ్చింది. రాజా! అతడు ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెలపమని అర్థించాడు. అతడు నాతో ఇలా అన్నాడు - “మాహిష్మతీ పురాధీశుడైన ఇంద్రసేనుడు నా పుత్రుడు. పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వలన నేనిపుడు యమసదనంలో ఉన్నాను. కనుక నా పుత్రుడు ఇందిర ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి. అపుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలను” “కనుక ఓ రాజా! నీ తండ్రిని ఆధ్యాత్మికలోకానికి పంపడానికై నీవు ఇందిర ఏకాదశి వ్రతాన్ని చేపట్టు” అని నారదుడు తాను తెచ్చిన సందేశాన్ని చెప్పాడు. అపుడు ఇంద్రసేనుడు ఇందిర ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతిని గురించి తెలుపుమని నారదుని అర్థించాడు. 'వ్రతవిధానాన్ని శ్రీనారదుడు ఇలా వివరించాడు : “ఏకాదశి ముందు రోజు మనుజుడు తెల్లవారురూూమునే స్నానం చేసి పేత దేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ రోజు అతడు ఒక్క పూటనే భోజనం చేసి నేలమై పడుకోవాలి. మర్నాడు ఏకాదశిరోజు మళ్ళీ తెల్లవారు రూమునే మేల్కొని దంతధావనము, హస్తముఖప్రక్షా ళనము చేసికొని చక్కగా స్నానం చేయాలి. తరువాత ఎటువంటి భౌతికభోగంలో పాల్గొననని వ్రతనియమం చేపట్టి రోజంతా ఉపవసించాలి. ఓ పద్మనేత్రుడా! నేను నిన్ను ఆశయిస్తున్నాను” అని పలికి భగవంతుని స్తుతించాలి. “తరువాత మధ్యాహ్నవేళ సాలగ్రామశిల ఎదురుగా విధిపూర్వకముగా పితృతర్పణాలు చేయాలి. తదనంతరము బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తి పరచాలి. పఏతృతర్చణ కార్యంలో మిగిలిన పదార్థాలను గోవులకు పెట్టాలి. ఆ రోజు అతడు చందన పుష్ప ధూపదీప నైవేద్యాలతో హృషీకేశుని అర్చించాలి. శ్రీకృష్ణుని నామరూపగుణ లీలాదుల శ్రవణకీర్తనలతో, స్మరణముతో అతడు ఆ ర్యాతి జాగరణ చేయాలి. మర్నాడు అతడు శ్రీహరిని అర్చించి బాహ్మణులకు భోజనం పెట్టాలి. తదనంతరము అతడు సోదరులు, పుత్రపొత్రులు, బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రతపారణము చేస్తూ భోజనం చేయాలి. రాజా! ఈ విధంగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తైనీ తండ్రి నిశ్చయంగా విష్ణులోకానికి వెళతాడు.” నారదుడు ఈ విధంగా ఉపదేశించి అంతర్హితుడయ్యాడు. తరువాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారమే సంతానము, బంధువులు, మిత్రులతో గూడి. నిష్టగా ఇందిర ఏకాదశిని పాటించాడు. ఆ వ్రతమహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. ఇంద్ర సేనుని తండ్రి గరుడవాహనారూఢుడై విష్ణుపదాన్ని చేరుకున్నాడు. తరువాత రాజర్షి మైన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలనము చేసి, చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. ఇందిర ఏకాదశి మహిమే ఇటువంటిది. ఈ ఇందిర ఏకాదశి మహిమను చదివేవాడు, వినేవాడు సమస్త పాపముక్తుడై చివరకు విష్ణుపదాన్ని చేరుకుంటాడు.
మాసం:(చంద్రమాసం) -
పద్మనాభ,ఆశ్వయుజ
తిథి:(చంద్ర
రోజు)-ఏకాదశి
పక్షం:శుక్లపక్ష
ఆశ్వీయుజమాసం శుక్షపక్షంలో వచ్చే పాశాంకుశ ఏకాదశి మాహాత్మ్యము శ్రీకృష్ణధర్మరాజుల సంవాద రూపంలో (బ్రహ్మ వైవర్త పురాణమునందు వర్ణించబడింది. ఆశ్వీయుజ శుక్షపక్షంలో వచ్చే ఏకాదశి మేరు, దాని వివరాలు తెలుపుమని ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగినపుడు ఆ దేవదేవుడు ఈ విధంగా పలికాడు. “ఓ రాజ్యశ్రేష్టా! ఆ ఏకాదశి పేరు పాశాంకుశ ఏకాదశి. మనిషి యొక్క సమస్తమగు పాపములను నశింపజేసే ఆ ఏకాదశి మాహాత్మ్యాన్ని వివరిస్తాను విను. కొందరు దీనిని పాపాంకుశ ఏకాదశి అని కూడ పిలుస్తారు. ఆ రోజు ముఖ్యంగా పద్మనాభుని అర్చించాలి. ఆ ఏకాదశి జీవునికి స్వర్గసుఖాలను, మోక్షా న్ని, వాంఛితఫలాలను ఒసగుతుంది. విష్ణు నామోచ్చారణము చేత మనిషి ధరిత్రి పైన సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యాన్ని పొందగలుగుతాడు. బద్ధజీవుడు మోహవశముచే నానారకాలైన పాపకర్మలను చేయక పతితజీవులను ఉద్ధరించే శ్రీహరి పాదపద్మాలను ఆశయించి వాటికి నమస్కరించినచో నరకమున పడకుండును.” | “శివుని విమర్శించే వైష్ణవులు, విష్ణువును విమర్శించే శెవులు నిస్పందేహముగా నరకములో కూలుతారు. శతాశ్వమేధ యజ్ఞఫలము కాని, శత రాజసూయ యజ్ఞఫలము కాని ఈ ఏకాదశి పాలన వలన సంధప్రాప్తేంచే పుణ్యానికి ఒక వంతు పోలవు. ఈ ఏకాదశిని పాటించడము వలన కలిగే పుణ్యానికి సమానమైన పుణ్యము ఈ జగత్తులో లేనేలేదు. కనుక పద్మనాభునికి పరమపట్రయమైన ఈ ఏకాదశి యంతటి పవిత్రమైన దినము వేరొకటి లేదు.” “రాజా! ఏకాదశి నియమపాలనలో విఫలుడైనవాని దేహములో పాపాలు నివాసము చేస్తాయి. ఈ ప్రత్యేకమైన ఏకాదశిని పాటించేవాడు స్వర్గసాఖ్యాలను, మోక్షాన్ని, రోగవిముక్తిని, సుందరమైన పత్నిని, ధనధాన్యాదులను పొందుతాడు. ఈ ఏకాదశిని పాటించి రాత్రి మొత్తము మేల్కొనియుండువాడు సులభంగా విష్ణులోకానికి చేరుకుంటాడు.”
