శ్రీ చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్రకి సన్నద్ధం అయినప్పుడు సార్వభౌమ భట్టాచార్య అక్కడ గవర్నర్ రామానందరాయిని(భక్తుని) కలవమన్నారు. మహాప్రభు దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలో గోదావరి నది స్నానం ఆచరించి ఆ ప్రదేశాన్ని మరింత పవిత్రం చేసారు. త్రిదండి జయపతాక స్వామి మహారాజ్ కోరిక మేరకు జైపూర్ నుండి తెల్ల పాల రాతి విగ్రహాలను ఇస్కాన్ రాజమహేంద్రవరంకు తీసుకురావడం జరిగింది. 2012 వ సంవత్సరంలో త్రిదండి జయపతాక స్వామి మహారాజ్ మరియు భక్తుల ఆద్వర్యంలో విగ్రహ ప్రతిష్ట జరిగింది.