గోవింద శ్రీనివాస్ విగ్రహాన్ని రాజమహేoద్రవరంలోనే భక్తుల చేతుల మీద తయారుచేయటం ప్రత్యేకత. 2006 ఆగష్టు 9 వ తారీకున జయపతాక స్వామి గురుమహారాజ్ మరియు భక్తుల ఆద్వర్యంలో విగ్రహ ప్రతిష్ట జరిగింది. ప్రతీ శుక్రవారం 7:00 గంటలకు మహా అభిషేకం జరుగుతుంది, ఆ అభిషేకాని భక్తులందరూ తిలకిస్తూ భక్తిపారవశ్యంలో తేలియాడుతున్నారు. భక్తుల భావాలను బట్టి భగవంతుడి ముఖకవళికలు మారుతాయనడంలో రాజమండ్రి గోవిందుడు ప్రత్యాక ఉదాహరణ, ఎంతో సుందరంగా, శాంత మూర్తి వలే భక్తులను పరవశిoపచేస్తుంటారు.