“ఓ రాజోత్తమా! ఈ ఏకాదశిని పాలనము చేయడము ద్వారా మనిషి తన తల్లి వైపు పది తరాలను, తండ్రి వైపు పది తరాలను, భార్య వైపు పది తరాలను ఉద్ధరించగలుగుతాడు. బాల్యము నందు గాని, యౌవనము నందు గాని, వృద్ధాప్యమునందు గాని ఈ ఏకాదశిని పాటించినవాడు సంసారశక్షేశములను అనుభవింపడు. ఈ పాశాంకుశ లేదా పాపాంకుశ ఏకాదశిని నిష్టగా పాటించేవాడు సమస్త పాపవిముక్తుడై జీవితాంతమున విష్ణుపదాన్ని చేరుకుంటాడు. బంగారమును, నువ్వులను, భూమిని, గోవులను, ధాన్యమును, జలమును, గొడుగును, పాదరక్షలను దానమిచ్చినవాడు యమసదనానికి వెళ్ళవలసిన పని ఉండదు. పుణ్యాచరణము లేకుండ ఆ రోజును గడిపివేసేవాడు శ్వాసించుచున్నప్పటికిని మృతుడే అనబడతాడు. అతని శ్వాసక్రియ కొలిమి తిత్తులతో పోల్చబడుతుంది.” “రాజా! ఇతరుల లాభము కొరకు చెబువులను, బావులను త్రవ్వించేవాడు, నేలను గృహాలను దానమిచ్చేవాడు, యజ్ఞయాగాది కర్మలను చేసేవాడు యముని దండనకు గురికాడు. పుణ్యఫలము వలననే మానవులు దీర్లకాలము జీవిస్తారు, రోగదూరులౌతారు. సారాంశమేమంటే ఈ ఏకాదశి పాలనము వలన కలిగే ప్రత్య క్షఫలము దేవదేవుని భక్తియుతఘేవ; కాగా భౌతికలాభములు పరోక్ష ఫలములై యున్నవి.” (అక్టోబరు 11, 2008 వ తేదీ పాశాంకుశ ఏకాదశి పర్వదినము. మర్నాడు ద్వాదశిపారణము అక్టోబరు 12వ తేదీ ఉదయం 6.15 గం! నుండి 6.50 గం[| లోపల పూర్తి చేయాలి.) ఈ నెల అక్టోబరు 24వ తేదీన వచ్చే మరొక ఏకాదశి ఘేరు రమా ఏకాదశి. ఆ ఏకాదశి యొక్క ద్వాదశిపారణము అక్టోబరు 25వ తేదీ ఉదయం 8.30 గం! నుండి 10.00 గం! లోపల పూర్తి చేయాలి. (ముఖ్యసూచన : ఏకాదశిరోజు బ్రహ్మహత్యాపాతకము లేదా గోహత్యాపాతకము వంటి ఘోరమైన పాపాలు ఐదురకాలైన ధాన్యాలను ఆశయిస్తాయి. కనుక చరమలాభాన్ని పొందగోరే 'శ్రద్ద్ధావంతులు ఆ రోజు వాటిని భుజించరాదు. 1) బియ్యము, బియ్యము నుండి తయారైనట్టి పెండి, అటుకులు, మేలాలు వంటివి, 2) గోధుమపిండి, మైదాపిండి, రవ్వ 3) బార్లీ వంటివి, 4) పెసరపప్పు, కందిపప్పు వంటి పప్పుదినుసులు, బఠానీలు వంటివి, 5) ఆవాలు, నువ్వులు, వాటి నుండి తీసే నూనె అనేవే ఆ ఐదురకాల నిషిద్ధధాన్యాలు. వీటిని తింటే ఏకాదశి వ్రతభంగము జరిగినట్లు అవుతుంది. పాలుపండ్లతో ఉసవాసము చేయడము శేష్టము. ద్వాదశిరోజున ధాన్యముతో వండిన ప్రసాదముతో పారణచేయడం ద్వారా ఏకాదశి వతము పూర్తవుతుంది)
మాసం:(చంద్రమాసం) -
దామోదర,కార్తీక
తిథి:(చంద్ర
రోజు)-ఏకాదశి
పక్షం:కృష్ణపక్ష
ఎకాదశి వ్రతం నామ సర్య్వకామఫలప్రదం | కర్తవ్యం సర్వదా విమైైర్ విష్ణు ప్రిణన కారణం |” రమా ఏకాదశి మాహాత్మ్యము శ్రీకృష్ణధర్మరాజ సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించబడింది. “ఓ జనార్దనా! ఆశ్వీయుజమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని నాకు వివరించవలసినది” అని ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్నాడు. అపుడు శ్రీకృష్ణుడు జవాబిస్తూ “ఓ రాజసింహమా! ఆ ఏకాదశి కేరు రమా ఏకాదశి. అది సమస్త పాపాలను హరిస్తుంది. ఇపుడు ఆ పవిత్ర ఏకాదశి మహిమను విను” అని పలుకసాగాడు. చాలాకాలం క్రిందట ముచుకుందుడనే ప్రఖ్యాతరాజు ఉండేవాడు. అతడు స సర్గరాజు ఇంద్రునికి మంచి మిత్రుడు. యమరాజు, వరుణుడు, కుబేరుడు, విభీషణుడు వంటి మహోన్నతులతో కూడ అతనికి య్నేహం ఉండేది. సత్యసంధుడైన ఆ రాజు సదా విష్ణుభక్తిలో