2004 వ సంవత్సరం లో ఇస్కాన్ రాజమండ్రి లో మొట్టమొదటిసారి రథ యాత్ర చేయుటకు పూరి ధామం నుండి జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాయ్యా కొయ్య అర్చా విగ్రహాలను ఇస్కాన్ రాజమండ్రి కి తీసుకురావడం జరిగింది. ఆవిధముగ స్వామి వారు ఇస్కాన్ రాజమండ్రి మందిరంలో కొలువయ్యారు. ప్రపంచంలోని ప్రతి నగరంలో జగన్నాథ రథయాత్ర ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని శ్రీల ప్రభుపాదులకు గోప్ప ఆశయం ఉంది మరియు ఈ వార్షిక పండుగను ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో ప్రసిద్ధి చెందేలా శ్రీల ప్రభుపాదుల వారు తన శిష్యులను ప్రేరేపించి, మార్గనిర్దేశం చేశారు. 2006 ఆగష్టు 9 వ తారీకున జయపతాక స్వామి గురుమహారాజ్ మరియు భక్తుల ఆద్వర్యంలో విగ్రహ ప్రతిష్ట జరిగింది.