అనురక్తుడై ఉండేవాడు. అతడు తన రాజ్యాన్ని చక్కగా పాఠించేవాడు. కొంతకాలానికి ముచుకుందునికి ఒక కుమార్తె కలిగింది. సర్వ్ఫోత్తమ నదియైన చంద్రభాగా యొక్క ేరును ఆ అమ్మాయికి పెట్టారు. యుక్తవయస్సు రాగానే ఆమెకు చంద్రసేనుని తనయుడైన శోభనునితో పరిణయము జరిగింది. ఒకసారి శోభనుడు ఏకాదశిరోజు తన మామగారి ఇంటికి వచ్చాడు. అది చూసిన చంద్రభాగ కలవరపడినదై తనలో తాను “ఓ దేవా! ఇప్పుడేమి చేయాలి? నా భర్త దుర్చలుడు; ఆకలిని తట్టుకోలేడు. నా తండ్రి మరీ కఠినుడు. ఏకాదశికి ముందు రోజునా తండ్రి ఒక సేవకుని పంపి ఎవ్వరూ ఏకాదశి రోజున అన్నం తినవద్దని చాటింపు కూడ వేస్తాడు” అని అనుకోసాగింది. ఈ ఆచారం గురించి వినిన శోభనుడు తన భార్యతో “ఓ ప్రేయపత్నీ! ఇపుడు నన్నేమి చేయమంటావు? నా ప్రాణం రక్షింపబడడానిక్తి అలాగే రాజాజ్ఞ ఉల్లంఘంచకుండ ఉండడానికి ఏం చేయాలో చెప్పు” అని అన్నాడు. అపుడు చంద్రభాగ తన భర్తతో “స్వామీ! మనుషుల మాట అటుంచండి. నా తండ్రి రాజ్యంలో ఏనుగులు, గుజ్జాలు, ఇతర జంతువులకు కూడ ఈ రోజు ఆహారం ఉండదు.
కనుక ప్రభూ! ఇక మనుషులెట్లా తినగలుగుతారు? ఒకవేళ తప్పకుండ తినవలసియే ఉంటే మీరు మీ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. ఇది మీరు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసికోండి.” భార్య మాటలు వినిన శోభనుడు ఆమెతో “నీవు చెప్పింది అక్షరాల సత్యమే. కాని నాకు ఈ ఏకాదశి 'వ్రతపాలన చేయాలని ఉంది. నాకు ఏది జరగవలసి ఉందో అది జరిగియే తీరుతుంది కదా!” అని అన్నాడు. ఈ విధంగా తలచిన శోభనుడు పవిత్ర ఏకాదశి వతపాలనకు ఉద్యుక్తుడయ్యాడు. కాని అతడు ఆకలిదప్పికలతో _ నీరసించిపోయాడు. ఇంతలో సూర్యాస్తమయం అయింది. వైష్ణవులు, పుణ్యాత్ములు అందరూ ప్రసన్నులయ్యారు. ఓ రాజసింహమా! ఆ రాత్రి వారంతా సంకీర్తన అర్బ్చనలతో గడిపివేసారు. కాని ఆ రేయి గడపడం శోభనునికి అసాధ్య మైంది. సూర్యోదయం లోపలే అతడు దేహం చాలించాడు. ముచుకుందుడు శోభనునికి చందనపు కట్టెలతో చితిపేర్చి దహనసంస్కారాలు చేసాడు. ముచుకుందుని ఆజ్ఞ మేరకు చంద్రభాగ సతీసహగమనం మానుకుంది. భర్తకు అంత్యక్రియలు జరిగిన తరువాత ఆమె తండ్రి ఇంటిలోనే నివసించసాగింది. “రాజా! ఇంతలో రమా ఏకాదశి 'వ్రతపాలన ప్రభావంగా శోభనుడు దేవపురమనే రాజ్యానికి రాజుగా జన్మించాడు. అది మందర పర్వతము పైన ఉన్నది. రత్నఖచితమైన బంగారు స్తంభాలు కలిగినట్టిది, మణిఖచితమగు గోడలు కలిగినదియైన ఐశ్వర్యయుత ప్రాసాదములో అతడు నివసించసాగాడు. మణిమయమైన బంగారు కిరీటమును ధరించిన అతనికి తెల్లని ఛత్రము పట్టబడియుండేది. కర్ణకుండలములతో, కంఠాభరణములతో, బంగారు భుజకీర్తులతో కంకణములతో అలంకృతుడై అతడు రాజ్యసంహాసనమున కూర్చునేవాడు. గంధర్వులచే, అప్పరసలచే కేవింపబడుచు అతడు స సర్గరాజు ఇంద్రుని వలె గోచరించెడివాడు. ” ఒకరోజు ముచుకుందపుర నివాసియెన సోమశర్మ అనే బ్రాహ్మణుడు శోభనుని రాజ్యానికి తీర్ధయాత్రలు చేస్తూ వచ్చాడు. శోభనుడు ముచుకుందుని అల్లుడని భావించి ఆ బ్రాహ్మణుడు అతని వద్దకు చేరాడు. బ్రాహ్మణుని చూడగానే రాజు లేచి నిలబడి, చేతులు జోడించి నమస్కరించాడు. తరువాత అతడు బ్రాహ్మణుని కుశల మడిగాడు. తరువాత ముచుకుందుడు, తన భార్య చంద్రభాగ, ముచుకుందపుర జనుల గురించిన క్షేమసమాచారాలు కూడ అడిగాడు. అపుడు (బాహ్మణుడు అందరి 'క్షేమసమాచారాలు తెలిపాడు. అక్కడ ప్రతియొక్కరు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని తెలిపిన బ్రాహ్మణుడు అతనితో “రాజా! ఇంతటి సుందరమైన నగరాన్ని ఇంతకు మునుపు నేనెన్నడును చూడలేదు. నీకు ఈ రాజ్యం ఎలా లభించిందో చెప్పవలసింది" అని అడిగాడు. “ఆశ్వీయుజ కృష్ణపక్షంలో వచ్చే రమాఏకాదశిని పాటించిన ప్రభావము వలననే నాకు ఈ తాత్కాలికమైన రాజ్యం లభించింది. ఓ బ్రాహ్మణోత్తమా! ఈ రాజ్యం శాశ్వతంగా ఉండిపోయే విధానమేమిటో నాకు చెప ఏవలసినది. నేను ఏకాదశి వ్రతాన్ని 'శ్రద్ధారహితంగా చేసిన కారణంగా ఈ అస్థిరమైన రాజ్యం లభించింది. ఈ విషయాలను చంద్రభాగకు తెలపండి. ఆమె దీనిని సుస్థరమొనర్చగలిగే సామర్థ్యము కలిగినట్టిది” అని శోభనుడు అన్నాడు. శోభనుని మాటలను వినిన బ్రాహ్మణుడు ముచుకుందపురానికి వచ్చి విషయమంతా చంద్రభాగకు వివరించాడు. అది వినిన చంద్రభాగ అమితానందభరితురాలు అయింది. తాను విన్నదంతా కలలాగా ఉన్నదని ఆమె పలికింది. అపుడు సోమశర్మ ఆమెతో “అమ్మా! నేను నీ భర్తను దేవపురిలో స్వయంగా చూసాను. ఆ పురము సూర్యప్రభలతో వెలిగిపోతోంది. కాని ఆ రాజ్యం సుస్థిరంగా లేదని అతడు చెప్పాడు. కాబట్టి ఏదో విధంగా రాజ్యాన్ని నీవు సుస్థిరం చేయాలి” అని అన్నాడు. అది వినిన చంద్రభాగ తనను తన భర్త చెంతకు తీసికొని వెళ్ళమని బ్రాహ్మణుని అర్థించింది. తన పుణ్యపరిపాకంతో ఆ రాజ్యాన్ని తాను సుస్థిరం చేయగలనని ఆమె చెప్పింది. భార్యాభర్త లైన తాము కఠిసికొనే ఏరా ఎట్లు చేయమని, ఆ విధంగా భార్యాభర్తలు కఠలిసుందుకు సహాయపడితే పుణ్యము కలుగుతుందని ఆమె బ్రాహ్మణునితో అన్నది. తదనంతరము సోమశర్మ చంద్రభాగను మందరపర్వత సమీపంలో ఉన్నట్టి వామదేవుని ఆశమానికి తీసుకొని వెళ్ళాడు. దేదీప్యమానమగు ముఖవర్చస్సు కలిగిన చంద్రభాగ యొక్క కథను వినిన తరువాత వామదేవుడు ఆమెకు వేదమంత్రోపదేశం చేసాడు. వామదేవుడు ఒసగిన మంత్రప్రభావం వలన ఏకాదశి 'వ్రతమహిమ వలన చంద్రభాగ వెంటనే ఆధ్యాత్మిక శరీరాన్ని పొందింది. తరువాత ఆమె వెంటనే వెళి ్ర ఆనందంతో తన భర్తను కరిసికొన్నది. భార్యను చూడగానే. శోభనుడు పరమానందభరితుడై పూర్ణ సంతుష్టిని పొందాడు. అపుడు చంద్రభాగ తన భర్తతో “పభూ! నా మంచిమాటలు వినండి. నేనునా తండ్రి ఇంట్లో ఎనిమిదేండ్ల వయస్సు నుండే ఏకాదశివత పాలనము చేస్తున్నాను. ఆ పుణ్యమంతా మీ రాజ్యాన్ని సుస్థిరం చేసే ప్రళభయాంతము వరకు దీనిని సమృద్ధిగా నిలుపు గాక[” అని అన్నది. ఆ తరువాత ఆమె వివిధ నగలతో అలంకృతమైన దివ్యశరీరంతో భర్తతో కలిసి సుఖజీవనం గడిపింది. రమా ఏకాదశి ప్రభావం వలన శోభనుడు కూడ దివ్యశరీరాన్ని పొంది మందరపర్వత చరియలలో విహరించాడు. కనుక ఈ రమా ఏకాదశి కామధేనువు లేదా చింతామణి వంటిది. శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ “రాజా! పరమమంగళమైన రమా ఏకాదశి మహిమను నీకు వివరించాను. దీనిని కచ్చితంగా పాటించేవాడు 'బ్రహ్మహత్యాపాతకము వంటి పాపం నుండైనా నిస్సందేహముగా బయటపడతాడు. నల్లగోవు, తెల్లగోవు రెండు కూడ తెల్లనిపాలే ఇచ్చినట్లు కృష్ణపక్ష ఏకాదశి, శుక్షపక్ష ఏకాదశి రెండు కూడ వ్రతానుయాయులకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఏకాదశి మహిమను వినేవాడు సమస్త పాపాల నుండి బయటపడి విష్ణులోకంలో ఆనందంగా నివసిస్తాడు” అని చెప్పే ముగించాడు.
మాసం:(చంద్రమాసం) -
దామోదర,కార్తీక
తిథి:(చంద్ర
రోజు)-ఏకాదశి
పక్షం:శుక్లపక్ష
ఉత్థాన ఏకాదశి (ప్రబోధినీ ఏకాదశి మాహాత్మ్యము బహ్మనారద సంవాద రూపంలో స్కంద పురాణంలో వర్షించబడింది. ఒకసారి బ్రహ్మదేవుడు నారదమునితో “ఓ మునిశేష్టుడా! సకల పాపాలను హరింపజేసేది, పుణ్యాన్ని వృద్ధి కావించేది, ముక్తిని ఒసగేది అయినట్టి ఉత్ధాన ఏకాదశి మాహాత్మ్యాన్ని విను. ఓ బాహ్మణశేష్టుడా! కార్తీక శుక్తపక్షంలో వచ్చేది, మనుజుని సకల పాపాలను భస్మీపటలము కావించేది అయిన ఈ ఉత్ధాన ఏకాదశి ఈ జగత్తులో ఆవిర్భవించనంతవరకే గంగానది యొక్క (శేష్టత పటిష్టంగా ఉండేది. సాగరుని ప్రభావము, సరోవరము యొక్క పవిత్రత ఉత్థాన ఏకాదశి ప్రకటము కానంతవరకే అద్వితీయంగా ఉండేవి. వేయి అశ్వమేధ యాగాలను, వంద రాజసూయయాగాలను చేయగా కలిగే ఫలితము ఈ ఏకాదశిని పాటించడము దా సరా సులభంగా కలుగుతుంది” అని పలికాడు. బ్రహ్మదేవుని ఈ పలుకులను వినిన నారదముని అతనితో “తండ్రీ! ఆ రోజు కేవలము ఒకేసారి ఆహారము తీసికొనేవానికి లేదా కేవలము రాత్రి మాత్రమే ఆహారము తీసికొనేవానికి లేదా పూర్తిగా ఉపవాసము చేసేవానికి కలిగే ఫఠితమేమిటో చెప ఏవలసినది” అని అన్నాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా బ్రహ్మదేవుడు అతనితో ఇలా అన్నాడు : “ఆ రోజు ఒకసారి భుబించేవాడు ఒక జన్మలోని సమస్త పాపాలను నశింపజేసికొంటాడు. కేవలము రాత్రి మాత్రమే భుబించేవాడు రెండు జన్మల పాపాలను నశింపజేసికొంటాడు. ఇక పూర్తిగా ఉపవసించేవాడు తన ఏడుజన శ్రల పాపాలను నశింపజేసికొాంటాడు.” “పుత్రా! ముల్లోకములలో చూడనిది, కోరనిది, దుర్లభమైనదియైన దేనినైనను ఈ ఉత్థాన ఏకాదశి ప్రసాదిస్తుంది. మందర పర్వతము వంటి మహాపాపాన్నైనా ఈ ఏకాదశి భస్మేపటలము చేయగలదు. ఈ ఏకాదశి రోజున చేసికొన్నట్టి పుణ్యము సుమేరు పర్వతమంత ఫలితాన్ని ఇస్తుంది. భగవంతుని ప్రార్థించనట్టి వారిలో, 'వ్రతభంగము చేసినవారిలో, నాస్తికులైనవారిలో, వేదనింద చేసేవారిలో, శాస్త్ర్వములకు దుర్య్యాఖ్యానము చేసేవారిలో, పరభార్యను అనుభవించేవారిలో, మూర్థులలో ధర్మము నిలువనే నిలువదు. మనిషి పాపము చేయక పుణ్యవర్తనుడై ఉండాలి. పుణ్యము చేయగోరే వానిలో ధర్మము నశింపకుండ నిలుస్తుంది. ఉద్దాన ఏకాదశి వ్రతాన్ని గంభీరముగా పాటించేవానికి వందజన్మల పాపాలు తొలగిపోతాయి. ఉత్థాన ఏకాదశినాడు రాత్రి జాగరణ చేసే వ్యక్తి యొక్క భూతభవిష్యత్ వర్తమాన తరముల వారందరు విష్ణుపదాన్ని పొందుతారు.” “నారదా! కార్తీకమాసంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించనివానికి, విష్ణు ఆరాధనము చేయనివానికి సమస్త పుణ్యము నశిస్తుంది. ఓ (బ్రాహ్మణోత్తమా! మనుజుడు కార్తీకమాసంలో నిశ్చయంగా. విష్ణువును ఆరాధించాలి. కార్తీకమాసంలో తన వంట తానే చేసికొనేవాడు చాంద్రాయణ వ్రతఫలితాన్ని పొందుతాడు. కార్తీకమాసంలో విష్ణుకథల 'శ్రవణకీర్తనలు చేసేవాడు నూరు గోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. నిత్యశాస్త్రాధ్యయనం చేత వ్యక్తి వేయి యజ్ఞఫలాన్ని పొందగలుగుతాడు. భగవత్కథలను విని తన శక్త్యనుసారము వక్తకు దక్షిణను ఇచ్చేవాడు శాశ్వతమగు భగవద్ధామాన్ని చేరుకుంటాడు.” ఇది. వినిన నారదుడు అపుడు ఆ ఏకాదశి వ్రతవిధానాన్ని గురించి అడిగాడు. దానికి ప్రత్యుత్తరముగా బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు : “ఓ ద్విజ్యశేష్టుడా! ఆ రోజు మనుజుడు బహృముహూరములోనే నిదలేచి కాళు చేతులు కడుక్కొని, స్రానం చేసి కేశవుని అరిఇంచాలి. (బూ ర్ 6 అ గ్రా ఎ ఎ తరువాత అతడు మంత్రోచ్చారణము చేస్తూ “ఈ ఏకాదశి రోజు నేను ఉపవసించి కేవలము ద్వాదశి రోజునే ఆహారాన్ని తీసికొంటాను. ఓ పుండరీకాక్షా! అచ్యుతా! నేను నీకు శరణుజొచ్చియున్నవాడను. నన్ను రక్షించుము” అని వ్రతదీక్షను చేపట్టాలి. “ఈ ఏకాదశి వ్రతాన్ని మనిషి పరమానందముతో ఆచరించి విష్ణువు చెంత రాత్రి జాగరణ చేయాలి. జాగరణ చేస్తూ అతడు భగవంతుని దివ్యగుణాలను కీర్తించాలి, వినాలి. ఆ రోజు అతడు సమస్త లోభాలను విడిచిపెట్టాలి. ఈ ఉపదేశాన్ని పాటించే పుణ్యాత్ముడు పరమగమ్యాన్ని చేరుకుంటాడు” “జనార్దనుని కదంబపూలతో అర్చించేవాడు యమరాజు సదనానికి వెళ్ళనే వెళ్ళడు. గరుడధ్వజుని (విష్ణువును) కార్తీకమాసంలో గులాబీలతో అర్చించేవాడు నిశ్చయంగా ముక్తిని పొందుతాడు. భగవానుని వకుళ _ అశోకపుషా ఏలతో అరి 'ఏంచేవాడు ఆకాశంలో సూర్యచందులు ప్రకాశించేంతవరకు _ శోకవిముక్తుడై ఉంటాడు. దేవదేవుని శమీపత్రాలతో పూజించేవాడు యమరాజు దండనము నుండి తప్పించుకొంటాడు. దేవతా నియామకుడగు విష్ణువును వర్షబుతువులో చంపకపుష్పాలతో పూజించేవాడు ఈ భౌతికజగత్తులో తిరిగి జన్మించవలసిన పని ఉండదు. విష్ణువుకు పసుపుపచ్చని కేతకీ పుష్పాలను అర్చిస్తే మనుజుడు కోట్లకొలది జన్మలలో ప్రోగుబడిన పాపాలను నశింపజేసికొంటాడు. అరుణవర్ష సుగంధ శతపత్ర కమలాలతో జగన్నాథుని పూజించేవాడు భగవన్నిలయమైన శే తదీ సపాన్ని చేరుకుంటాడు” బ్రాహ్మణోత్తమా! ఏకాదశిరోజు రాత్రి మనుజుడు జాగరణ చేయాలి. దా సదశిరోజు అతడు విష్ణువును ఆరాధించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి 'వ్రతపరిసమాప్తి చేయాలి” మనుజుడు తన శక్ష్యనుసారము గురుదేవుని అర్చించి ఆయనకు దక్షిణను సమర్ప్చిస్తై భగవంతుడు అతని యెడ 'పసన్నుడౌతాడు.
మాసం:(చంద్రమాసం)-
కేశవ,మార్గశిర
తిథి:(చంద్ర
రోజు)-ఏకాదశి
పక్షం:కృష్ణపక్ష
ఉత్పన్న ఏకాదశి మాహాత్మ్యము శ్రీకృష్ణార్డున సంవాద రూపమున భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది . “శఈకృష్ణుని ద్వారా వర్ణితమైనట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని మానవుడు భక్తిశద్ధలతో ఆచరిస్తే లేదా దాని మహిమను, విధినియమాలను శ్రవణము చేస్తే ఈ జన్మలో సుఖమును పొంది తదుపరి జన్మలో విష్ణులోకాన్ని చేరుతాడు” అని శ్రీల సూతగోస్వామి బ్రాహ్మణులతో, బుషులతో చెప్పాడు. “ఓ జనార్దనా! ఏకాదశిరోజున పూర్తి ఉపవాసం చేస్తే లేదా కేవలము రాత్రి మాత్రమే ఆహారం తీసికొంటే లేదా ఒక్కమారు మధ్యాహ్నం ఆహారం తీసికొంటే కలిగే లాభమేమిటో నాకు వివరించవలసినది” అని అర్జునుడు ఒకసారి శ్రీకృష్ణుని అడిగాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా పలికాడు : “అర్జునా! శరదృతు ఆరంభములోని ఏకాదశి, అంటే కార్తీకమాస కృష్ణపక్ష ఏకాదశి రోజు మనుజుడు ఏకాదశి వ్రతాన్ని ఆరంభించాలి. ఏకాదశి ప్రొద్దుననే అతడు ఉపవాసవతాన్ని చేపట్టాలి. స్నానం చేసే సమయంలో అతడు “ఓ అన్యక్రాంతే! ఓ రథక్రాంతే! ఓ విష్ణుక్రాంతే! ఓ వసుంధరే! ఓ మృత్తికే! ఓ ధరణీ! నేను పరమగతిని పొందులాగున నా పూర్వజన్మల పాపములన్నింటిని నశింపజేయుడు” అని ప్రార్ధించాలి. స్నానానంతరము అతడు గోవిందుని పూజించాలి.” “ఒకసారి స్వర్గరాజగు ఇంద్రుడు దేవతాపరివృత్తుడై భగవంతుని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా ప్రార్ధించాడు : “ఓ జగదీశ్వరా! దేవదేవా! నీకు వందనములు. నీవే ఎల్లరకు పరమాశ్రయుడవు, తల్లివి, తండ్రివి. నీవే ఎల్లరను సృజించి, పోషించి, లయింపజేయుదువు. భూమికి, ఆకాశానికి, సమస్త సృష్టికి నీవే పరమోపకారివి. నీవే స్వయంగా బ్రహ్మ, విష్ణు, మూశ్వరుడవై యున్నావు. నీవే సమస్త యజ్ఞములకు, తపస్సులకు, మంత్రాలకు, యజ్ఞకర్తలకు భోక్తవు. నీకు చెందనిది, నీచే నియంత్రించబడనిది ఈ ముల్లోకములలో ఏదీ లేదు. ఓ దేవా! భగవంతా! దేవతాప్రభూ! శరణాగత రక్షకా! ఓ యోగేశ్వరా! మేము ఇపుడు స్వర్గాన్ని కోల్పోయి దానవులచే తరిమివేయబడినాము. భీతితో నీ పాదపద్మాములకు శరణాగతులమైన మమ్ము ఇప్పుడు రక్షించవలసినది. ఓ జగదీశ్వరా! స్వర్గము నుండి ఇపుడు మర్త్యలోకమునకు పతనము చెందినవారమై మేము దుఃఖసాగరములో మునిగాము. దయ చేసి మా యెడ ప్రసన్నుడవగుము.” “ఇంద్రుని అట్టి దయనీయమైన ప్రార్థనను వినిన విష్ణుభగవానుడు అతనితో “దేవతలనే ఓడించినట్టి ఆ అజేయుడగు దానవుడెవ్వడు? వాడీ కేరేమిటి? వాడి శక్తికి మూలమేమిటి? ఇంద్రా! దీనినంతటిని నిర్భయుడవై నాకు వివరించు” అని అన్నాడు.” “అపుడు ఇంద్రుడు సమాధానమొసగుచూ “ఓ దేవదేవా! భక్తోద్దారకా! పరమప్రభూ! ఆ ఉగ్రదానవుని మేరు నదిజంఘుడు. దేవతలకు తొలుత కష్టమును కలిగించిన ఆ అసురుడు బాహ్మణకులములో జన్మించాడు. వాడికి సమాన బలశాలియైన మురుడను పుత్రుడున్నాడు. చంద్రావతీ నగరము మురునికి రాజధాని. ఈ మురాసురుడే దేవతలను స్వర్గము నుండి తరిమివేసి తానే అచట వసిస్తున్నాడు. ఇంద్రుడు, అగ్ని, వాయువు, యముడు, చంద్రుడు, నైరితి, వరుణుడు మున్నగు దేవతల పదవులను వాడే ఆక్రమించినాడు. మేమందరము కలిసి కూడ వాడిని జయింపలేకపోయితిమి. కనుక ఓ విష్ణూ! ఆ అసురుని సంహరించి దేవతలను కాపాడవలసినది” అని అన్నాడు.” “ఇంద్రుని పలుకులను వినిన భగవానుడు దేవతలను పీడించినట్టి ఆ అసురుల పట్ల క్రుద్ధుడై అతనితో “ఓ దేవరాజా! నీ శత్రువైన ఆ అసురుని నేను స్వయంగా వధిస్తాను. ఇపుడు మీరందరు చంద్రావతి నగరానికి బయలుదేరండి అని అన్నాడు. అపుడు దేవతలందరు విష్ణుభగవానుని నాయకత్వంలో చంద్రావతి నగరానికి బయలుదేరారు. ఒక ప్రక్క దేవతలు తమ చెంత ఉన్నట్టి వేలకొలది ఆయుధాలతో యుద్ధసన్నద్ధులు అవుతుండగా, వేరాక ప్రక్క అసంఖ్యాక అసురసేనా పరివృత్తుడై మురాసురుడు గర్జించసాగాడు.” దానవులచే తీవ్రంగా దెబ్బతిని అదివరకే దేవతలు చెల్లాచెదురై యున్నారు. కాని ఇపుడు దేవదేవునిచే నడుపబడుచు దేవతలు నిర్చీతిగా తమ ఎదుట నిలబడుటను చూసి దానవులకు తీవ్రమైన క్రోధం కలిగింది. ఇతర దానవులను ఓడించడము భగవానునికి సులభమే అయినప్పటికిని మురాసురుని ఓడించడము మాత్రము ఆతనికి కష్టతరమైంది. ఎన్ని ఆయుధములను ప్రయోగించినప్పుటికిని మురాసురుని వధించడము సాధ్యపడకపోయేసరికి భగవానుడు ఆ దానవునితో ముష్టియుద్ధానికి దిగి పదివేల సంవత్సరాలు పోరాడాడు. చివరకు భగవానుడు ఆ అసురుని ఓడించి బదరికాశమానికి వెళ్ళాడు. బదిరికాశమములో భగవానుడు హేమవతి అనే సుందరమైన గుహలో ప్రవేశించి విశ్రాంతి తీసికొన్నాడు.
“ఓ అర్జునా! తదనంతరము ఆ దానవుడు నన్ను వెంబడించి గుహలో ప్రవేశించాడు. అచట విశ్రాంతి తీసికొంటున్న నన్ను చూసి అతడు చంపడానికి సన్నద్ధుడయ్యాడు. అపుడు దేదీప్యమానమైన దేవి నా శరీరం నుండి ఉత్పన్నమై, నానావిధములైన దివ్యాయుధములను కలిగినదై ఆ అసురునితో పోరాడడం మొదలుపెట్టింది. దీర్లకాలం యుద్ధం చేసిన తరువాత ఆ దేవి చివరకు అసురుని శిరస్సును ఖండించివేసింది. అపుడు మిగిలిన అసురులు భయంతో పాతాళలోకానికి పారిపోయారు.” విశ్రాంతి నుండి మేల్కొనిన భగవంతుడు తన యెదుట మురాసురుడు మృతుడై పడి యుండడాన్ని, తేజోమయురాలైన దేవి ముకుళితహస్తమై ఎదుట నిలబడి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యముతో “నీవెవరు? అని ఆమెను ప్రశ్నించాడు. “దేవా! నేను నీ దేహం నుండి ఉత్పన్న మై ఈ అసురుని వధించాను. నీవు విశ్రమించి ఉండడాన్ని చూసి ఈ అసురుడు నిన్ను వధించడానికి యత్నించాడు. కనుకనే నేను వీడిని వధించాను” అని దేవి పలికింది. అపుడు భగవంతుడు ఆమెతో “దేవీ! ఈ కార్యానికి నీ పట్ట నేనెంతో ప్రసన్నుడనైనాను. నీకు వాంఛితమైనది కోరుకో” అని అన్నాడు. అపుడు ఆమె ఏదేని వరమును ఇవ్వమని అడుగగా భగవానుడు ప్రసన్నతతో “దేవీ! నీవు నా శక్తివి. నీవు ఏకాదశిరోజు ఉత్పన్న మైతివి కాబట్టి ఇకమై నీ పేరు ఏకాదశి. ఏకాదశి వ్రతాన్ని పాటించే ఎవ్వడైనా సరే సమస్త పాపదూరుడై నశింపు లేనట్టి స్వర్గసాఖ్యాలను పొందుతాడు” అని అన్నాడు. “ఆనాటి నుండి ఏకాదశి ఈ జగత్తులో చక్కగా పోషింపబడుచు పూజింపబడుచున్నది. ఓ అర్జునా! ఏకాదశి వ్రతాన్ని పాటించేవానికి నేను పరమగతిని ప్రసాదిస్తాను. ఓ కౌంతేయా! ద్వాదితో కలిసిన ఏకాదశి ఎంతో ఉత్కష్టమైంది. ఏకాదశిరోజు మనుజుడు మైథునభోగాన్ని త్యజించాలి; ధాన్యాన్ని, తేనెను, కంచుపాత్రలో భోజనమును విడిచిపెట్టాలి; నూనె రాసుకోకూడదు. ఈ ఏకాదశిని మనిషి పాటించినచో, దీని మాహాత్మ్యాన్ని వినినచో మరిన్ని ఉన్నతమైన ఫలితాలను పొందుతాడు.”
మాసం:(చంద్రమాసం) -
కేశవ,మార్గశిర
తిథి:(చంద్ర
రోజు)-ఏకాదశి
పక్షం:శుక్లపక్ష
మోక్షద ఏకాదశి మార్గశిర మాసం శుక్షపక్షంలో వస్తుంది. ఈ ఏకాదశి మాహాత్మ్యము శ్రీకృష్ణధర్మరాజుల సంవాదరూపంలో బ్రహ్మాండ పురాణములో వర్ణించబడింది. “కృష్ణా! మార్గశిరమాసం శుక్షపక్షంలో వచ్చే ఏకాదశి కేరేమిటి? ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని నాకు వివరించవలసినది” అని ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని అడిగాడు. దానికి బదులుగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు : “ఓ రాజ్యశేష్టుడా! ఈ ఏకాదశి సమస్త పాపాలను నశింపజేస్తుంది. ఆ రోజున భగవానుని తులసీమంజరులతో పూజిస్తే ఆ దేవదేవుడు అతి ప్రసన్నుడౌతాడు. ఈ ఏకాదశిని చేయడం ద్వారా వాజపేయ యజ్ఞనిర్వహణ _ ఫలం కలుగుతుంది.” “వెకానసుడనే రాజు చంపకనగరాన్ని పాలించేవాడు, ఆ రాజు ప్రజల పట్ల ఎంతో అనురాగము ఉన్నవాడు. వేదజ్ఞానపారంగతులైన ఎందరో బ్రాహ్మణులు అతని రాజ్యంలో జీవించేవారు. తన తండ్రి నరకములో పడి అక్కడ అనంతదుఃఖాలను అనుభవిస్తున్నట్లు ఆ రాజుకు ఒక రోజు కల వచ్చింది. అది చూసిన రాజు దిగ్భ్రాంతి చెందాడు. మర్నాడు అతడు (బాహ్మణుల సభలో తన కలను వెల్లడించాడు. నారకీయస్థితి నుండి తనను ఉద్ధరించమని తన తండ్రి అర్థించినట్టుగా కూడ రాజు వారికి తెలియజేసాడు. ఆ కల గనిన నాటి నుండి రాజు శాంతిని కోల్పోయాడు; రాజ్యపాలనలో ఎటువంటి సుఖము గాని, అభిరుచి గాని అతనికి కనబడలేదు. చివరకు కుటుంబసభ్యులతో కూడ అతడు ఉదాసీనంగా వ్యవహరించసాగాడు. తండ్రి నరకంలో 'మగ్గుతుంటే తనయుని యొక్క జీవితము, రాజ్యము, సంపద, బలము, ప్రభావము అన్నీ వ్యర్థమేనని అతడు తలచాడు. అందువలన అతడు తన తండ్రి నరకబంధము నుండి బయటపడే మార్గాన్ని తెలుపుమని బ్రాహ్మణులకు వినతి చేసికొన్నాడు.” అది వినిన బ్రాహ్మణులు రాజుతో ఇలా అన్నారు : “రాజా! ఇక్కడకు దగ్గరలోనే పర్వతముని ఆశ్రమము ఉన్నది. అతడు త్రికాలజ్ఞుడు. నీ స్వప్న వృత్తాంతాన్ని ఆయనకు తెలపండి” వారి సలహాను వినిన వైకానసుడు బబాహ్మణులతోను, ప్రజలతోను కూడినవాడై పర్వతముని ఆశమానికి వెళ్ళాడు. రాజ్య క్షేమం గురించి పర్వతముని రాజును అడిగినంతట వైకానసుడు ఆయనతో “న్వామీ! మీ అన్నుగహం చేత మేమంతా కుశలమే. కాని రాజ్యసంపదలు ఉన్నప్పటికిని నేను గొప్ప కష్టములో చిక్కుకున్నాను. నిజానికి నా మనస్సులో ఒక గొప్ప సందేహము చెలరేగింది; దానిని తీర్చుకోవడానికే మీ పాదపద్మాల చెంతకు వచ్చాను అని అన్నాడు. రాజు వలన సమస్త వివరాలను వినిన పర్వతముని సమాధిమగ్నుడయ్యాడు. తరువాత కొంత తడవుకు ఆయన ధ్యానసమాధి నుండి బహిర్ముఖుడై రాజుతో “రాజా! నీ తండ్రి గతజన్మలో అతికాముకుడైనందున నరకములో పడినాడు. కనుక మార్గశిరమాసంలోని శుక్షపక్షంలో వచ్చే ఏకాదశిని మీరందరు కచ్చితంగా పాటించి ఆ పుణ్యాన్ని అతనికి ధారపోయాలి. మీ అందలి పుణ్యప్రభావం చేత అతడు నారకీయజీవనం నుండి బయటపడతాడు” అని అన్నాడు. పర్వతముని పలుకులను వినిన తరువాత రాజు తన పరివారంతో పురానికి తిరిగివచ్చాడు. అటుపేమ్మట రాజు తన భార్యాపుత్రులతోను, అనుయాయులతోను కలిసి మార్గశిరమాసంలోని శుకపకంలో వచే ్ ఏకాదశిని విధిగా నిర హించి ఆ పుణ్యాన్నంతా తన తండ్రికి ధారపోసాడు. ఆ న్హఐక్ష పుణ్యప్రభావం చేత అతని తండ్రికి స్వర్గప్రాప్తి కలిగి పుత్రుని ఎంతో దీవించాడు. “కనుక ఓ రాజా! ఈ మోక్షద ఏకాదశిని యథావిధిగా పాటించేవాడు నిక్కముగా సమస్త పాపాల నుండి బయటపడతాడు”